ఆది మహావిష్ణువు ఆలయం

ఆది మహావిష్ణువు ఆలయం అనేది యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దేవలమ్మనాగారం గ్రామంలో నెలకొని ఉన్న హిందూ దేవాలయం. ఇక్కడ కొలవైన కాకతీయుల కాలంనాటి ఆది మహావిష్ణువు విగ్రహం 2015వ సంవత్సరంలో ఉపాధి హామీ కూలీలు పని నిమిత్తం తవ్వుతుండగా తవ్వకాల్లో బయటపడటం విశేషం.[1] ఇక్కడ ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని మూడు రోజులపాటు ప్రత్యేకంగా బ్రహ్మోత్సవాలను నిర్వహించి స్వామివారికి కళ్యాణం జరిపిస్తారు.

ఆది మహావిష్ణువు ఆలయం
పేరు
ప్రధాన పేరు :ఆది మహావిష్ణువు దేవాలయం
ప్రదేశం
దేశం:భారత దేశం
రాష్ట్రం:తెలంగాణ
జిల్లా:యాదాద్రి భువనగిరి
ప్రదేశం:దేవలమ్మనాగారం, చౌటుప్పల్‌
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:శ్రీ ఆది మహావిష్ణువు
ఉత్సవ దైవం:శ్రీ ఆది మహావిష్ణువు
నిర్మాణ శైలి, సంస్కృతి
వాస్తు శిల్ప శైలి :కాకతీయుల కాలం నాటిది

నేపథ్యం

మార్చు

దేవలమ్మనాగారంలో కొండపైన ఉన్న ఈ క్షేత్రంలో కొలువుదీరిన ఆది మహా విష్ణువు విగ్రహంలో విష్ణుమూర్తి దాల్చిన దశావతార రూపాలన్నీ కనిపిస్తాయి. అయితే ఈ విగ్రహం కొన్ని సంవత్సరాల క్రితం ఈ కొండ ప్రాంతాన్ని తవ్వి గ్రామానికి రోడ్డుమార్గం వేసే క్రమంలో బయటపడింది, స్వామివారి విగ్రహంతోపాటు శిలాశాసనం కూడా లభించింది. దీంతో స్వామివారి విగ్రహం కాకతీయుల కాలం నాటిదని పురావస్తుశాఖ అధికారులు నిర్ధారించారు. అరుదైన ఈ విష్ణుమూర్తి విగ్రహం అదే ప్రాంతంలో పూజలందుకోవాలని భావించిన గ్రామస్తులు కొండపైనే శిథిలావస్థలో ఉన్న ఆలయం పునర్నిర్మించి, గర్భగుడిలో శ్రీ ఆది మహావిష్ణువు స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.

శ్రీదేవీ, భూదేవీ సమేతంగా దర్శనమిచ్చే ఈ స్వామిని జగన్మోహినిగానూ కొలుస్తారు. అందుకే స్వామి కాళ్లకు పట్టీలు, మెట్టెలు, కడియాలు వంటి అభరణాలు అలంకరిస్తారు.[2]

ఈ ప్రాంగణంలో వినాయకుడు, దాసాంజనేయస్వామి వార్లకు ఉపాలయాలున్నాయి.

ఎలా చేరుకోవచ్చు

మార్చు

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు కేవలం 55 కి. మీ. దూరంలో ఈ దేవస్థానం ఉంది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి చౌటుప్పల్‌ వరకు ఆర్టీసీ బస్సుల్లో చేరుకుంటే, అక్కడి నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆలయానికి వెళ్లేందుకు ఆటోలు అందుబాటులో ఉంటాయి.

మూలాలు

మార్చు
  1. "Vaikunta Ekadasi: కాకతీయుల నాటి శ్రీ ఆది మహావిష్ణువు దేవాలయానికి పోటెత్తిన భక్తులు.. మూడు రోజుల పాటు ఉత్సవాలు | Vaikunta ekadasi celebrations in adi mahavishnu temple in nalgonda | TV9 Telugu". web.archive.org. 2023-03-02. Archived from the original on 2023-03-02. Retrieved 2023-03-02.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "ఇక్కడి మహావిష్ణువు...మెట్టెలు ధరిస్తాడు". web.archive.org. 2023-03-02. Archived from the original on 2023-03-02. Retrieved 2023-03-02.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)