ఆకుల సత్యనారాయణ

ఆకుల సత్యనారాయణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014 నుండి 2019 వరకు రాజమండ్రి అర్బన్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించాడు.

ఆకుల సత్యనారాయణ
ఆకుల సత్యనారాయణ


శాసనసభ్యుడు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
16 మే 2014 2019 - 21 జనవరి 2019
నియోజకవర్గం రాజమండ్రి అర్బన్ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1964
రాజమండ్రి, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు జనసేన పార్టీ (2019-2020 )
భారతీయ జనతా పార్టీ (2014-2019)
జీవిత భాగస్వామి లక్ష్మి పద్మావతి

జననం, విద్యాభాస్యం మార్చు

ఆకుల సత్యనారాయణ 1964లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తూర్పు గోదావరి జిల్లా, రాజమండ్రిలో జన్మించాడు. ఆయన 1992లో ఎం.ఎస్., ఆర్థో పూర్తి చేసి, ఉస్మానియా మెడికల్ కాలేజ్ నుండి 1985లో ఎం.బి.బి.ఎస్ పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం మార్చు

ఆకుల సత్యనారాయణ 2014 ఎన్నికల్లో రాజమండ్రి అర్బన్ నియోజకవర్గం నుంచి బీజేపి అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 2019 ఎన్నికలకు ముందు 21 జనవరి 2019న పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో చేరాడు.[1] ఆయన పార్లమెంట్ ఎన్నికల్లో రాజమండ్రి నియోజకవర్గం నుంచి లోక్ సభకు పోటీచేసి ఓడిపోయాడు. ఆ తర్వాత జనసేన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ జనసేనకు రాజీనామా చేసి 8 అక్టోబర్ 2019న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. [2]

మూలాలు మార్చు

  1. Hmtv (21 January 2019). "జనసేనలో చేరిన మరో ఎమ్మెల్యే". Archived from the original on 27 November 2021. Retrieved 27 November 2021.
  2. The Hindu (8 October 2019). "Former MLA Akula Satyanarayana, former MLC Jupudi Prabhakar join YSR Congress" (in Indian English). Archived from the original on 27 November 2021. Retrieved 27 November 2021.