ఆదోని పురపాలక సంఘం

ఆదోని పురపాలక సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కర్నూలుజిల్లాకు చెందిన మున్సిపాలిటీ.ఈ పురపాలక సంఘం కర్నూలు లోక్‌సభ నియోజకవర్గంలోని, ఆదోని శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన పురపాలక సంఘం.

ఆదోని పురపాలక సంఘం
ఆదోని
ఆదోని పురపాలక సంఘ భవనం
స్థాపన1865
రకంస్థానిక సంస్థలు
చట్టబద్ధతస్థానిక స్వపరిపాలన
కేంద్రీకరణపౌర పరిపాలన
ప్రధాన
కార్యాలయాలు
ఆదోని
కార్యస్థానం
అధికారిక భాషతెలుగు
ప్రధానభాగంపురపాలక సంఘం
జాలగూడుఅధికార వెబ్ సైట్

చరిత్ర

మార్చు

ఆదోని పురపాలకసంఘం 1865 లో ఆవిర్భవించింది. అప్పటిలో బళ్లారి జిల్లాలో ఉండేది. అప్పటి బళ్లారి కలెక్టర్‌ అధ్యక్షతన తొలి పాలకవర్గం కొలువుదీరింది. ఆనాటి జనాభా కేవలం 12,500 మాత్రమే. నివాస గృహాలు 450. పట్టణ విస్తీర్ణం 10.5 చ. కి.మీ.పురపాలక సంఘం తొలి చైర్మన్ గా‌ హజీకే అబ్దుల్‌ రెహమాన్‌ పనిచేశారు.ఆదోని మున్సిపాలిటీకి 1917లో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగాయి.1952లో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాకా బళ్లారి జిల్లా నుంచి ఆదోని విడిపోయి, కర్నూలు జిల్లాలో చేరింది.[1]

జనాభా గణాంకాలు

మార్చు

కర్నూలు జిల్లాలోని ఆదోని పురపాలక సంఘంలో 41 వార్డులుగా విభజించారు, దీనికి ప్రతి 5 సంవత్సరాలకు ఎన్నికలు జరుగుతాయి.2011 జనాభా లెక్కల మొత్తం జనాభా 269,286 ఉండగా వీరిలో 134,306 మంది పురుషులు,134,980 మంది మహిళలు ఉన్నారు.ఆదోని నగరంలో 0 - 6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 34,555 వీరిలో మగ పిల్లలు సంఖ్య 17,585, ఆడ పిల్లలు సంఖ్య 16,970 ఉన్నారు.[2]

పౌర పరిపాలన

మార్చు

పురపాలక సంఘం కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. పురపాలక సంఘం పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం దీనిని 41 ఎన్నికల వార్డులుగా విభజింపబడింది. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్‌పర్సన్ నేతృత్వం వహిస్తారు. 2021 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం ఛైర్​పర్సన్​గా బోయ శాంత, వైస్ ఛైర్మన్​గా గౌస్ ఎన్నికయ్యారు.వీరు ఎన్నికైననాటినుండి నుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.[3]

అవార్డులు, విజయాలు

మార్చు

2015 లో, స్వచ్ఛ భారత్ ర్యాంకింగ్స్‌లో ఆదోని పురపాలక సంఘం దేశంలో 148 వ స్థానంలో ఉంది.[4]

ఇతర వివరాలు

మార్చు

ఈ ప్రాంతం 38.16 చ.కి.మీ.లో విస్తరించి ఉంది. గృహాల సంఖ్య 33071, రెవెన్యూ వార్డుల సంఖ్య 26, ఎన్నికల వార్డుల సంఖ్య 41, మురికివాడల సంఖ్య 51, మురికివాడల జనాభా 61510, ప్రభుత్వ ఆసుపత్రుల సంఖ్య 3, ప్రభుత్వ పాఠశాలల సంఖ్య 15, పబ్లిక్ పార్కుల సంఖ్య 2, కమ్యూనిటీ హాల్స్ 5 ఉన్నాయి.[5]

మూలాలు

మార్చు
  1. "ఆంధ్రా ముంబై అథోగతి". www.andhrajyothy.com. Retrieved 2020-06-16.
  2. "Adoni Mandal Population, Religion, Caste Kurnool district, Andhra Pradesh - Census India". www.censusindia.co.in. Archived from the original on 2020-06-16. Retrieved 2020-06-16.
  3. "ఆదోని మున్సిపల్ ఛైర్ పర్సన్". ETV Bharat News. Retrieved 2021-03-26.{{cite web}}: CS1 maint: url-status (link)
  4. Kumar, S. Sandeep (2015-08-10). "Small towns fare better in Swachh Bharat rankings". The Hindu. ISSN 0971-751X. Retrieved 2020-06-16.
  5. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-01-30. Retrieved 2020-06-16.

వెలుపలి లంకెలు

మార్చు