ఆఖరీ ఖత్
ఆఖరీ ఖత్, 1966 డిసెంబరు 30న విడుదలైన హిందీ సినిమా. హిమాలయ ఫిల్మ్స్ బ్యానరులో చేతన్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాతో రాజేష్ ఖన్నా బాలీవుడ్ కు పరిచయం అయ్యాడు.[1] ఇందులో ఇంద్రాణి ముఖర్జీ, మాస్టర్ బంటీ, నానా పాల్సికర్ తదితరులు నటించారు. ఈ సినిమాకు ఖయ్యామ్ సంగీతం అందించగా, కైఫీ అజ్మీ పాటలు రాశాడు; లతా మంగేష్కర్ పాడిన "బహరోన్ మేరా జీవన్ భీ సన్వారో" పాటకు మంచి స్పందన వచ్చింది. బాలీవుడ్ గైడ్ కలెక్షన్స్‌లో ఈ సినిమాకు 5 స్టార్ రేటింగ్ ఇవ్వబడింది.
ఆఖరీ ఖత్ | |
---|---|
దర్శకత్వం | చేతన్ ఆనంద్ |
రచన | చేతన్ ఆనంద్ |
నిర్మాత | హిమాలయ ఫిల్మ్స్ |
తారాగణం | రాజేష్ ఖన్నా ఇంద్రాణి ముఖర్జీ |
ఛాయాగ్రహణం | జల్ మిస్త్రీ |
కూర్పు | జాదవ్ రావు |
సంగీతం | ఖయ్యామ్ కైఫీ అజ్మీ (పాటలు) |
పంపిణీదార్లు | ప్రభ పిక్చర్స్ |
విడుదల తేదీ | 1966, డిసెంబరు 30 |
సినిమా నిడివి | 114 నిముషాలు |
దేశం | భారతదేం |
భాష | హిందీ |
చేతన్ ఆనంద్, ఈ సినిమా స్క్రిప్ట్ తో 15 నెలలపాటు నగరంలో తన కెమెరాతో సినిమాటోగ్రాఫర్ జల్ మిస్త్రీతో కలిసి ఎక్కువగా చేతితో పట్టుకున్న కెమెరాతో, నగరంలోని అన్ని శబ్దాలను తీసుకున్నాడు.[2] 1967లో జరిగిన 40వ అకాడమీ అవార్డులలో ఉత్తమ విదేశీ భాషా చిత్ర విభాగంలో తొలిసారిగా భారతదేశం తరపున ఎంట్రీకి పంపబడింది, కాని నామినీగా అంగీకరించబడలేదు.[3][4]
1979లో శివకుమార్, సుజాత జంటగా పూంతాలిర్ పేరుతో తమిళంలో, 1981లో చిన్నారి చిట్టిబాబుపేరుతో తెలుగుతో రిమేక్ అయింది.[5]
నటవర్గం
మార్చు- రాజేష్ ఖన్నా (గోవింద్)
- ఇంద్రాణి ముఖర్జీ (లజ్జో)
- మాస్టర్ బంటీ (బంటు)
- నానా పాల్సికర్
- మన్వేంద్ర చిట్నిస్ (ఇన్స్పెక్టర్ నాయక్)
- మోహన్ చోటి (మోతీ)
- తున్ తున్
- మారుతి రావు
- నకి జెహన్
పాటలు
మార్చుUntitled | |
---|---|
ఈ సినిమాకు ముహమ్మద్ జహూర్ ఖయ్యాం సంగీతం అదించాడు. భూపిందర్ సింగ్ సోలో సింగర్ గా అరంగేట్రం చేసాడు.[6]
పాట | గాయకులు |
---|---|
"ఔర్ కుచ్ డెర్ తహార్" | ముహమ్మద్ రఫీ |
"బహరోన్ మేరా జీవన్ భీ సన్వారో" | లతా మంగేష్కర్ |
"మేరే చందా మేరే నాన్హే" | లతా మంగేష్కర్ |
"ఓ మై డార్లింగ్" | మన్నా డే |
"రూట్ జవాన్ జవాన్ రాత్ మెహర్బాన్" | భూపిందర్ సింగ్ |
మూలాలు
మార్చు- ↑ "'Few paid attention to Rajesh Khanna's debut film'". Rediff. Retrieved 2021-06-12.
- ↑ Biswas, Premankur (16 November 2007). "Chetan Anand, My Father". The Indian Express. Archived from the original on 30 September 2012. Retrieved 2021-06-12.
- ↑ Margaret Herrick Library, Academy of Motion Picture Arts and Sciences
- ↑ "Rajesh Khanna and His Films". BollywoodMantra. Archived from the original on 2021-06-12. Retrieved 2021-06-12.
- ↑ ""Yevo Gusagusalu Paade – Chinnari Chitti Babu" (1981) – Telugu Feature Film". The Southern Nightingale. 2017-01-19. Archived from the original on 2021-06-12. Retrieved 2021-06-12.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2021-06-12. Retrieved 2021-06-12.