ఆదిశంకర్ గారు 15వ లోక్‌సభలో తమిళనాడు కల్లకురిచి పార్లమెంటు నియోజకవర్గంలో డి.ఎం.కే పార్టీ తరుపున గెలిచి పార్లమెంటులో అడుగు పెట్టారు.

బాల్యం మార్చు

ఆదిశంకర్ గారు 1957, మార్చి 7న తమిళనాడు, విల్లుపురం జిల్లా తిరుకొయిలూరులో జన్మించారు. వీరి తల్లిదండ్రులు శ్రీ ఆదిశేషన్, శ్రీమతి పట్టమ్మాళ్. వీరు మద్రాసు విశ్వవిద్యాలయంలో బి.ఎస్.సి. బి.ఎల్. చదివి కొంతకాలము న్యాయవాద వృత్తిలో పనిచేశారు.

కుటుంబము మార్చు

వీరు 13 జూన్ 1990 లో శ్రీమతి అంజుంగం గారిని వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు ఒక కుమార్తె కలరు.

రాజకీయ ప్రస్థానము మార్చు

అప్పటి వరకు కడలూరు యువ జననాయకునిగ వుండిన ఆదిశంకర్ గారు 1999 లో 13వ లోక్‌సభ సభ్యత్వానికి డి.ఎం.కె. తరఫున పోటీ చేసి గెలిచి పార్లమెంటులో ఉన్నారు. వీరు అనేక పార్లమెంట్ కమిటీలలో సభ్యునిగా చాలకాలం పనిచేశారు. 1988 - 2000 వరకు జిల్లా సహకార బాంకు చైర్మెన్ గా పనిచేశారు. 2009లో 15వ లోక్‌సభలో తమిళనాడు కల్లకురిచి పార్లమెంటు నియోజకవర్గంలో డి.ఎం.కే పార్టీ తరుపున గెలిచి పార్లమెంటులో అడుగు పెట్టారు. తర్వాత కూడా వీరు అనేక పార్లమెంటు కమిటీలలో సభ్యునిగా పనిచేశారు.

మూలాలు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=ఆదిశంకర్&oldid=4149514" నుండి వెలికితీశారు