ఆరవ విక్రమాదిత్య

(ఆరవ విక్రమాధిత్య నుండి దారిమార్పు చెందింది)

రెండవ సోమేశ్వరుడిని పదవీచ్యుతుడైన తరువాత ఆయన తమ్ముడు ఆరవ విక్రమాదిత్య (r. సా.శ. 1076–1126) పశ్చిమ చాళుక్య రాజు అయ్యాడు. చాళుక్య భూభాగం మీద చోళ దండయాత్రలో చాళుక్య సామతుల మద్దతు పొందడం ద్వారా ఆయన చేసిన రాజకీయ చర్యగా ఇది భావించబడుతుంది.[1][2] విక్రమాదిత్య పాలన సాకా యుగం ముగింపు చాళుక్య-విక్రమా శకం ప్రారంభంగా గుర్తించబడింది. ఆయన పాశ్చాత్య చాళుక్య రాజులలో గొప్పవాడుగానూ రాజవంశంలో సుదీర్ఘ పాలనసాగించిన రాజుగానూ ప్రసిద్ధి చెందాడు. ఆయన పెర్మాదిదేవ, త్రిభువనమల్ల ("మూడు ప్రపంచాల ప్రభువు") అనే బిరుదును సంపాదించాడు.[3][4][5] ఆయనకు అనేక మంది రాణులు ఉన్నారు. వారు పరిపాలనలో అతనికి సహాయం చేశారు. ఆయన రాణులలో ఒకరైన కరాడు శిలాహర పాలక కుటుంబానికి చెందిన యువరాణి చందాలా దేవిని కళాకారిణిగా చేసి నైపుణ్యం ప్రదర్శించిన కారణంగా ఆమెను అభినవ సరస్వతి అని పిలిచేవారు. కేతళ దేవి రాణి సిరుగుప్ప ప్రాంతాన్ని పరిపాలించింది. సవాలా దేవి నరేగలులో అగ్రహార బాధ్యతలు నిర్వర్తించారు.[6] చరిత్రకారుడు కామతు అభిప్రాయం ఆధారంగా ఆరవ విక్రమాదిత్య "దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన గొప్ప రాజు" గుర్తించబడ్డాడు. ఆయన "కర్ణాటక చరిత్రలో స్థానం " సంపాదించాడు. విజయనగర యుగానికి ముందు కన్నడలోని మరిన్ని శాసనాలు ఏ ఇతర రాజులకంటే ఆరవ విక్రమాదిత్యకు ఆపాదించబడినవి అధికంగా ఉన్నాయి.[4][7]

ఆరవ విక్రమాదిత్య
ఆరవ విక్రమాదిత్య
కుబటూరు వద్ద కైటభేశ్వర ఆలయం (సిర్కా 1100)
పశ్చిమ చాళుక్య రాజు
పరిపాలనక్రీ.శ. 1076–1126 (50 సంవత్సరాలు)
పూర్వాధికారిరెండవ సోమేశ్వరుడు
ఉత్తరాధికారిమూడవ సోమేశ్వరుడు
మరణం1126 CE
Spouseచందల దేవి
కేతల దేవి
సావల దేవి
వంశముమూడవ సోమేశ్వరుడు
Houseచాళుక్య వంశం
తండ్రిమొదటి సోమేశ్వరుడు
Mahadeva temple at Itagi (c.1112)
Kalleshvara temple (c.1083) at Ambali
Bhimeshvara temple at Nilagunda (c.1075-1100)
Mallikarjuna temple at Kuruvatti temple (c.1070-1100)

ఆరవ విక్రమాదిత్య కళ, లిపి పోషణకు ప్రసిద్ధి చెందారు. ఆయన ఆస్థానం ప్రసిద్ధ కన్నడ, సంస్కృత కవులతో అలంకరించబడింది.[8] కన్నడంలో ఆయన సోదరుడు యువరాజు కీర్తివర్మ పశువైద్య శాస్త్రసంబంధిత గోవైద్యను వ్రాసాడు. కవి బ్రహ్మశివ సమయపరిక్షే ("సిద్ధాంతం విశ్లేషణ", సి. 1125) వ్రాసి కవి చక్రవర్తి ( "కవులలో చక్రవర్తి") బిరుదు గ్రహించాడు.[9] ప్రసిద్ధ సంస్కృత విద్యాపతి ("పండిటు") బిరుదు సంపాదించిన బిల్హానా వంటి పండితులు సుదూర కాశ్మీరు నుండి తన సభకు వచ్చి విక్రమంకదేవచరితలో తన పోషకుడైన రాజు జీవితం మీద పనేజిరికు రాశారు. కవి తన పాలనను రామరాజ్య ("రామ రాజ్యం") తో పోల్చాడు. విజ్ఞానేశ్వర తన న్యాయస్థానంలో ప్రసిద్ధ న్యాయమూర్తి మితాక్షర, యజ్ఞవల్క్య స్మృతి (హిందూ కుటుంబ చట్టం) వ్యాఖ్యానం రాశారు. రాజు గురించి ఆయన "విక్రమార్కా లాంటి రాజు ఇంతవరకు పుట్టలేదు ఇక మీదట పుట్టబోడు " అని రాశాడు.[10] ఆరవ విక్రమాదిత్య విశ్వాసం ద్వారా శైవమతాన్ని అవలంబించాడు.[3] ఆయన పాలనలో ఆలయ నిర్మాణ కార్యకలాపాలు అధికంగా జరిగాయి. మల్లికార్జున ఆలయం,[11] మహాదేవ ఆలయం [12] కైతాభేశ్వర ఆలయం,[13] కల్లేశ్వర ఆలయం వంటి ముఖ్యమైన ఆలయాలు నిర్మించబడ్డాయి.[14] చరిత్రకారుడు సేను అభిప్రాయం ఆధారంగా ఆరవ విక్రమాదిత్య 50 సంవత్సరాల పాలన మొత్తం శాంతియుతమైనది సంపన్నమైనదిగా భావించబడుతుంది. సేను తన శిఖరాగ్రస్థితిలో ఆరవ విక్రమాదిత్య తుమ్కూరు జిల్లా, దక్షిణాన కుడపా నుండి ఉత్తరాన నర్మదా నది వరకు, ఖమ్మం జిల్లా, తూర్పు, ఆగ్నేయంలోని గోదావరి జిల్లా వరకు విస్తరించి ఉన్న విస్తారమైన సామ్రాజ్యాన్ని నియంత్రించాడు.[15]

విక్రమాదిత్యుడి తిరుగుబాటు, పదవిని చేపట్టడం, చోళులతో సంబంధాలు

మార్చు

1068 కి ముందు తన తండ్రి మొదటి సోమేశ్వరుడి పాలనలో విక్రమాదిత్యుడు తన సైనిక పోరాటాలతో ఆధునిక బీహారు బెంగాలు వరకు తూర్పుప్రాంతాన్ని జయించాడు.[16][17][18] తన తండ్రి మరణం తరువాత బెలవోలా -300, పులిగెరె -300 ప్రాంతాలను పరిపాలించిన ఆయన అన్నయ్య యువరాజు రెండవ సోమేశ్వరుడు సింహాసనం అధిష్టించిన వెంటనే ఆరవ విక్రమాదిత్య ఆయనను పడగొట్టడానికి, పెరుగుతున్న చోళశక్తితో పోరాడటానికి ప్రణాళికలు వేయడం ప్రారంభించాడు. గుత్తి, కంపిలి మీద చోళ దండయాత్రను సాగించడం ద్వారా, విరారాజేంద్ర చోళుడితో దౌత్య సంబంధాలను ఏర్పరచుకున్నాడు. జయసింహ, చాళుక్య భూస్వామ్యవాదులు, ఉచ్చంగి పాండ్యులు, సీన, మద్దతు పొందడం ద్వారా నైపుణ్యం ప్రదర్శించి దౌత్యంతో మాల్నాడు హొయసలు, కొంకణ, హంగలు కదంబాల మీద విజయాలు సాధించాడు. రెండవ సోమేశ్వరుడు మొదటి కులోతుంగ చోళుడు (తూర్పు చాళుక్య-చోళ రాజ కుటుంబానికి చెందిన రెండవ రాజేంద్రుడు కూడా పిలుస్తారు) గోవాలోని కదంబల మద్దతు ఉంది. దౌత్య సంబంధాలలో ఈ ఆకస్మిక మార్పు ఆచరణాత్మకంగా చాళుక్య రాజ్యాన్ని రెండు భాగాలుగా విభజించి దక్షిణార్ధం (గంగావాడి) మీద ఆరవ విక్రమాదిత్య స్వతంత్ర పాలనను ఇచ్చింది. విక్రమాదిత్యుడు వీరరాజజేంద్ర చోళ కుమార్తెలలో ఒకరిని వివాహం చేసుకున్నాడు. రెండు రాజ్యాల మధ్య పాత కాలపు వైరానికి తాత్కాలిక ముగింపుకు తీసుకువచ్చాడు.[19][20]

1069 లో వీరరాజేంద్ర చోళుడి మరణంతో అధికార సమతుల్యత మళ్లీ మారిపోయింది. ఆరవవిక్రమాదిత్య కాంచీ మీదుగా ముందుకు సాగి అక్కడ తిరుగుబాటుతో తన చిన్న బావమరిది అధిరాజేంద్ర చోళుడికి గంగైకొండ చోళపురం వద్ద సింహాసనం ఏర్పాటు చేశాడు. కానీ ఇది తన సొంత ప్రణాళికలను కలిగిన మొదటి కులోత్తుంగ చోళుడి ప్రణాళికకు వ్యతిరేకంగా జరిగింది. కులోతుంగ వెంగీ పాలకుడు విజయదిత్యను బహిష్కరించాడు. చోళ రాజధానిలో జరిగిన ఒక పౌర తిరుగుబాటులో మొదటి కులోతుంగ చోళుడికి చోళ సామ్రాజ్యానికి చక్రవర్తిగా పట్టాభిషేకం చేసే మార్గం సుగమం చేయడానికి అతిరాజేంద్ర చంపబడ్డాడు.[20][21] 1070-72లో విజయబాహు సిలోనును చోళ పాలన నుండి తప్పించటానికి తిరుగుబాటు చేసి విజయం సాధించినప్పుడు సిలోను కొత్త రాజును తన "సహజ మిత్రుడు"గా ప్రకటించడంలో ఆరవ విక్రమాదిత్య సమయం వృధా చేయలేదు. 1076 నాటికి రెండవ గృహంలో ఉండగా రెండవ సోమేశ్వరుడూ, వేంగి చోళ దేశంలో మొదటి కులోతుంగ చోళుడు వంటి శత్రువులు చుట్టుముట్టినప్పటికీ ఆరవ విక్రమాదిత్య తన అన్నయ్యను విజయవంతంగా ఓడించి బందీగా తీసుకున్నాడు. తరువాత ఆయన తనను తాను చాళుక్య చక్రవర్తిగా పట్టాభిషేకం చేసుకుని విక్రమా వర్ష అనే కొత్త శకాన్ని ప్రారంభించాడు.[3][5][22]

హొయశిల భీతి

మార్చు

సుమారు 1080–1082 ప్రాంతంలో బనవాసి రాజప్రతినిధి చక్రవర్తి తమ్ముడు జయసింహ చేసిన తిరుగుబాటు అణచివేయబడి తిరుగుబాటుదారుడు క్షమించబడ్డాడు.[23] అయినప్పటికీ ఆధునిక కర్ణాటకలోని మాల్నాడు ప్రాంతం నుండి ప్రాముఖ్యత పొందిన హొయసల రాజవంశం నుండి నిజమైన ముప్పు వచ్చింది. వారి భూభాగం చాళుక్య చోళ రాజ్యాల మధ్య అనుసంధానంగా పనిచేసింది. అనేక దశాబ్దాలుగా హొయసలలు చాళుక్యుల విశ్వాసపాత్రులుగా ఉన్నారు. మొదటి సోమేశ్వరుడు (విక్రమాదిత్యుడి తండ్రి) హొయసల యువరాణిని తన రాణిగా తీసుకున్నాడు. హొయసల రాజులు వినయదిత్య, ఎరేయంగా, మొదటి వీర బల్లాల ఆరవ విక్రమాదిత్యతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించారు. చరిత్రకారులు శాస్త్రి, కామతు అభిప్రాయం ఆధారంగా బల్లాల రాజు విష్ణువర్ధనుడు "గొప్ప యోధుడు"గా ప్రతిష్ఠాత్మక పాలకుడుగా విస్తరణ ప్రణాళికలు కలిగి ఉన్నాడు. ఆయన ఉచ్చంగి పాండ్య పాలకుడు గోవాలోని కదంబ రాజు రెండవ జయకేసి మద్దతు లభించింది. విష్ణువర్ధన ఆధ్వర్యంలోని హొయసలు 1116 లో ప్రఖ్యాత తలాకాడు యుద్ధంలో చోళులను ఓడించి తమ భూభాగాన్ని విస్తరించడం ప్రారంభించారు. దీని ఫలితంగా గంగావాడి (ఆధునిక దక్షిణ కర్ణాటకలో భాగం) హొయసల స్వాధీనం అయింది.[4][5][24][25] తరువాత విష్ణువర్ధనుడు తన దృష్టిని ఉత్తరం వైపు సారించి నోలంబవాడిని జయించి తుంగభద్ర నది దాటి దండయాత్ర కొనసాగించి బల్లరీ, కుమ్మతా చేరుకున్నప్పుడు ఆరవవిక్రమాదిత్య తన శక్తికి ఆసన్నమైన ముప్పును గ్రహించాడు. పరిస్థితిని ఎదుర్కోవటానికి చాళుక్య చక్రవర్తి తన విశ్వసనీయ సైనికాధికారులను రెండవ అచుగి, సిరా కుటుంబానికి చెందిన యెరంబార్జు (లేదా యెల్బుర్గా) కు పంపించాడు. సి .1117-1122 మధ్య గోవా, కన్నెగళ, హలాసూరు, హోసవిడులలో అనేక పోరాటాల తరువాత విష్ణువర్ధన, ఆయన మద్దతుదారులు చాళుక్య ఆధిపత్యాన్ని అంగీకరించాల్సి వచ్చింది.[4][5][24][25]

చోళ, గుర్జర దేశాలలో విజయంసాధించడం

మార్చు

తన పాలన ప్రారంభం నుండి ఆరవ విక్రమాదిత్య వెంగీ, కంచి వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం కొనసాగించాడు. ఆయన 1085 లో కాంచీ మీద దాడి చేసి స్వాధీనం చేసుకుని దానిని కొన్ని సంవత్సరాలు ఆధీనంలో ఉంచాడు. ఆయన 1088 లో వేంగి భాగాలను జయించగలిగాడు. వేంగీలోని కొల్లిపాకీ -7000 చాలా సంవత్సరాలు ఆధీనంలోకి నిలబెట్టుకున్నాడు. 1093 నుండి 1099 వరకు వెంగీని మళ్లీ తన పాలనలోకి తీసుకునివచ్చాడు. తరువాత చోళులు దీనిని 1099 లో తిరిగి స్వాధీనం చేసుకున్నారు. తలాకాడులో చోళులకు వ్యతిరేకంగా హొయసల విజయం ఇచ్చిన ఉత్సాహంతో వెంగీలో నాయకత్వంలోని శూన్యతను ఉపయోగించుకుని ఆరవ విక్రమాదిత్య తన ప్రసిద్ధ సైన్యాధ్యక్షుడు అనంతపాలాను వెంగీ మీద దాడి చేయడానికి పంపి వేంగీప్రాంతాన్ని జయించి 1118–1124 వరకు వేంగీప్రాంతాన్ని ఆయన పాలనలో తీసుకుని వచ్చాడు. తరువాత తెలుగు దేశంలోని కొన్ని ఇతర ప్రాంతాలు పశ్చిమ చాళుక్య సైనికాధికారుల నియత్రణలో ఉన్నాయి. వెంగీ మీద చోళ ప్రభావం చాలా సంవత్సరాలు కనుమరుగైంది. 1126 లో విక్రమాదిత్య మరణించిన తరువాత చోళులు వెంగీ మీద నెమ్మదిగా ఆక్రమణ ప్రక్రియను ప్రారంభించారు. 1133 నాటికి ఆరవ విక్రమాదిత్య కుమారుడు మూడవ సోమేశ్వరుడు నుండి వెంగీని విక్రమచోళుడు తిరిగి పట్టుకోగలిగాడు.[4][26][27] 1088 కి ముందు ఆరవ విక్రమాదిత్య శిలాహర రాజు మొదటి భోజుడు, దేవగిరి సీనా యాదవులను లొంగదీసుకున్నాడు. ఆయన లత (ఆధునిక గుజరాతు) మీద దండెత్తి గుర్జారా చాళుక్య రాజు కర్ణుని రాజధానిని కొల్లగొట్టి తగలబెట్టాడు. రత్నాపూరు రాజుపూరు రాజు జజ్జలదేవ పురోగతిని ఆపాడు. అతను గోవా తిరుగుబాటు భూస్వామ్యాధిపతి కదంబను ఓడించాడు. కాని తన కుమార్తె మైలా దేవిని రాజు రెండవ జయకేషితో వివాహం జరిపించాడు.[4][15]

చిత్రమాలిక

మార్చు

ఇవి కూడా చూడండి

మార్చు
అంతకు ముందువారు
రెండవ చాళుక్యుడు
పశ్చిమ చాళుక్యుడు
1076–1126
తరువాత వారు
మూడవ సోమేశ్వరుడు

మూలాలు

మార్చు
  1. Sen (2013), pp.52–53
  2. Sastri (1955), p.170
  3. 3.0 3.1 3.2 Chopra, Ravindran and Subrahmanian, (2003), p.139, part 1
  4. 4.0 4.1 4.2 4.3 4.4 4.5 Kamath (1980), p.105
  5. 5.0 5.1 5.2 5.3 Cousens (1926), p.11
  6. Kamath (1980), pp.105–106
  7. Kamat, Jyotsna. "Chalukyas of Kalyana". 1996-2006 Kamat's Potpourri. Retrieved 24 డిసెంబరు 2006.
  8. Sastri (1955), p. 174; Kamath (2001), p. 104–106
  9. Kamath (1980), p. 115; Sastri (1955), p. 358
  10. Cousens (1921), p.12
  11. Sinha (2000), p.142
  12. Cousens (1921), p.101
  13. Hardy (1995), p335
  14. "Kallesvara Swamy Temple". Archaeological Survey of India, Bengaluru Circle. ASI Bengaluru Circle. Archived from the original on 17 సెప్టెంబరు 2014. Retrieved 11 నవంబరు 2019.
  15. 15.0 15.1 Sen (1999), p.387
  16. B.P. Sinha in George E. Somers (1977), p.214
  17. Sen (1999), p.282
  18. Majumdar, R. C. (1952), p.320
  19. Sastri (1955), p.171-172
  20. 20.0 20.1 Kamath (1980), p.104
  21. Sastri (1955), pp.171–172
  22. Sastri (1955)
  23. Sastri (1955), p.175
  24. 24.0 24.1 Sastri (1955), pp.174-175
  25. 25.0 25.1 Sen (1999), p.386
  26. Sastri (1955), pp.175-176
  27. Sen (1999), pp.386-387
  • Chopra, P.N.; Ravindran, T.K.; Subrahmanian, N (2003) [2003]. History of South India (Ancient, Medieval and Modern) Part 1. New Delhi: Chand Publications. ISBN 81-219-0153-7.
  • Kamath, Suryanath U. (2001) [1980]. A concise history of Karnataka : from pre-historic times to the present. Bangalore: Jupiter books. LCCN 80905179. OCLC 7796041.
  • Narasimhacharya, R (1988) [1988]. History of Kannada Literature. New Delhi: Penguin Books. ISBN 81-206-0303-6.
  • Sastri, Nilakanta K.A. (2002) [1955]. A history of South India from prehistoric times to the fall of Vijayanagar. New Delhi: Indian Branch, Oxford University Press. ISBN 0-19-560686-8.
  • Sen, Sailendra Nath (1999) [1999]. Ancient Indian History and Civilization. New Delhi: New Age Publishers. ISBN 81-224-1198-3.
  • Sen, Sailendra Nath (2013) [2013]. A Textbook of Medieval Indian History. New Delhi: Primus. ISBN 978-9-38060-734-4.
  • Cousens, Henry (1996) [1926]. The Chalukyan Architecture of Kanarese Districts. New Delhi: Archaeological Survey of India. OCLC 37526233.
  • Hardy, Adam (1995) [1995]. Indian Temple Architecture: Form and Transformation : the Karṇāṭa Drāviḍa Tradition, 7th to 13th Centuries. New Delhi: Abhinav. ISBN 81-7017-312-4.
  • Sinha, Ajay (2000) [2000]. Imagining architects: creativity in the religious monuments of India. Cranbury: Associated University Press. ISBN 0-87413-684-9.
  • Majumdar, R.C. (2003) [1952]. Ancient India. New Delhi: Motilal Banarsidass. ISBN 81-208-0436-8.
  • Sinha, B.P.; Somers, George E (1977) [1977]. Dynastic History Of Magadha. New Delhi: Abhinav. ISBN 81-7017-059-1.