ఆణివిళ్ళ వేంకట శాస్త్రి
ఆణివిళ్ళ వేంకట శాస్త్రి శాస్త్ర పారంగతులు, బాలకాళిదాసు బిరుదాంకితులు. ఈయన మఱియొక పేరు వేంకట సోమయాజులు.
జీవిత విశేషాలు
మార్చుఈయన పశ్చిమ గోదావరి జిల్లా కాకరపర్తికి (కాకరపర్రు) చెందిన ఆణివిళ్ళ యజ్ఞ నారాయణ గారి కుమారుడు. ఈయన 18 వ శతాబ్దానికి చెందినవారు. బాల కాళిదాస బిరుదాంకితుడైన ఆణివిళ్ళ వేంకట శాస్త్రి సర్వ శాస్త్ర పారంగతుడు సకల శాస్త్ర వైదుష్యం ఉండటం చేత పెద్దాపురం సంస్థానం మహా ప్రభువులు, దార్లపూడి, విజయనగరం మహా రాజుల చేత గొప్ప సన్మానాలు పొందాడు .[1] వేంకట శాస్త్రి గారి గురువు గారు పాలంకి బ్రహ్మయజ్వులు గారు, వీరు అరవై నాలుగు శాస్త్రముల పండితులు.
రచనలు
మార్చు- మహేశ్వర మహా కావ్యం [2] [3]
- సతీ స్తోత్రం [2] [3]
- భాస్కర ప్రశస్తి [2]
- రుక్మిణీ పరిణయం కావ్యం రాశారు. [2] [4]
- అలంకార సుధాసింధువు [2] [5]
- రస ప్రపంచము [2] [6]
- అప్పారాయ యశశ్చంద్రోదయము [2] [7]
- ఆపస్తంబ (శ్రౌత సూత్ర వ్యాఖ్య) [2]
వేంకట శాస్త్రి గారు గొప్ప అలంకారికులు. అలంకార సుధా సింధు రస ప్రపంచం ఆతని శేముషికి నిదర్శనాలు . చిత్ర చమత్కార మంజరిని పెద్దాపురం రాజు వత్సవాయి తిమ్మ జగపతికి అంకితమిచ్చారు.[8] చిత్ర కవిత్వముగా సూర్య శతకం రాసారు.[8] ఆణివిళ్ళ వేంకటశాస్త్రి గారికి వార్ధక్య దశలో పెద్దాపురం సంస్థానం వారు అగ్రహారం ప్రసాదించాలని సంకల్పించగా అప్పటి మంత్రి పాణంగిపల్లి రామచంద్రుడు గారి కుతంత్రము వల్ల నెరవేరలేదట. పాణంగిపల్లి రామచంద్రుడు తూర్పు గోదావరి జిల్లా, కె.గంగవరం మండలానికి చెందిన పాణంగిపల్లి, గ్రామమును అగ్రహారంగా పొందే నిమిత్తం అలా చేసాడని లోకోక్తి.[9] నూజివీడు జమీందారులు మేక వెంకట నరసింగ అప్పారావుపై అప్పారాయ యశశ్చంద్రో దయ కావ్యాలు రాసారు.[2][7] దీనియందు చంద్రుని కళలవలె పదహారు అధ్యాయములు కలవు. వానికి కళలని పేరు, అలంకారశాశ్త్రీయ విషయములన్నియు ఇందు సంగృహీతములు [7] మెచ్చిన రాజు వల్లూరుపల్లి అగ్రహారాన్ని ప్రదానం చేసారు. అక్కడ సోమయాగం చేసారు. “శ్రౌత సూత్రాలు” పై భాష్యం రాసారు.[9] వేంకట శాస్త్రి గారు సోమయాగం చేయడం వలన వేంకట సోమయాజులు గారు అయ్యారు.
ఆణివిళ్ళ యజ్ఞ నారాయణ
మార్చుఆణివిళ్ళ వేంకట శాస్త్రి తండ్రి ఆణివిళ్ళ యజ్ఞ నారాయణకు మంచి సాహిత్యజ్ఞానం ఉంది. క్లిష్టమైన శ్లేష కవిత్వానికి అర్థం చెప్పగలరు. ఈయన ఆణివిళ్ళ వేంకట శాస్త్రి గారి తండ్రి. తన కుమారుడు రచించిన చిత్రబంధ రామాయణం అనే క్లిష్టమైన కావ్యానికి వ్యాఖ్యానం రాశారు.[10]
మూలాలు
మార్చు- ↑ ఆంధ్ర సంస్థానములు సాహిత్య పోషణము, డా. తూమాటి దొప్పన్న, పేజీ నం. 272
- ↑ 2.0 2.1 2.2 2.3 2.4 2.5 2.6 2.7 2.8 తెలుగు సాహిత్యకోశము ప్రాచీన సాహిత్యము, బి విజయభారతి (పరిష్కర్త) (1980) పుట 75
- ↑ 3.0 3.1 తిరుమల తిరుపతి దేవస్థానం, మాతల్లి గోదావరి, ప్రత్యేక సంచిక, 2003, పుట 52
- ↑ రావూరి దొరస్వామిశర్మ, దండక వాజ్మయము, రాయ జగపతి రాజ రచిత బద్రాద్రి రామ దండకము, ఆంధ్ర పత్రిక, సంవత్సరాది సంచిక, హేమలంబ 1957
- ↑ తిరుమల రామచంద్ర, పరిశోధన (సారస్వత ద్విమాస పత్త్రిక), 1955 ఏప్రిల్-మే సంచిక, పుట 88
- ↑ తిరుమల రామచంద్ర, పరిశోధన (సారస్వత ద్విమాస పత్త్రిక), 1955 ఏప్రిల్-మే సంచిక, పుట 90
- ↑ 7.0 7.1 7.2 తిరుమల రామచంద్ర, పరిశోధన (సారస్వత ద్విమాస పత్త్రిక), 1955 ఏప్రిల్-మే సంచిక, పుట 87
- ↑ 8.0 8.1 తెలుగు వారి సంస్కృత భాషా సేవ, పి.శ్రీరామమూర్తి (1975) - పుట 37
- ↑ 9.0 9.1 కధలు గాధలు, చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి - పుట 180
- ↑ సమగ్ర ఆంధ్ర సాహిత్యం - ఆరుద్ర, 1965, తెలుగు అకాడమీ, పునఃప్రచురణ 2012 వ సంవత్సరం, పుట 950