ఆగ్నేయం
ఆగ్నేయం (Southeast) తూర్పుకి దక్షిణానికి మధ్య ఉన్న దిక్కు.
నానార్థాలు
మార్చుతూర్పు, దక్షిణ దిక్కుల మధ్య ఉండే మూల (దిక్కు) అనేగాక, వివాహంలో నూతన దంపతులు అరుంధతీ నక్షత్ర దర్శనం చేసిన తరువాత వారు యజుశ్శాఖాధ్యాయులైతే వారి చేత చేయించే ఒక యజ్ఞమనీ, దశాహ శ్రాద్ధం అని అర్థాలు ఉన్నాయి.[1]
ఆగ్నేయం - అగ్నిదేవతాకము, నేయి, నెత్తురు, బంగారము, కృత్తికానక్షత్రం, ఆగ్నేయాస్త్రము, భస్మస్థానము, ఒకానొక వ్రతము. అని అర్థాలు కూడా ఉన్నాయి.
జ్యోతిషం
మార్చుఆగ్నేయమూలకు గ్రహాధిపతి శుక్రుడు. పాలకుడు అగ్నిదేవుడు. వాహనము మేక. శుక్రుడు (రాక్షస గురువు). రాక్షసులకు ఉన్న వేగము, పాలకుడైన అగ్నిదేవునికి ఉన్న శక్తి ఈ ఆగ్నేయ మూలకు ఉంది. అందుచేత ఆగ్నేయ మూలలో అతి పనికిరాదు. అన్ని మూలలు దిక్కులకంటే అత్యంత సూక్ష్మంగా ఆగ్నేయ దిక్కును చూసుకోవాల్సి ఉంటుంది. ఏమాత్రం పొరపాటు చేసినా విపరీత పరిణామాలు తప్పవని వాస్తు నిపుణులు తెలుపుతుంటారు.[2]
వాస్తు శాస్త్రం ప్రకారం వంటగది ఆగ్నేయ దిశలో ఉండాలి. దక్షిణ ఆగ్నేయంలో స్థలం పెరిగితే పరవాలేదు. దక్షిణ ఆగ్నేయదిక్కులో పెరగడం అంటే, దక్షిణ నైరుతి దిశలో తగ్గుతుంది అన్నమాట. నైరుతి వైపున స్థలం తరిగి ఉండటం మంచిదే. దక్షిణ ఆగ్నేయంలో పెరిగిన స్థలంతో కలిపి, ఉత్తర ఈశాన్యంలో ఖాళీ స్థలం కంటే తక్కువ ఉండాలి. దక్షిణ ఆగ్నేయం సంగతి అలా ఉంటే, తూర్పు ఆగ్నేయంలో స్థలం పెరగకూడదు. అలా పెరిగితే దుష్ఫలితాలు తప్పవు. అని వాస్తుశాస్త్రం చెబుతుంది.[3] వాయవ్య కన్నా ఆగ్నేయం తక్కువ ఎత్తులో ఉండే స్థలంలో గృహ నిర్మాణం చేయరాదు.
మూలాలు
మార్చు- ↑ పారమార్థిక పదకోశం (పొత్తూరి వేంకటేశ్వరరావు) 2010
- ↑ SELVI.M. "ఆగ్నేయం... వాస్తు దోషాలు... దుష్పలితాలు..!". telugu.webdunia.com. Retrieved 2020-07-05.
- ↑ "ఆగ్నేయంలో పెరిగితే లేదా తరిగితే ఏమౌతుంది? (Vastu - Agneyam)". TeluguOne Devotional (in english). 2020-07-05. Retrieved 2020-07-05.
{{cite web}}
: CS1 maint: unrecognized language (link)
బాహ్య లంకెలు
మార్చు- "ఆగ్నేయ దిశ విశిష్టత:ఆగ్నేయ దిశలో వాస్తుదోషాలు ఉంటే కలిగే చెడు ఫలితాలు". www.youtube.com. Retrieved 2020-07-05.