ఆకెళ్ళ సత్యనారాయణమూర్తి

ఆకెళ్ళ సత్యనారాయణమూర్తి (జూన్ 30, 1946 - మార్చి 17, 1992) ప్రముఖ నాటక రచయిత, నటుడు, ఆకాశవాణి వ్యాఖ్యాత.[1]

ఆకెళ్ళ సత్యనారాయణమూర్తి
ఆకెళ్ళ సత్యనారాయణమూర్తి
జననంజూన్ 30, 1946
మరణంమార్చి 17, 1992
జాతీయతభారతీయుడు
వృత్తినాటక రచయిత, నటుడు , ఆకాశవాణి వ్యాఖ్యాత

సత్యనారాయణమూర్తి 1946, జూన్ 30న వెంకట సూర్యారావు, వెంకటలక్ష్మి దంపతులకు రాజమహేంద్రవరంలో జన్మించాడు.

విద్యాభ్యాసం - ఉద్యోగం

మార్చు

ఎం.ఎ. ఇంగ్లీష్ తోపాటు, రంగస్థల విద్యలో పిజి డిప్లమా పూర్తిచేశాడు. విజయవాడ, హైదరాబాదులోని ఆకాశవాణి కేంద్రాల్లో ఇరవై సంవత్సరాలు అనౌన్సరుగా పనిచేశాడు.

రంగస్థల ప్రస్థానం

మార్చు

1980లో సత్యనారాయణమూర్తి రాసిన పెద్దబాలశిక్ష అనే వీధి నాటకం తెలుగు నాటకరంగంలో ఆధునిక వీధి నాటక ఉద్యమంలో అనేకమార్లు ప్రదర్శించబడింది.

రచించిన నాటకాలు

మార్చు
  1. పెద్దబాలశిక్ష (1980)
  2. మందిరాజ్యం (1987)
  3. సత్యకామేష్టి (1989)

రేడియో నాటకాలు

మార్చు
  1. కళ్యాణ వైభోగం
  2. రైలు కదిలింది
  3. అలవల కలబుల
  4. రహస్యం
  5. కల్పన

సత్యనారాయణమూర్తి 1992, మార్చి 17న మరణించాడు.

మూలాలు

మార్చు
  1. నాటక విజ్ఞాన సర్వస్వం, తెలుగు విశ్వవిద్యాలయం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.623.