ఆదర్శ లోకాలు (నాటకం)
ఆదర్శ లోకాలు కె.ఎల్. నరసింహారావు 1948లో రాసిన సాంఘీక నాటకం.[2][3] గాంధీ స్మారక దినోత్సవం సందర్భంగా 1948, ఫిబ్రవరి 12న మునగాల గ్రామంలో ఈ నాటకాన్ని ప్రదర్శింపజేశాడు.[4]
ఆదర్శ లోకాలు | |
ఆదర్శ లోకాలు పుస్తక ముఖచిత్రం | |
కృతికర్త: | కె.ఎల్. నరసింహారావు[1] |
---|---|
దేశం: | భారతదేశం |
భాష: | తెలుగు |
ప్రక్రియ: | నాటకం |
ప్రచురణ: | అభ్యుదయ ప్రెస్ (విజయవాడ), కళావాణి ప్రచురణలు (రేపాల) |
విడుదల: | 1948 |
పేజీలు: | 107 |
కథానేపథ్యం
మార్చుఎన్నో విప్లవశక్తుల త్యాగఫలంగా భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. త్యాగాల విలువ తెలియని అభివృద్ధి నిరోధకులు, మత అహంకారులు, గుండాలు మన దేశంలో అల్లకల్లోలాలు సృష్టిస్తున్నారు. అలాంటి వారినుండి దేశాన్ని రక్షించుకోవడం ద్వారానే ఆదర్శలోకాలు ఏర్పడుతాయని ఈ నాటక సారాంశం.
పాత్రలు
మార్చు- అబ్బాస్ (ముస్లిం యువకుడు, 25 సం.)
- మధు (హిందూ యువకుడు, 24 సం.)
- సేఠ్జీ (పెట్టుబడిదారు, 45 సం.)
- శివరామయ్య (అగ్రహారికుడు, 50 సం.)
- రఘుపతి (గుండా నాయకుడు, 29 సం.)
- బలరాం (గుండా నాయకుడు, 27 సం.)
- లీల (సేఠ్జీ కూతురు, 16 సం.)
- ప్రభ (సంగీత పాఠకురాలు, 15 సం.)
- భిక్షకుడు
- వాలంటీర్లు
- ప్రజలు
మొదటి ప్రదర్శన
మార్చు- పరగణా కాంగ్రెస్, స్టేట్ కాంగ్రెస్ సాయంతో 1948, ఫిబ్రవరి 12న మునగాలలో 10వేలమంది సమక్షంలో మొదటి ప్రదర్శన ఇవ్వబడింది.
నటవర్గం
- వి.ఆర్.కె. మూర్తి (అబ్బాస్)
- కె.ఎం. శ్రేష్ఠి (మధు)
- టి.ఆర్. ఆచార్య (సేఠ్జీ)
- వి.ఆర్. నాయకులు (శివరామయ్య)
- ఎస్.ఎల్. దాస్ (రఘుపతి) (గుండా నాయకుడు, 29 సం.)
- ఎం. అబ్బయ్య (బలరాం)
- కె. లక్ష్మయ్య (లీల)
- వి.ఎన్. సింహం (ప్రభ)
- సి.ఎస్. నారాయణరావు (భిక్షకుడు)
- గంథం నర్సయ్య (భిక్షక కుర్రవాడు)
- ఎం.ఎల్. నారాయణ, ఎం. మల్లేశ్వర్ (వాలంటీర్లు)
- ఎస్. రామదాస్ (ప్రజలు)
సాంకేతికవర్గం
- రచన, దర్శకత్వం: కె.ఎల్. నరసింహారావు
- పద్యాలు: వారణాసి వెంకటనారాయణశాస్త్రి
- పాటలు: వారణాసి కె.ఎల్, శ్రీరామకవచం సత్యనారాయణ
- ఆర్ట్, మేకప్: ఎం.వి. భద్రం
- హార్మోనియం: తేరాల సూర్యనారాయణశర్మ
- తబలా: వట్టికోట సింగరాచార్యులు
- ఫిడెల్: శ్రీరాయపురం మంగాచార్యులు
- నిర్మాణం: గ్రామవెలుగు నాట్యమండలి, రేపాల
మూలాలు
మార్చు- ↑ నవతెలంగాణ, సోపతి (25 March 2017). "నాటకం బతికేవుంది". NavaTelangana. డా. జె. విజయ్ కుమార్జీ. Archived from the original on 3 నవంబరు 2018. Retrieved 18 December 2019.
- ↑ మన తెలంగాణ, ఎడిటోరియల్ (28 November 2016). "సమకాలీనత గుబాళించిన తెలంగాణ సాంఘిక నాటకం". Archived from the original on 18 డిసెంబరు 2019. Retrieved 18 December 2019.
- ↑ నమస్తే తెలంగాణ, నిపుణ విద్యా వార్తలు (9 September 2016). "జనచేతన నాటకాలు". www.ntnews.com. సిలివేరు లింగమూర్తి. Archived from the original on 18 డిసెంబరు 2019. Retrieved 18 December 2019.
- ↑ నమస్తే తెలంగాణ, సూర్యాపేట వార్తలు (23 October 2016). "తెలంగాణ మాండలిక తొలి నాటక రచయిత కేఎల్". www.ntnews.com. డా. భీంపల్లి శ్రీకాంత్. Archived from the original on 18 డిసెంబరు 2019. Retrieved 18 December 2019.