ఆపరేషన్ అజయ్ అనేది 2023 ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం సమయంలో ఇజ్రాయిల్ నుండి భారతీయ పౌరులను తరలించడానికి భారత రక్షణ దళాలచే కొనసాగుతున్న ఆపరేషన్.[1]

ఆపరేషన్ అజయ్
Part of 2023 ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం, ఇజ్రాయెల్-పాలస్తీనియన్ వివాదం
సహాయ కార్యక్రమము మానవతా దృక్పథం
అందించినవారు భారత సాయుధ దళాలు, విదేశాంగ మంత్రిత్వ శాఖ (భారతదేశం)
Commanded by జనరల్ (భారతదేశం)
కార్యక్రమ ఉద్దేశ్యము ఇజ్రాయిల్ నుండి భారతదేశంనకు పౌరుల తరలింపు
తేదీ 2023 అక్టోబరు 12
నిర్వహించినవారు భారత సాయుధ దళాలు

ఇజ్రాయెల్ - పాలస్తీనాల మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా ఇజ్రాయెల్ లో పెద్ద సంఖ్యలో విదేశీయులు చిక్కుకుపోయారు. వీరిలో భారతీయుల సంఖ్య కూడా చాలా ఎక్కువే. ఇలా చిక్కుకుపోయిన వారిలో విద్యార్థులు, ఐటీ నిపుణులు, టూరిస్టులు, ఇతరులు ఉన్నారు. వారిని సురక్షితంగా మన దేశానికి రప్పించేందుకు భారత ప్రభుత్వం చర్యలను చేపట్టింది. భారత పౌరుల కోసం ఆపరేషన్ అజయ్ కార్యక్రమాన్ని విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ ప్రారంభించాడు.[2]

నేపథ్యం

మార్చు

2023 అక్టోబరు 7న ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రారంభమైంది. ప్రభావిత ప్రాంతాల్లో 18,000 మంది భారతీయులు నివసిస్తున్నారని అంచనా.[3]

పురోగతి

మార్చు

ఆపరేషన్ అజయ్ ప్రోగ్రామ్‌లో భాగంగా 2023 అక్టోబరు 13న మొదటి విమానంలో కేంద్ర ప్రభుత్వం ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న 212 మంది భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చింది. కాగా, 2023 అక్టోబరు 14న రెండో విమానం 235 మందితో ఢిల్లీ చేరుకుంది.[4]

భారతీయులు 18 వేల మందికి పైగా ఇజ్రాయెల్‌లో ఉన్నట్లు అంచనావేయగా ఆపరేషన్ అజయ్‌లో భాగంగా ఇండియన్ ఎంబసీలో మొదటగా రిజస్టర్ చేసుకున్నవారిని స్వదేశానికి తీసుకువస్తారు. ఈ ఆపరేషన్ అజయ్ కార్యక్రమం కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఇవీ చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "India launches 'Operation Ajay' to bring back citizens from war-hit Israel". Hindustan Times (in ఇంగ్లీష్). 11 October 2023.
  2. https://web.archive.org/web/20231012063450/https://www.sakshi.com/telugu-news/international/operation-ajay-first-batch-indians-fly-out-israel-today-1809944. Archived from the original on 2023-10-12. Retrieved 2023-10-12. {{cite web}}: Missing or empty |title= (help)CS1 maint: bot: original URL status unknown (link)
  3. "India Launches "Operation Ajay" To Repatriate Indians From Israel". NDTV.com. Retrieved 11 October 2023.
  4. "ఆపరేషన్ అజయ్". Archived from the original on 2023-10-14. Retrieved 2023-10-14.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)