ఆదిత్య-ఎల్1
మిషన్ రకంసౌర పరిశీలన
ఆపరేటర్ఇస్రో
COSPAR ID2023-132A Edit this at Wikidata
SATCAT no.57754Edit this on Wikidata
మిషన్ వ్యవధి5 సంవత్సరాలు (ప్రణాళిక)[1]
అంతరిక్ష నౌక లక్షణాలు
బస్I-1K
తయారీదారుడుఇస్రో / IUCAA / ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఏస్ట్రోఫిజిక్స్
లాంచ్ ద్రవ్యరాశి1,475 కి.గ్రా. (3,252 పౌ.) [2]
పే లోడ్ ద్రవ్యరాశి244 కి.గ్రా. (538 పౌ.) [1]
మిషన్ ప్రారంభం
ప్రయోగ తేదీ2023 జనవరి (ప్రణాళిక) [2][3][4][5]
రాకెట్PSLV-XL (PSLV-C56) [6][1]
లాంచ్ సైట్సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం
కాంట్రాక్టర్ఇస్రో
కక్ష్య పారామితులు
రిఫరెన్స్ వ్యవస్థసౌర-భూమి వ్యవస్థలో ఎల్1 బిందువు
రెజిమ్హేలో కక్ష్య
వ్యవధి177.86 రోజులు [7]
మూస:Infobox spaceflight/Instruments
 

ఆదిత్య ఎల్1, సౌర వాతావరణాన్ని అధ్యయనం చేయడానికి భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో), అనేక ఇతర భారతీయ పరిశోధనా సంస్థలతో కలిసి రూపొందిచిన కరోనాగ్రఫీ అంతరిక్ష నౌక. దీన్ని భూమి, సూర్యుల వ్యవస్థ లోని L1 బిందువు చుట్టూ ఒక హేలో కక్ష్యలో ప్రక్షేపిస్తారు. ఇక్కడ నుండి ఇది సౌర వాతావరణం, సౌర అయస్కాంత తుఫానులను, భూమి పర్యావరణంపై వాటి ప్రభావాన్ని అధ్యయనం చేస్తుంది.

ఈ అంతరిక్ష నౌక కరోనల్ హీటింగ్, సోలార్ విండ్ యాక్సిలరేషన్, కరోనల్ మాగ్నెటోమెట్రీ, UV-సమీప సోలార్ రేడియేషన్ను అధ్యయనం చేస్తుంది. ఫోటోస్పియర్, క్రోమోస్పియర్, కరోనా, సౌర శక్తి కణాలు, సూర్యుని అయస్కాంత క్షేత్రాన్ని నిరంతరం గమనిస్తూంటుంది.

సూర్యుడిని పరిశీలించడానికే ఉద్దేశించిన మొట్టమొదటి భారతీయ మిషన్ ఇది. దీనిని 2 సెప్తెంబర్ 2023 PSLV-XL వాహనంపై ప్రయోగించారు.[3][6][8][9][4]

చరిత్ర

మార్చు

అడ్వైజరీ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ 2008 జనవరిలో ఆదిత్య ఆలోచన చేసింది. మొదట్లో దీన్ని సౌర కరోనాను అధ్యయనం చేయడానికి కరోనాగ్రాఫ్‌తో భూ నిమ్న కక్ష్యలో ఉండి పనిచేసే చిన్న 400 కి.గ్రా. (880 పౌ.) ఉపగ్రహంగా ఆలోచన చేసారు. 2016–2017 ఆర్థిక సంవత్సరానికి రూ. 3 కోట్ల ప్రయోగాత్మక బడ్జెట్‌ను కేటాయించారు.[10][11][12] అప్పటినుండి ఈ మిషన్ పరిధిని విస్తరించారు. ఇప్పుడు దీనిని లాగ్రాంజ్ పాయింట్ L1 వద్ద ఉంచి, ఒక సమగ్ర సౌర అంతరిక్ష పర్యావరణ అబ్జర్వేటరీగా ప్లాన్ చేసారు.[13] అంచేత ఈ మిషన్‌కు "ఆదిత్య-L1" అని పేరు పెట్టారు. 2023 జూలై నాటికి, మిషన్ ప్రయోగ ఖర్చులు కాకుండా ₹378.53 కోట్లను కేటాయించారు.[14]

అవలోకనం

మార్చు
 
సూర్యుడు-భూమి వ్యవస్థలో లాగ్రాంజ్ బిందువులు (స్కేలుకు కాదు) - ఈ బిందువుల వద్ద ఉన్న ఏదైనా ఒక చిన్న వస్తువు, సాపేక్షికంగా స్థిరంగా ఉంటుంది.

ఆదిత్య-L1 మిషన్ ప్రయోగించిన [15] తర్వాత, భూమి నుండి దాదాపు 1,500,000 కి.మీ. (930,000 మై.) దూరంలో ఉన్న L1 పాయింట్ వద్ద ఉన్న హేలో కక్ష్యను చేరుకోడానికి దానికి దాదాపు 109 రోజులు పడుతుంది. 1,500 కి.గ్రా. (3,300 పౌ.) కరోనల్ హీటింగ్, సోలార్ విండ్ యాక్సిలరేషన్, కరోనల్ మాగ్నెటోమెట్రీ, సమీపంలోని UV సోలార్ రేడియేషన్ పర్యవేక్షణ వంటి విభిన్న లక్ష్యాలతో ఏడు సైన్స్ పేలోడ్‌లను ఈ నౌక తీసుకువెళుతుంది.

ఆదిత్య-L1 సూర్యుని ఫోటోస్పియర్, క్రోమోస్పియర్, కరోనాల పరిశీలన చేస్తుంది. అదనంగా, ఇందులోని ఒక పరికరం L1 కక్ష్యకు చేరే సౌర శక్తి కణాల ప్రవాహాన్ని అధ్యయనం చేస్తుంది. మాగ్నెటోమీటర్ పేలోడ్, L1 వద్ద ఉన్న హేలో ఆర్బిట్ వద్ద అయస్కాంత క్షేత్ర బలంలో వచ్చే అంతరాలను కొలుస్తుంది. ఈ పేలోడ్‌లను భూమి అయస్కాంత క్షేత్రం వలన కలిగే అంతరాయానికి వెలుపల ఉంచాలి. తొలుత ప్రతిపాదించిన విధంగా భూ నిమ్న కక్ష్యలో ఉంటే ఈ వీలు ఉండదు. [16]

సౌర భౌతిక శాస్త్రంలో పరిష్కారం కాని ప్రధాన సమస్యలలో ఒకటి - సూర్యుడి దిగువ వాతావరణం కేవలం 6,000 K (5,730 °C; 10,340 °F) ఉంటే, సూర్యుని ఎగువ వాతావరణం మాత్రం 1,000,000 K (1,000,000 °C; 1,800,000 °F) ఉండడం. దానికి తోడు, సూర్యుని రేడియేషను భూ వాతావరణపు డైనమిక్స్‌ను స్వల్ప కాల, దీర్ఘ కాలాల్లో ఎలా ప్రభావితం చేస్తుందో ఇంకా అర్థం కాలేదు. ఈ మిషన్ సూర్యుని వాతావరణంలోని వివిధ పొరల చిత్రాలను దాదాపుగా ఏకకాలంలో సేకరిస్తుంది. ఇది ఒక పొర నుండి మరొక పొరకు శక్తి ఎలా ప్రసారమౌతుందో వెల్లడిస్తుంది. ఈ విధంగా ఆదిత్య-L1 మిషన్ సూర్యుని గతిశీల ప్రక్రియల గురించి సమగ్ర అవగాహనను కలిగిస్తుంది. సౌర భౌతిక శాస్త్రం, హీలియోఫిజిక్స్‌లోని కొన్ని అపరిష్కృత సమస్యలను పరిష్కరిస్తుంది.

పేలోడ్లు

మార్చు
  • విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రాఫ్ (VELC) : కరోనాగ్రాఫ్ సూర్యరశ్మిని అక్కల్టేషను ద్వారా సూర్యరశ్మిని అడ్డుకుని అంతరిక్షంలో కృత్రిమ సంపూర్ణ సూర్యగ్రహణాన్ని సృష్టిస్తుంది. కరోనల్ మాస్ ఎజెక్షన్‌లకు మూలాలను అధ్యయనం చేయడం దీని లక్ష్యాలు
  • సౌర అతినీలలోహిత ఇమేజింగ్ టెలిస్కోప్ (SUIT) : SUIT 200-400 nm తరంగదైర్ఘ్యం పరిధి మధ్య ఇది సూర్యుడిని శోధిస్తుంది. 11 ఫిల్టర్‌లను ఉపయోగించి సౌర వాతావరణంలోని వివిధ పొరల పూర్తి డిస్క్ చిత్రాలను అందిస్తుంది. ఈ తరంగదైర్ఘ్య శ్రేణిలో సూర్యుడిని అంతరిక్షం నుండి ఎన్నడూ గమనించలేదు. అంతరిక్ష నౌక మొదటి లాగ్రాంజ్ బిందువు వద్ద ఉన్నందున, SUIT అంతరాయం లేకుండా సూర్యుడిని నిరంతరం గమనిస్తూ ఉంటుంది. ఇస్రో, తదితర సంస్థల సహకారంతో పూణేలోని ఇంటర్-యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ (IUCAA) కు చెందిన AN రామప్రకాష్, దుర్గేష్ త్రిపాఠి నేతృత్వంలో ఈ పరికరాన్ని అభివృద్ధి చేస్తున్నారు. SUIT పేలోడ్ దాదాపు 35 కి.గ్రా. (77 పౌ.) బరువు ఉంటుంది .[17]
  • ఆదిత్య సౌర పవన కణ ప్రయోగం (ASPEX) : [18] సౌర పవనాల లోని ఆటుపోట్లను, లక్షణాలను దాని పంపిణీని, వర్ణపట లక్షణాలను అధ్యయనం చేయడానికి
  • ఆదిత్య (PAPA) కోసం ప్లాస్మా ఎనలైజర్ ప్యాకేజీ: సౌర పవనాల కూర్పు, దాని శక్తి పంపిణీని అర్థం చేసుకోవడానికి.
    • PI ఇన్స్టిట్యూట్: స్పేస్ ఫిజిక్స్ లాబొరేటరీ (SPL), VSSC
  • సోలార్ లో ఎనర్జీ ఎక్స్-రే స్పెక్ట్రోమీటర్ (సోలెక్స్) : సోలార్ కరోనా యొక్క సమస్యాత్మకమైన కరోనల్ హీటింగ్ మెకానిజం అధ్యయనం కోసం ఎక్స్-రే మంటలను పర్యవేక్షించడానికి.
  • హై ఎనర్జీ L1 ఆర్బిటింగ్ ఎక్స్-రే స్పెక్ట్రోమీటర్ (HEL1OS) : సౌర కరోనాలో డైనమిక్ ఈవెంట్‌లను గమనించడానికి, విస్ఫోటనం సంఘటనల సమయంలో సౌర శక్తి కణాలను వేగవంతం చేసే శక్తిని అంచనా వేయడానికి.
    • PI సంస్థలు: ISRO శాటిలైట్ సెంటర్ (ISAC), ఉదయపూర్ సోలార్ అబ్జర్వేటరీ (USO), PRL
  • మాగ్నెటోమీటర్ : [19] గ్రహాంతర అయస్కాంత క్షేత్ర పరిమాణాన్ని, స్వభావాన్నీ కొలవడానికి.
    • PI ఇన్స్టిట్యూట్: స్పేస్ ఫిజిక్స్ లాబొరేటరీ (SPL), VSSC, ఎలక్ట్రో-ఆప్టిక్స్ సిస్టమ్స్ కోసం ప్రయోగశాల (LEOS), ISAC

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 Somasundaram, Seetha; Megala, S. (25 August 2017). "Aditya-L1 mission" (PDF). Current Science. 113 (4): 610. Bibcode:2017CSci..113..610S. doi:10.18520/cs/v113/i04/610-612. Archived from the original (PDF) on 25 August 2017. Retrieved 25 August 2017.
  2. 2.0 2.1 International Space Conference and Exhibition - DAY 3 (video). Confederation of Indian Industry. 15 September 2021. Event occurs at 2:07:36–2:08:38. Retrieved 18 September 2021 – via YouTube.
  3. 3.0 3.1 Dutt, Anonna (17 September 2021). "India's first solar mission likely to launch next year". Retrieved 18 September 2021.
  4. 4.0 4.1 Kumar, Chethan (February 2, 2022). "2 key Gaganyaan crew abort tests, Aditya top priority". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-02-02.
  5. Tripathi, Durgesh (2022-05-17). It’s Hot, It’s Magnetic & It’s Dynamic & It Matters: the Solar Atmosphere & SolarWind (Video) (in English). Event occurs at 46 minutes 43 seconds.{{cite AV media}}: CS1 maint: unrecognized language (link)
  6. 6.0 6.1 "Questions in the Lok Sabha (AU2587)" (PDF). Lok Sabha. 10 March 2021. Retrieved 18 September 2021.
  7. Sreekumar, P. (19 June 2019). "Indian Space Science & Exploration : Global Perspective" (PDF). UNOOSA. p. 8. Retrieved 30 June 2019.
  8. "Aditya L1: Know Everything about ISRO's First Solar Mission". jagranjosh.com. 2019-12-30. Retrieved 2019-12-31.
  9. "8 pictures you must see to understand what ISRO's Aditya-L1 is looking for". Business Insider. Retrieved 2019-12-31.
  10. "Notes on Demands for Grants, 2016-2017" (PDF) (Press release). Department of Space. Archived from the original (PDF) on 17 September 2016. Retrieved 9 September 2016.
  11. "Aditya gets ready to gaze at the sun". The Hindu. Retrieved 2017-08-25.
  12. Gandhi, Divya (13 January 2008). "ISRO planning to launch satellite to study the sun". The Hindu. Retrieved 26 August 2017.
  13. Desikan, Shubashree (15 November 2015). "The sun shines on India's Aditya". The Hindu. Retrieved 12 August 2018.
  14. "Lok Sabha Unstarred Question No.1972" (PDF). Lok Sabha. 3 July 2019.
  15. "Department Of Space, Annual Report 2019-2020" (PDF). 14 February 2020. Archived (PDF) from the original on 7 October 2021. Retrieved 25 October 2021.
  16. "Aditya-L1 First Indian mission to study the Sun". isro.gov.in. Archived from the original on 2019-12-10. Retrieved 2019-06-19.
  17. Desikan, Shubashree (26 November 2017). "Here comes the sun watcher, India's Aditya-L1". The Hindu. Retrieved 26 November 2017.
  18. Goyal, S. K. (April 18, 2018). "Aditya Solarwind Particle EXperiment (ASPEX) onboard the Aditya-L1 mission".
  19. (November 8, 2017). "Science objectives of the magnetic field experiment onboard Aditya-L1 spacecraft".