ఆనందవాచకపుస్తకము
ఆనందవాచక పుస్తకము నాల్గవ తరగతి విద్యార్థుల కోసం 1930 లో రచించబడిన వాచకం. దీనిని కూచి నరసింహం, పానుగంటి లక్ష్మీ నరసింహారావు లు రూపకల్పన చేశారు. దీనిని డైరక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇనస్ట్రక్షన్స్, మద్రాసు వారు ఆమోదించారు. దీనిని మద్రాసులోని వెంకటేశ్వర అండ్ కో ప్రచురించింది. [1]
రచన నేపథ్యం
మార్చు1930ల నాటి 4వ తరగతి వాచకమిది. కథలు, కబుర్లు, విషయాలు, విశేషాలు, మేళవించి తయారుచేశారు. కాలానుగుణంగా పూర్తి వ్యావహారికం, పూర్తి గ్రాంథికం కాక శిష్ట వ్యవహారికంలో ఉంది. ఈ గ్రంథాన్ని కూచి నరసింహం, పానుగంటి లక్ష్మీనరసింహరావు తయారుచేశారు.
విషయ సూచిక
మార్చుపార్టు - 1
మార్చు- బీదవాడు, రూపాయల సంచి : కథ
- కోతి : కథ
- భూమి కొలతలు : కరణము, గోపాలరావు, సుబ్బావధాని ల సంభాషణ
- ఎలుక, కప్ప : కథ
- మేక
- నాణెములు, టంకసాల
- ఓరిమి
- కుమ్మరి
- ఋతువులు
- రామాయణ కథా సంగ్రహము
- రాబందు
- పదార్థ స్థితులు
- ప్రభువు, బానిస
- వరిచేను (మొదటి భాగము)
- వరిచేను (రెండవ భాగము)
- అది మా పని కాదు
- జిల్లా
- రాజు, కాపువాని కొడుకు
- తోడేలు
- పావురములు, గువ్వలు - మొదటి భాగము
- పావురములు - గువ్వలు - రెండవ భాగము
- మితభోజనాదికము
- సింహము
- హిందూదేశము, అందలి ప్రజలు : మొదటి భాగము
- హిందూదేశము, అందలి ప్రజలు : రెండవభాగము
- దశారధుని శాపము
- ఆరోగ్య మార్గములు, నీరు
- పి.రంగనాధ ముదలి గారు
- వృక్షములు, వృక్షకాండములు
- ఎడ్వరు చక్రవర్తిగారు
- ఉత్తర ప్రత్యుత్తరములు, విలాసము
పార్టు - 2
మార్చు- పువ్వులు కోయుట
- చిలుక
- వేము - తుంగ
- పొట్ట, ఇతరావయవములు
- గట్టు ప్రభువు కుచేలోపాఖ్యానములోని పద్యములు
- రెయిల్ బండి
పార్టు - 3
మార్చు- వ్యాకరణము
మూలాలు
మార్చు- ↑ కూచి నరసింహం, పానుగంటి లక్ష్మీనరసింహరావు (1930). ఆనందవాచకపుస్తకము (నాల్గవతరగతి).