చౌటుప్పల్
చౌటుప్పల్, తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా, చౌటుప్పల్ మండలానికి చెందిన గ్రామం.[1] ఇది హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో ఒక భాగం.
చౌటుప్పల్ | |
— రెవిన్యూ గ్రామం — | |
|
|
తెలంగాణ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 17°14′56″N 78°53′48″E / 17.2489°N 78.8968°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | యాదాద్రి |
మండలం | చౌటుప్పల్ |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 19,092 |
- పురుషుల సంఖ్య | 9,588 |
- స్త్రీల సంఖ్య | 9,504 |
- గృహాల సంఖ్య | 4,566 |
పిన్ కోడ్ | 508252. |
ఎస్.టి.డి కోడ్ |
జిల్లాల పునర్వ్యవస్థీకరణలో సవరించు
2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత నల్గొండ జిల్లాలోని ఇదే మండలంలో ఉండేది.[2]
గణాంక వివరాలు సవరించు
చౌటుప్పల్ మండల జనాభా: 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని జనాభా - మొత్తం 73,336 - పురుషులు 37,303 - స్త్రీలు 36,033
చౌటుప్పల్ పట్టణ జనాభా:2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ పట్టణ పరిధి 4566 ఇళ్లతో, 19092 మొత్తం జనాభాతో కలిగి ఉంది. మొత్తం జనాభాలో 9,588 మంది మగవారు, 9,504 మంది మహిళలు.
గ్రామం పేరు వెనుక చరిత్ర సవరించు
పూర్వం ఈ ఊరిలో చౌట భూమి, ఉప్పు నీరు ఎక్కువగా ఉండడం వలన ఈ ఊరికి చౌటుప్పల్ అనే పేరు వచ్చిందని కథనం.
100 పడకల ఆసుపత్రి సవరించు
2022లో మునుగోడు ఉపఎన్నిక సమయంలో తెలంగాణ ప్రభుత్వం మంజూరుచేసిన 100 పడకల ఆసుపత్రికి 2023 ఏప్రిల్ 18న తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. చౌటుప్పల్‌లో 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని 100 పడకల ఆస్పత్రిగా మార్చడంకోసం ప్రభుత్వం 36 కోట్ల రూపాయలు మంజూరు చేసింది.[3]
జనరల్ సర్జన్‌తోపాటు ఎముకల, చిన్న పిల్లల, చెవు, ముక్కు, గొంతు, గైనకాలజి, అనస్తీషియా, బ్లడ్ బ్యాంక్, ఐసీయూ ప్రత్యేక విభాగాల వైద్య సేవలు అందుబాటులోకి రానున్న ఈ ఆసుపత్రిలో 20 మంది పైగా వైద్యులు, 100 మందికి పైగా ఇతర సిబ్బంది కూడా పనిచేయనున్నారు.[4]
మూలాలు సవరించు
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 247 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "యాదాద్రి భువనగిరి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.
- ↑ "మునుగోడు ఉప ఎన్నిక హామీ.. 100 పడకల ఆస్పత్రికి మంత్రి హరీశ్ శంకుస్థాపన". EENADU. 2023-04-18. Archived from the original on 2023-04-18. Retrieved 2023-04-18.
- ↑ telugu, NT News (2023-04-18). "Choutuppal | చౌటుప్పల్‌లో 100 పడకల ఆస్పత్రికి శంకుస్థాపన చేసిన మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి". www.ntnews.com. Archived from the original on 2023-04-18. Retrieved 2023-04-18.