పిఎస్‌ఎల్‌వి

(ధృవీయ ఉపగ్రహ ప్రక్షేపణ యానం నుండి దారిమార్పు చెందింది)

పిఎస్‌ఎల్‌వి, పోలార్ సెటిలైట్ లాంచ్ వెహికిల్ (Polar Satellite Launch vehicle) అనే పదానికి సంక్షిప్త పదం. భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) రూపొందించి, అభివృద్ధి పరచిన ఉపగ్రహ వాహక నౌక ఇది. ఇస్రో తయారు చేసిన రాకెట్‌లలో అత్యంత విశ్వసనీయమైన పనితనాన్ని కనబరుస్తున్న నౌక ఇది. ఈ వాహక రాకెట్ గత 23 సంవత్సరాలలో 100 కు పైగా ఉపగ్రహాలను విజయవంతంగా అంతరిక్షంలో ప్రవేశపెట్టింది. చరిత్రాత్మకమైన చంద్రయాన్-1, మార్సు ఆర్బిటర్ మిషన్, స్పేస్ కాప్స్యుల్ రికవరీ ప్రయోగం, ఇండియన్ రీజినల్ నేవిగేషన్ సెటిలైట్ సిస్టమ్ (IRNSS) మొదలైనవన్నీ పిఎస్ఎల్‌వి వాహక నౌక ద్వారా ప్రయోగించి విజయం సాధించారు. ఇస్రో రూపొందించిన వివిధ శ్రేణుల ఉపగ్రహ వాహకనౌకలలో అత్యంత నమ్మకమైనదిగా పిఎస్ఎల్‌వి నిలిచింది.

పిఎస్‌ఎల్‌వి

PSLV-C8 (CA Variant) carrying the AGILE x-ray and γ-ray astronomical satellite of the ASI lifting off from Sriharikota
విధి మధ్య స్థాయి వాహన వ్యవస్థ
తయారీదారు ఇస్రో
దేశము  భారతదేశం
పరిమాణము
ఎత్తు 44 మీటర్లు (144 అ.)
వ్యాసము 2.8 మీటర్లు (9 అ. 2 అం.)
ద్రవ్యరాశి 294,000 కిలోగ్రాములు (648,000 పౌ.)
దశలు 4
సామర్థ్యము
Payload to
LEO
3,250 కిలోగ్రాములు (7,170 పౌ.)
Payload to
HCO
1,600 కిలోగ్రాములు (3,500 పౌ.)[1]
Payload to
GTO
1,410 కిలోగ్రాములు (3,110 పౌ.)[1]
ప్రయోగ చరిత్ర
స్థితి సచేతనం
ప్రయోగ స్థలాలు సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం
మొత్తం ప్రయోగాలు 36
PSLV: 11
PSLV-CA: 11
PSLV-XL: 14
విజయాలు 35
'పిఎస్‌ఎల్‌వి-జి: 10
పిఎస్‌ఎల్‌వి--సిఎ: 11
పిఎస్‌ఎల్‌వి--ఎక్ష్‌ఎల్: 14
వైఫల్యాలు 1 (PSLV)
పాక్షిక వైఫల్యాలు 1 (పిఎస్‌ఎల్‌వి)
తొలి ప్రయోగం PSLV: 1993 సెప్టెంబరు 20
PSLV-CA: 2007 ఏప్రిల్ 23
PSLV-XL: 2008 అక్టోబరు 22
ప్రముఖ పేలోడ్లు చంద్రయాన్-1
బూస్టర్లు (Stage 0)
బూస్టర్ల సంఖ్య 6
ఇంజన్లు 1 సాలిడ్
థ్రస్టు 502.600 kN
Specific impulse 262 సెకండ్లు
మండే సమయం 44 సెకండ్లు
ఇంధనం HTPB (సాలిడ్)
మొదటి దశ
ఇంజన్లు 1 సాలిడ్
థ్రస్టు 4,860 kN
Specific impulse 269 సె
మండే సమయం 105 సెకండ్లు
ఇంధనం HTPB (సాలిడ్)
రెండవ దశ
ఇంజన్లు 1 వికాస్ ఇంజను (ద్రవ)
థ్రస్టు 800 కిన్యూ
Specific impulse 293 సెకండ్లు
మండే సమయం 158 సెకండ్లు
ఇంధనం N2O4/UDMH
మూడవ దశ
ఇంజన్లు 1 సాలిడ్
థ్రస్టు 328 కెన్యూ
Specific impulse 294 సెకండ్లు
మండే సమయం 83 సెకండ్లు
ఇంధనం ఘన
నాలుగవ దశ
ఇంజన్లు 2 liquid
థ్రస్టు 14 kN
Specific impulse 308 సెకండ్లు
మండే సమయం 425 సెకండ్లు
ఇంధనం MMH/MON

పిఎస్‌ఎల్‌విని మొదటిసారి 1993 సెప్టెంబరు 20 న ప్రయోగించారు. 2016 జూన్ 22 నాటికి మొత్తం 113 ఉపగ్రహాలను వివిధ కక్ష్యల్లో ప్రవేశపెట్టింది. అందులో భారతదేశానివి 39 కాగా, 74 విదేశాలకు చెందినవి.[2] 2016 జూన్ 22 న పిఎస్ఎల్‌వి సి34 ద్వారా ఒకేసారి 20 ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించారు.[3] ఒకే యాత్రలో ప్రయోగించిన అత్యధిక ఉపగ్రహాల రికార్డు ఇది -పిఎస్‌ఎల్‌వికి, ఇస్రోకు.

పిఎస్‌ఎల్‌వి ద్వారా కక్ష్యలో ప్రవేశపెట్టే ఉపగ్రహాల బరువు 1425 కిలోల నుండి 1750 కిలోల వరకు ఉంటుంది. భూ సమవర్తన (Geosynchronous) కక్ష్యలో లేదా భూస్థిర కక్ష్య (Geostationary) లో ప్రవేశ పెట్టే ఉపగ్రహాల భారం 1425 కిలోలు ఉంటుంది. సూర్య సమవర్తన ధ్రువకక్ష్యలో ప్రవేశపెట్టు ఉపగ్రహాల బరువు 1750 కిలోల వరకు ఉంటుంది.

పిఎస్‌ఎల్‌వి సాంకేతిక వివరాలు

మార్చు

ఈ ఉపగ్రహప్రయోగ వాహనం మొత్తం ఎత్తు 44 మీటర్లు. దీని వ్యాసం 2.8 మీటర్లు. ఈ రాకెట్‌లో మొత్తం నాలుగు దశలు ఉన్నాయి. ప్రయోగదశలో ఈ వాహక నౌక బరువు 320 టన్నుల వరకు ఉంటుంది (పిఎస్‌ఎల్‌వి - XLరకం). పిఎస్‌ఎల్‌వి ఉపగ్రహ వాహకనౌకలో మూడు రకాలు ఉన్నాయి: పిఎస్‌ఎల్‌వి -జి, పిఎస్‌ఎల్‌వి-సిఏ, పిఎస్‌ఎల్‌వి-ఎక్స్ఎల్.

పిఎస్‌ఎల్‌వి -జి పిఎస్‌ఎల్‌వి-సిఏ పిఎస్‌ఎల్‌వి-ఎక్స్ఎల్
మొత్తం బరువు (టన్నులు) 296 229 320
స్ట్రాపాన్ బూస్టర్లు 6 (PSOM) లేవు 6 (PSOM XL)

పిఎస్‌ఎల్‌వి రకాలు

మార్చు

పిఎస్‌ఎల్‌వి-జనరిక్

మార్చు

రాకెట్ యొక్క మొదటి దశ చుట్టూ ఆరు స్ట్రాపాన్‌ బూస్టరులు ఉంటాయి. ఈ బూస్టరులు ఒక్కొక్కటీ 11.3 మీ పొడవుతో, అన్నిటినిలోనూ కలిపి 53.52 టన్నుల ఘన ఇంధనం కలిగి ఉంటాయి.

పిఎస్‌ఎల్‌వి-సీఏ (కోర్‌ ఎలోన్)

మార్చు

పేరు సూచిస్తున్నట్లుగా ఇది పిఎస్‌ఎల్‌వి లోని నాలుగు దశలను మాత్రమే కలిగి ఉంటుంది, స్ట్రాపాన్ బూస్టర్లను అమర్చరు. దీనిద్వారా తక్కువ బరువున్న ఉపగ్రహాలను భూనిమ్న దశలోకి ప్రయోగిస్తారు.

పిఎస్‌ఎల్‌వి-ఎక్స్‌ఎల్

మార్చు

ఇందులో అధిక దహన సామర్ధ్యం ఉన్న PSOM XL స్ట్రాపాన్‌ బూస్టర్లను ఉపయోగిస్తారు. దీనిద్వారా 1400-1700 కిలోల భారమున్న ఉపగ్రహాలను ప్రయోగిస్తారు. ఈ బూస్టరులు జనరిక్ బూస్టర్ల కంటే పొడవుగా ఉండి ఎక్కువ ఇంధనాన్ని కలిగి ఉంటాయి. ఒక్కొక్కటీ 14.8 మీ పొడవుతో, మొత్తం అన్ని బూస్టరులు కలిసి 77.4 టన్నుల ఘన ఇంధనం కలిగి ఉంటాయి. ఈ ఎక్స్‌ఎల్ రూపాన్ని సాధారణంగా భూ స్థిర బదిలీ కక్ష్యలో ప్రవేశపెట్టవలసిన ఉపగ్రహాల కోసం వాడతారు.

పిఎస్‌ఎల్‌వి దశల వివరాలు

మార్చు

పిఎస్‌ఎల్‌వి ఉపగ్రహ వాహకనౌకలో నాలుగు దశలుంటాయి. నాలుగోదశ చివర, ప్రయోగించవలసిన ఉపగ్రహం లేదా ఉపగ్రహాలు అమర్చబడి ఉంటాయి. వివిధ దశలు మండే సమయం, అవి విడిపోయే ఎత్తులు కింది విభాగాల్లో ఇవ్వబడ్డాయి. వీటిని సూచన మాత్రంగా పరిగణించాలి. పేలోడ్ బరువు, నౌక కాన్ఫిగరేషను, చేరాల్సిన కక్ష్యలు మొదలైన వాటిపై ఆధారపడి ఇవి మారుతూ ఉంటాయి.

మొదటి దశ (PS1)

మార్చు

మొదటిదశలోని S139 ఘన ఇంధన మోటారు, 4800 కిన్యూ (కిలో న్యూటన్)ల థ్రస్ట్ (thrust)ను ఇస్తుంది. ఈ దశలో 138 టన్నుల HTPB ఇంధనాన్ని వాడతారు. మొదటి దశ 105 సెకండ్ల పాటు మండి, నౌక 74 కిమీ ఎత్తుకు చేరాక, రెండవ దశ నుండి విడిపోతుంది. మొదటి దశ విడివడి దూరం అయ్యాక రెండవ దశ మండుతుంది.

స్ట్రాపాన్ బూస్టర్లు

మార్చు

మొదటి దశకు 6 స్ట్రాపాన్ బూస్టర్లను అమరుస్తారు. ఈ అరింటిలో 4 బూస్టర్లు మొదటి దశతో పాటే (అర సెకండు తేడాతో) మండిస్తారు. రాకెట్ పైకిలేచిన 25 సెకండ్ల తర్వాత మిగిలిన రెండు బూస్టర్లను మండిస్తారు. ఈ స్ట్రాపాన్ బూస్టర్లలో కూడా ఘన ఇంధనాన్నే వాడుతారు. స్ట్రాపాన్ ఇంజన్ కలుగజేయు థ్రస్ట్ 719 కిన్యూ. మొదటి 4 బూస్టర్లు 24 కిమీ ఎత్తున, మిగతా రెండు బూస్టర్లు 41 కిమీ ఎత్తున విడిపోయి పడిపోతాయి.

రెండవ దశ (PS2)

మార్చు

రెండవ దశలో ద్రవ ఇంధనం ఉపయోగిస్తారు. రెండవ దశకు వికాస్‌ ఇంజన్‌ను అమర్చారు. ఈ ఇంజన్ను లిక్విడ్ ప్రోపల్షన్ సిస్టమ్స్ సెంటర్ (Liquid Propulsion Systems Centre) తయారు చేసింది. ఇందులో ఉపయోగించే ఇంధనం UDMH + N2O4. ఈ ఇంజను ఇచ్చే థ్రస్ట్ 799 కిన్యూ. ఈ దశ 158 సెకండ్లు మండి, 277 కిమీ ఎత్తు వద్ద విడివడి పోతుంది.

మూడవ దశ (PS3)

మార్చు

ఈ దశలో ఘన ఇంధనం HTPB వాడతారు. ఇది 240 కిన్యూల థ్రస్ట్‌ను అందిస్తుంది. ఈ దశ 112 సెకండ్ల పాటు మండి, 580 కిమీ వద్ద విడిపోతుంది.

నాల్గవ దశ (PS4)

మార్చు

ఇది పిఎస్‌ఎల్‌వి లోని అంతిమ దశ. పేలోడ్ దీనికి చేర్చి ఉంటుంది. ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపే బాధ్యత ఈ దశదే. ఈ దశలోని రెండు PS-4 ద్రవ ఇంధన ఇంజనులు ఒక్కొక్కటి 7.6 కిన్యూ థ్రస్టును ఉత్పత్తి చేస్తాయి. ఉపయోగించు ఇంధనం MMH + MON. యాత్ర అవసరాన్ని బట్టి ఈ దశ 540 సెకండ్ల వరకు మండుతుంది.

నాల్గవ దశలోనే పరికరాల అర కూడా ఉంటుంది. ఈ అరలో ఇనర్షియల్ గైడెన్స్ వ్యవస్థ, ఫ్లైట్ కంప్యూటరు, టెలిమెట్రీ, ఏవియానిక్స్ పరికరాలు ఉంటాయి.

పేలోడ్ భాగం

మార్చు

కక్ష్యలో ప్రవేశపెట్టవలసిన ఉపగ్రహం లేదా ఉపగ్రహాలు భద్రంగా రక్షణ షీల్డ్ కలిగిన గదిలో ఉంటాయి. ఈ రక్షణ గదిని పేలోడ్ ఫెయిరింగ్ లేదా హీట్‌షీల్డ్ అంటారు. ఇది రెండు భాగాలుగా, 3.2 మీ వ్యాసంతో, 8.3 మీ పొడవుతో ఉంటుంది. భూ వాతావరణం గుండా నౌక ప్రయాణించేటపుడు ఎదురయ్యే గాలి వత్తిడి, ఉష్ణోగ్రత, శబ్దం మొదలైన శక్తుల నుండి పేలోడ్‌కు రక్షణగా ఇది పనిచేస్తుంది. భూవాతావరణాన్ని దాటగానే - సుమారు 165 సెకండ్ల తరువాత, 130 కిమీల ఎత్తున - దీన్ని తొలగించేస్తారు.

యాత్రల జాబితా

మార్చు

మొట్టమొదటి పిఎస్‌ఎల్‌వి యాత్ర పిఎస్‌ఎల్‌వి డి1, విఫలమైంది. రెండవ దశ ఇంజను మండడంలో జరిగిన లోపం కారణంగా రాకెట్ బంగాళాఖాతంలో పడిపోయింది. నాల్గవ యాత్రలో, ఉపగ్రహాన్ని ఉద్దేశించిన కక్ష్యలో కాక, దానికంటే కింది కక్ష్యలో ప్రవేశపెట్టింది. దీన్ని పాక్షిక వైఫల్యంగా భావిస్తారు. ఈ రెండు తప్ప, మిగిలిన యాత్రలన్నీ విజయవంతమయ్యాయి.

పిఎస్‌ఎల్‌వి ద్వారా ఇంతవరకు అంతరిక్షంలో ప్రవేశపెట్టిన ఉపగ్రహాల వివరాలు:[4]

పేరు ప్రయోగతేది వాహన శ్రేణి కక్ష్య పేలోడ్
పిఎస్‌ఎల్‌వి సీ-58 జనవరి 01, 2024 పిఎస్‌ఎల్‌వి - DL XPoSat
పిఎస్‌ఎల్‌వి సీ-57 సెప్టెంబర్ 02, 2023 పిఎస్‌ఎల్‌వి - XL Aditya-L1 payloads
పిఎస్‌ఎల్‌వి సీ-56 జూలై 30, 2023 పిఎస్‌ఎల్‌వి - CA DS-SAR
పిఎస్‌ఎల్‌వి సీ-55 ఏప్రిల్ 22, 2023 పిఎస్‌ఎల్‌వి - CA TeLEOS-2
పిఎస్‌ఎల్‌వి సీ-54 నవంబర్ 26, 2022 పిఎస్‌ఎల్‌వి - XL EOS_06
పిఎస్‌ఎల్‌వి సీ-53 జూన్ 30, 2022 పిఎస్‌ఎల్‌వి
పిఎస్‌ఎల్‌వి సీ-52 ఫిబ్రవరి 14, 2022 పిఎస్‌ఎల్‌వి - XL
పిఎస్‌ఎల్‌వి సీ-51 ఫిబ్రవరి 28, 2021 పిఎస్‌ఎల్‌వి - DL
పిఎస్‌ఎల్‌వి సీ-50 డిసెంబర్ 17, 2020 పిఎస్‌ఎల్‌వి - XL CMS-01
పిఎస్‌ఎల్‌వి సీ-49 నవంబర్ 07, 2020 పిఎస్‌ఎల్‌వి - DL EOS-01
పిఎస్‌ఎల్‌వి సీ-48 డిసెంబర్ 11, 2019 పిఎస్‌ఎల్‌వి - QL RISAT-2BR1
పిఎస్‌ఎల్‌వి సీ-47 నవంబర్ 27, 2019 పిఎస్‌ఎల్‌వి - XL Cartosat-3
పిఎస్‌ఎల్‌వి సీ-46 మే 22, 2019 పిఎస్‌ఎల్‌వి - CA RISAT-2B
పిఎస్‌ఎల్‌వి సీ-45 ఏప్రిల్ 01, 2019 పిఎస్‌ఎల్‌వి - QL EMISAT
పిఎస్‌ఎల్‌వి సీ-44 జనవరి 24, 2019 పిఎస్‌ఎల్‌వి - DL Microsat-R
పిఎస్‌ఎల్‌వి సీ-43 2018,నవంబరు,29 పిఎస్‌ఎల్‌వి కోర్ అలోన్ సూర్యానువర్తిత హైసిస్
పిఎస్ఎల్‌వి- సీ 42 2018 సెప్టెంబరు,16 పిఎస్‌ఎల్‌వి సూర్యానువర్తిత దృవీయ కక్ష్య --
పిఎస్ఎల్‌వి- సి41 2018 ఏప్రిల్,12 పిఎస్‌ఎల్‌వి-XL భూస్థిర కక్ష్య IRNSS-1I
పిఎస్‌ఎల్‌వి-సీ40 2018 జనవరి12 పిఎస్‌ఎల్‌వి-XL సూర్యానువర్తిత కార్టోశాట్-2శ్రేణి ఉపగ్రహం
పిఎస్‌ఎల్‌వి-సీ39 2017 అగస్టు 31 పిఎస్‌ఎల్‌వి-XL భూ స్థిర బదిలీ కక్ష్య IRNSS-1H ప్రయోగం విఫలం
పిఎస్‌ఎల్‌వి-సీ38 2017 జూన్ 23 పిఎస్‌ఎల్‌వి-XL సూర్యానువర్తిత కార్టోశాట్-2ఈ ఉపగ్రహం
పిఎస్‌ఎల్‌వి-సీ37 ఉపగ్రహ వాహకనౌక 2017 ఫిబ్రవరి 15 పిఎస్‌ఎల్‌వి-XL సూర్యానువర్తిత కార్టోశాట్-2D ఉపగ్రహం
పిఎస్‌ఎల్‌వి-సీ34 ఉపగ్రహ వాహకనౌక 2016 జూన్ 22 పిఎస్‌ఎల్‌వి-XL సూర్యనువర్తిత Cartosat-2 Series Satellite
పిఎస్‌ఎల్‌వి-సి33 2016 ఏప్రిల్ 28 పిఎస్‌ఎల్‌వి-XL భూ స్థిర బదిలీ కక్ష్య IRNSS 1G
పిఎస్‌ఎల్‌వి-సి32 2016 మార్చి 10 పిఎస్‌ఎల్‌వి-XL భూ సమవర్తన బదిలీ కక్ష్య IRNSS 1F
పిఎస్‌ఎల్‌వి-C31 2016 జనవరి 20 పిఎస్‌ఎల్‌వి-XL భూ సమవర్తన బదిలీ కక్ష్య IRNSS 1E
పిఎస్‌ఎల్‌వి-C29 2015 డిసెంబరు 16 పిఎస్‌ఎల్‌వి-CA భూ నిమ్న కక్ష్య TeLEOS-1
పిఎస్‌ఎల్‌వి-C30 2015 సెప్టెంబరు 28 పిఎస్‌ఎల్‌వి-XL ఆస్ట్రోశాట్
పిఎస్‌ఎల్‌వి-C28 2015 జూలై 10 పిఎస్‌ఎల్‌వి భూ నిమ్న కక్ష్య DMC3
పిఎస్‌ఎల్‌వి-C27 2015 మార్చి 28 పిఎస్‌ఎల్‌వి-XL భూ సమవర్తన బదిలీ కక్ష్య IRNSS 1D
పిఎస్‌ఎల్‌వి-C26 2014 అక్టోబరు 16 పిఎస్‌ఎల్‌వి-XL భూ స్థిర బదిలీ కక్ష్య IRNSS 1C
పిఎస్‌ఎల్‌వి-C23 2014 జూన్ 30 పిఎస్‌ఎల్‌వి-CA భూ స్థిర బదిలీ కక్ష్య SPOT-7
పిఎస్‌ఎల్‌వి-C24 2014 ఏప్రిల్ 4 పిఎస్‌ఎల్‌వి-XL భూ స్థిర బదిలీ కక్ష్య IRNSS-1B
పిఎస్‌ఎల్‌వి-C25 2013 నవంబరు 5 పిఎస్‌ఎల్‌వి-XL HEO Mars Orbiter Mission Spacecraft
పిఎస్‌ఎల్‌వి-C22 2013 జూలై 1 పిఎస్‌ఎల్‌వి-XL భూ స్థిర బదిలీ కక్ష్య IRNSS-1A
పిఎస్‌ఎల్‌వి-C20 2013 ఫిబ్రవరి 25 పిఎస్‌ఎల్‌వి-CA సౌర సమవర్తన ధ్రువ కక్ష్య SARAL
పిఎస్‌ఎల్‌వి-C21 2012 సెప్టెంబరు 9 పిఎస్‌ఎల్‌వి-CA సౌర సమవర్తన ధ్రువ కక్ష్య SPOT 6
పిఎస్‌ఎల్‌వి-C19 2012 ఏప్రిల్ 26 పిఎస్‌ఎల్‌వి-XL సౌర సమవర్తన ధ్రువ కక్ష్య RISAT-1
పిఎస్‌ఎల్‌వి-C18 2011 అక్టోబరు 12 పిఎస్‌ఎల్‌వి-CA సౌర సమవర్తన ధ్రువ కక్ష్య Megha-Tropiques
పిఎస్‌ఎల్‌వి-C17 2011 జూలై 15 పిఎస్‌ఎల్‌వి-XL భూ స్థిర బదిలీ కక్ష్య GSAT-12
పిఎస్‌ఎల్‌వి-C16 2011 ఏప్రిల్ 20 పిఎస్‌ఎల్‌వి-G సౌర సమవర్తన ధ్రువ కక్ష్య RESOURCESAT-2
పిఎస్‌ఎల్‌వి-C15 2010 జూలై 12 పిఎస్‌ఎల్‌వి-CA సౌర సమవర్తన ధ్రువ కక్ష్య CARTOSAT - 2B
పిఎస్‌ఎల్‌వి-C14 2009 సెప్టెంబరు 23 పిఎస్‌ఎల్‌వి-CA సౌర సమవర్తన ధ్రువ కక్ష్య Oceansat-2
పిఎస్‌ఎల్‌వి-C12 2009 ఏప్రిల్ 20 పిఎస్‌ఎల్‌వి-CA సౌర సమవర్తన ధ్రువ కక్ష్య RISAT-2
పిఎస్‌ఎల్‌వి-C11 2008 అక్టోబరు 22 పిఎస్‌ఎల్‌వి-XL HEO Chandrayaan-1
పిఎస్‌ఎల్‌వి-C10 2008 జూన్ 23 పిఎస్‌ఎల్‌వి-CA భూ నిమ్న కక్ష్య
పిఎస్‌ఎల్‌వి-C9 2008 ఏప్రిల్ 28 పిఎస్‌ఎల్‌వి-CA SPO CARTOSAT – 2A
IMS-1
పిఎస్‌ఎల్‌వి-C5 2007 అక్టోబరు 17 పిఎస్‌ఎల్‌వి-G సౌర సమవర్తన ధ్రువ కక్ష్య IRS-P6 / RESOURCESAT-1
పిఎస్‌ఎల్‌వి-C8 2007 ఏప్రిల్ 23 పిఎస్‌ఎల్‌వి-CA భూ నిమ్న కక్ష్య
పిఎస్‌ఎల్‌వి-C7 2007 జనవరి 10 పిఎస్‌ఎల్‌వి-G సౌర సమవర్తన ధ్రువ కక్ష్య CARTOSAT-2
SRE-1
పిఎస్‌ఎల్‌వి-C6 2005 మే 5 పిఎస్‌ఎల్‌వి-G సౌర సమవర్తన ధ్రువ కక్ష్య CARTOSAT – 1
HAMSAT
పిఎస్‌ఎల్‌వి-C4 2002 సెప్టెంబరు 12 పిఎస్‌ఎల్‌వి-G భూ స్థిర బదిలీ కక్ష్య KALPANA-1
పిఎస్‌ఎల్‌వి-C3 2001 అక్టోబరు 22 పిఎస్‌ఎల్‌వి-G సౌర సమవర్తన ధ్రువ కక్ష్య The Technology Experiment Satellite (TES)
పిఎస్‌ఎల్‌వి-C2 1999 మే 26 పిఎస్‌ఎల్‌వి-G సౌర సమవర్తన ధ్రువ కక్ష్య Oceansat (IRS-P4)
పిఎస్‌ఎల్‌వి-C1 1997 సెప్టెంబరు 29 పిఎస్‌ఎల్‌వి-G సౌర సమవర్తన ధ్రువ కక్ష్య IRS-1D
పిఎస్‌ఎల్‌వి-D3 1996 మార్చి 21 పిఎస్‌ఎల్‌వి-G సౌర సమవర్తన ధ్రువ కక్ష్య IRS-P3
పిఎస్‌ఎల్‌వి-D2 1994 అక్టోబరు 15 పిఎస్‌ఎల్‌వి-G సౌర సమవర్తన ధ్రువ కక్ష్య IRS-P2
పిఎస్‌ఎల్‌వి-D1 1993 సెప్టెంబరు 20 పిఎస్‌ఎల్‌వి-G సౌర సమవర్తన ధ్రువ కక్ష్య IRS-1E

పీ ఎస్ ఎల్ వీ సాధించిన అద్భుతాలు

మార్చు

’చంద్రయాన్-1’ ను 2008 అక్టోబరు 22 లో పీఎస్ ఎల్ వీ సి-11 ద్వారా కక్ష్య లోనికి ప్రవేశపెట్టారు. ’మంగళయాన్’ ను నవంబరు 5 2019 న పీఎస్ ఎల్ వీ సీ-25 ద్వారా కక్ష్య లోనికి ప్రవేశపెట్టారు. పీఎస్ ఎల్ వీ సీ-37 ద్వారా నింగిలోనికి ఒకేసారి ’నూట నాలుగు ఉపగ్రహాలను’ ప్రవేశ పెట్టడం ఒక ప్రపంచ రికార్డు.[5]

శాస్త్ర సాంకేతిక రంగం లోనూ మూఢనమ్మకాలు:

మార్చు

పీఎస్ ఎల్ వీ క్రమంలో పీ ఎస్ ఎల్ వీ పన్నెందు తర్వాత తయారు చేసి పంపిన వాహక నౌక పేరు పీఎస్ ఎల్ వీ పద్నాలుగు. పీఎస్ ఎల్ వీ 13 లో సంఖల మొత్తం సరి సంఖ్య నాలుగు రావడం తో ఆ పేరు తో వాహన నౌక లేదు.12 వ నంబరు వాహకనౌక 2009 ఏప్రిల్ 20 నుండి 14 వ వాహన నౌక 2009 సెప్టెంబరు 23 మధ్య వేరే ఏ పీ ఎస్ ఎల్ వీ ని పంపలేదు.[6]


ఇవికూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 Polar Satellite Launch Vehicle
  2. "మొత్తం 113 ఉపగ్రహాలను ప్రయోగించింది". Archived from the original on 2016-07-23. Retrieved 2016-07-29.
  3. "ఇస్రో ఒకేసారి 20 ఉపగ్రహాలను ప్రయోగించింది". Archived from the original on 2016-07-23. Retrieved 2016-07-29.
  4. "PSLV Launches Till Date". isro.gov.in. Archived from the original on 2016-12-22. Retrieved 2015-09-02.
  5. https://www.eenadu.net/districts/mainnews/219065013/Nellore/19/9[permanent dead link]
  6. "ఇంతింతై విశ్వమంతై". eenadu. Archived from the original on 2019-12-09. Retrieved 2019-12-09.