ఆయనము ఒక కాలమానము. ఒక ఆయనము 3 ఋతువులు లేదా 6 నెలలకు సమానము. ఒక సంవత్సరములో రెండు ఆయనాలు వస్తాయి. అవి ఉత్తరాయణం, దక్షిణాయణం.

సౌర వ్యవస్థ పెయింటింగ్

ఉత్తర ఆయనంసవరించు

ఉత్తర ఆయనం అంటే ఉత్తరం వైపుకి పయనించడం అని అర్ధం. సూర్యుడు కొంత కాలం భూమధ్యరేఖకి దక్షిణం వైపు పయనించడం, తరువాత దక్షిణం వైపు నించి ఉత్తరం వైపుకి పయనించడం జరుగుతూ ఉంటుంది. సూర్యుడు పయనించే దిక్కుని బట్టి దక్షిణం వైపుకి పయనిస్తున్నపుడు దక్షిణాయనం అని ఉత్తరం వైపుకి పయనిస్తున్నప్పుడు ఉత్తరాయణం అని అంటారు.

తెలుగు మాసములుసవరించు

చైత్ర మాసం -- ఉత్తరాయనం -- వసంత ఋతువు
వైశాఖ మాసం -- ఉత్తరాయనం -- వసంత ఋతువు
జ్యేష్ట మాసం -- ఉత్తరాయనం -- గ్రీష్మ ఋతువు
ఆషాఢ మాసం -- ఉత్తరాయనం + దక్షిణాయనం గ్రీష్మ ఋతువు

శ్రావణ మాసం --దక్షిణాయనం -- వర్ష ఋతువు
భాద్రపద మాసం --దక్షిణాయనం -- వర్ష ఋతువు
ఆశ్వయుజ మాసం --దక్షిణాయనం -- శరత్ ఋతువు
కార్తీక మాసం --దక్షిణాయనం -- శరత్ ఋతువు
మార్గశిర మాసం --దక్షిణాయనం -- హేమంత ఋతువు

పుష్య మాసం -- దక్షిణాయనం + ఉత్తరాయణం -- హేమంత ఋతువు
మాఘ మాసం -- ఉత్తరాయనం -- శిశిర ఋతువు
ఫాల్గుణ మాసం -- ఉత్తరాయనం -- శిశిర ఋతువు

"https://te.wikipedia.org/w/index.php?title=ఆయనము&oldid=3274555" నుండి వెలికితీశారు