జూన్ 30
తేదీ
జూన్ 30, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 181వ రోజు (లీపు సంవత్సరములో 182వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 184 రోజులు మిగిలినవి.
<< | జూన్ | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | ||||||
2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 |
9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 |
16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 |
23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 |
30 | ||||||
2024 |
సంఘటనలు
మార్చు- 1893: ఎక్సెల్సియర్ అనే పేరు గల వజ్రాన్ని (నీలం - తెలుగు రంగు 995 కేరట్స్ బరువు) కనుగొన్నారు.
- 1914: మహాత్మా గాంధీ ని, దక్షిణ ఆఫ్రికా లో, భారత ప్రజల హక్కుల కోసం పోరాడుతున్న సమయంలో మొదటిసారిగా అరెస్టు చేసారు.
- 1996: 1996 యూరోకప్ ఫుట్బాల్ ట్రోఫీని జర్మనీ జట్టు గెలిచింది.
- 1935: ఆస్టరాయిడ్#1784 (బెన్గెల్లా) ని సి.జాక్సన్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు.
- 1936: మార్గరెట్ మిచెల్ వ్రాసిన నవల గాన్ విత్ ద విండ్ ముద్రించారు.
- 1936: 'వారానికి నలభై గంటల పని విధానాన్ని' అమలు చేసే ఫెడరల్ చట్టాన్ని అమెరికాలో అమలు చేయడం జరిగింది.
- 1940: డాల్ మెస్సిక్ తయారు చేసిన బ్రెండా స్టార్ అనే కార్టూన్ స్ట్రిప్ మొదటిసారిగా కనిపించింది.
- 1948: రేడియోలో వాడే ట్యూబులకి బదులుగా ట్రాన్సిస్టర్స్ని వాడవచ్చునని బెల్ లాబరేటరీస్ ప్రకటించింది.
- 1960: జైరీ (పూర్వపు బెల్జియన్ కాంగో) అనే దేశం, బెల్జియం నుంచి స్వాతంత్ర్యం పొందింది.
- 1962: రువాండా, బురుండీ అనే రెండు దేశాలు స్వాతంత్ర్యం పొందాయి.
- 1971: రష్యన్ వ్యోమ నౌక సోయుజ్ రోదసి నుంచి తిరిగి భూమి మీదకు వస్తున్న సమయంలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు వ్యోమగాములు మరణించారు.
జననాలు
మార్చు- 1833: మండపాక పార్వతీశ్వర శాస్త్రి, సంస్కృతాంధ్ర కవి, పండితులు. (మ.1897)
- 1906: త్రిభువన్, నేపాల్ రాజు (మ. 1955).
- 1928: జె.వి. సోమయాజులు, రంగస్థల, సినిమా, బుల్లితెర నటుడు. (మ.2004)
- 1934: చింతామణి నాగేశ రామచంద్ర రావు, భారతీయ శాస్త్రవేత్త, భారతరత్న పురస్కార గ్రహీత.
- 1939: సుంకర వెంకట ఆదినారాయణరావు, పేరుపొందిన ఎముకల వైద్యనిపుణుడు.
- 1941: ఉప్పలపాటి సైదులు, పౌరాణిక రంగస్థల కళాకారుడు.
- 1948: తమ్మారెడ్డి భరద్వాజ, తెలుగు సినిమా నిర్మాత, దర్శకులు.
- 1969: సనత్ జయసూర్య, శ్రీలంక క్రికెట్ క్రీడాకారుడు
- 1970: అరవింద్ స్వామి , చలనచిత్ర నటుడు, మోడల్, పారిశ్రామిక వేత్త.
- 1973: సితార , ప్రముఖ దక్షిణ భారత చిత్రాల నటి
- 1977: శివాజీ , తెలుగు చలనచిత్ర నటుడు, వ్యాఖ్యాత .
- 1977: సురేఖ వాణి, తెలుగు,తమిళ చిత్రాల సహాయ నటి.
- 1978: ఇంద్రజ , తెలుగు, మళయాల చిత్రాల నటి, గాయని.
- 1982: అల్లరి నరేష్, సినిమా నటుడు, తెలుగు సినిమా దర్శకుడు ఇ.వి.వి.సత్యనారాయణ ద్వితీయ కుమారుడు.
మరణాలు
మార్చు- 1897: మండపాక పార్వతీశ్వర శాస్త్రి, సంస్కృతాంధ్ర కవి, పండితులు. (జ.1833)
- 1917: దాదాభాయి నౌరోజీ, భారత జాతీయ నాయకుడు. (జ.1825)
- 1953: బలిజేపల్లి లక్ష్మీకాంతం, స్వాతంత్ర్య సమరయోధులు, అవధాని, నాటక రచయిత, రంగస్థల, సినిమా నటులు. (జ.1881)
- 1961: లీ డి ఫారెస్ట్, తెర మీది బొమ్మకు తగ్గట్లుగా శబ్దాన్ని జత చేసే 'ఫోనో ఫిల్మ్' ప్రక్రియను కనుగొన్న అమెరికన్ ఆవిష్కర్త. (జ.1873)
- 1967: వామన్ శ్రీనివాస్ కుడ్వ, సిండికేట్ బ్యాంకు వ్యవస్థాపకులలో ఒకరు. (జ.1899)
- 1984: రాయప్రోలు సుబ్బారావు, తెలుగు కవి. (జ.1892)
- 1985: కె.హెచ్. ఆరా, చిత్రకారుడు (జ. 1914)
- 1988: సుత్తి వీరభద్ర రావు, తెలుగువారికి సుపరిచితమైన హాస్యనటుడు, రేడియో, నాటక కళాకారుడు. (జ.1947)
- 2014: సూర్యకళ, పాతతరం తెలుగు చలన చిత్ర నటి, పలు దక్షిణాది భాషల్లో నటించిన నటి(జ.1942)
- 2019: నల్లగారి రామచంద్ర తెలుగు కథా రచయిత, కవి, నవల, నాటక రచయిత. (జ.1939)
పండుగలు , జాతీయ దినాలు
మార్చు- అంతర్జాతీయ గ్రహశకల దినోత్సవం (ఆస్టరాయిడ్ దినోత్సవం)
- ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం .
- అంతర్జాతీయ పార్లమెంటరీ దినోత్సవం
బయటి లింకులు
మార్చు- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : జూన్ 30
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు[permanent dead link]
జూన్ 29 - జూలై 1 - మే 30 - జూలై 30 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |
l'Arunachal Pradesh