స్థానిక స్వపరిపాలన
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
ప్రజాస్వామ్య వ్యవస్థ సమర్థవంతంగా వుండాలంటే దేశ ప్రజలు పరిపాలనలో భాగస్వాములు కావాలి. పెద్ద దేశాలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, మారుమూల ప్రాంతాల సమస్యలు పరిష్కరించాలంటే, సులభం కాదు. అతి విశాలమైన భారతదేశంలో మారుమూల ప్రాంతాల ప్రజలు ప్రభుత్వ ఫలాలను అందుకోవాలంటే పరిపాలన / పరిపాలనా అధికార వికేంద్రీకరణం చెందాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకని స్థానిక స్వపరిపాలన విధానం ఏర్పాటైంది.
ప్రయోజనాలుసవరించు
- స్థానిక పరిపాలనా సంస్థలు ప్రజలలో రాజకీయ చైతన్యాన్ని కల్గిస్తాయి.
- వీటిలో అనుభవం పొందిన నాయకులు, రాష్ట్ర, కేంద్ర నాయకులుగా ఎదగ గలుగుతారు.
- పౌరులలో ఉత్తమ పౌర లక్షణాలు, సేవాతత్పరత, బాధ్యతాయుత ప్రవర్తన పెంచుతాయి.
- అధికార వికేంద్రీకరణకు, స్థానిక వ్యవహారాలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జోక్యం తగ్గించటానికి తోడ్పడతాయి.
- ప్రజాస్వామ్య విజయాలకు ఇవి కీలకం.
స్థానిక స్వపరిపాలన సంస్థలు - రకాలుసవరించు
- పట్టణ స్థానిక సంస్థలు : పురపాలక సంఘం, నగరపాలక సంస్థ, కంటోన్మెంట్ బోర్డ్, పోర్ట్ ట్రస్ట్
- గ్రామీణ స్థానిక సంస్థలు: పంచాయతీ రాజ్ సంస్థలు అనగా గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్
మూలాలుసవరించు
వనరులుసవరించు
- తెలుగు వారి సంపూర్ణ పెద్దబాలశిక్ష - గాజుల సత్యనారాయణ, జనవరి 2004, పే 717,