ఆరా

బీహార్ రాష్ట్రం లోని పట్టణం

ఆరా బీహార్ రాష్ట్రం, భోజ్పూర్ జిల్లాలో నగరం, ఈ జిల్లా ముఖ్యపట్టణం. [3] ఇది గంగా, సోన్ నదుల సంగమ స్థలానికి సమీపంలో ఉంది. ఇది దానాపూర్ నుండి 24 మైళ్ళు, పాట్నా నుండి 36 మైళ్ళ దూరంలో ఉంది. [4]

ఆరా
కలెక్టరేటు వద్ద గల సరోవరం
ఆరా is located in Bihar
ఆరా
ఆరా
బీహార్ పటంలో నగర స్థానం
Coordinates: 25°33′27″N 84°40′12″E / 25.55750°N 84.67000°E / 25.55750; 84.67000
దేశంభారతదేశం
రాష్ట్రంబీహార్
జిల్లాభోజ్‌పూర్
Area
 • Metro
49 km2 (18.919 sq mi)
Population
 (2011)
 • నగరం2,61,430[1]
భాష
 • అధికారికహిందీ[2]
Time zoneUTC+5:30 (IST)
PIN
802301, 802302 & 802312
టెలిఫోన్ కోడ్+91-6182
Vehicle registrationBR-03

భౌగోళికం మార్చు

ఆరా సముద్ర మట్టం నుండి 192 మీటర్ల ఎత్తున్, సోన్ నది, గంగా నది, గంగి నదుల ఒడ్డున ఉంది. [5] గంగ, సోన్ నదుల సంగమం వద్ద ఉంది. పట్టణంలో ప్రవహించే ఇతర చిన్న నదులు గంగీ, బాడ్కి, చోట్కి.

గంగా నది పట్టణానికి ఉత్తర సరిహద్దుగా ఉంది. ఒండ్రు నిక్షేపం కారణంగా ఈ ప్రాంతం చాలా సారవంతంగా ఉంటుంది. బీహార్‌లో గోధుమ పండించే అత్యుత్తమ ప్రాంతంగా పరిగణిస్తారు. పట్టణానికి తూర్పు సరిహద్దుగా ఉన్న సోన్ నది, బీహార్‌లోని భోజ్‌పురి, మగాహి మాట్లాడే ప్రాంతాలను వేరుచేస్తోంది. [6]

శీతోష్ణస్థితి మార్చు

అధిక ఉష్ణోగ్రతలు, ఏడాది పొడవునా సమానంగా ఉండే అవపాతంతో కూడుకున్న శీతోష్ణస్థితి ఆరాలో ఉంటుంది. ఈ వాతావరణం కోసం కొప్పెన్ శీతోష్ణస్థితి వర్గీకరణ ఉప రకం " Cfa " (తేమతో కూడిన ఉపఉష్ణమండల వాతావరణం) గా వర్గీకరించారు. [7]

శీతోష్ణస్థితి డేటా - Arrah
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
సగటు అధిక °C (°F) 23
(73)
26
(78)
32
(90)
37
(99)
38
(100)
36
(96)
33
(91)
32
(89)
32
(90)
32
(89)
28
(82)
24
(75)
31
(88)
సగటు అల్ప °C (°F) 11
(51)
13
(55)
18
(64)
23
(74)
26
(78)
27
(80)
27
(80)
27
(80)
26
(79)
23
(73)
16
(61)
11
(52)
21
(69)
సగటు అవపాతం mm (inches) 15
(0.6)
18
(0.7)
10
(0.4)
7.6
(0.3)
36
(1.4)
180
(7.1)
290
(11.6)
330
(13.1)
220
(8.6)
58
(2.3)
7.6
(0.3)
5.1
(0.2)
1,190
(46.7)
సగటు అవపాతపు రోజులు 1.4 1.7 1 0.7 3 10.1 14 15.1 8.1 4 0.8 0.6 60.5
Source: Weatherbase[8]

జనాభా వివరాలు మార్చు

2011 జనాభా లెక్కల ప్రకారం, ఆరా మునిసిపల్ కార్పొరేషన్ మొత్తం జనాభా 2,61,099. అందులో 1,39,319 మంది పురుషులు, 1,21,780 మంది మహిళలు ఉన్నారు. లింగ నిష్పత్తి 874. ఆరేళ్ళ లోపు పిల్లలు 34,419. ఏడేళ్ళకు పైబడినవారిలో అక్షరాస్యత 83.41%. [9]

భాషలు మార్చు

Languages in Arrah (2011)[10]

  Bhojpuri (85.42%)
  Hindi (8.36%)
  Urdu (5.95%)
  Others (0.27%)

మూలాలు మార్చు

  1. "Arrah City Population Census 2011–2019 | Bihar". www.census2011.co.in.
  2. "52nd REPORT OF THE COMMISSIONER FOR LINGUISTIC MINORITIES IN INDIA" (PDF). nclm.nic.in. Ministry of Minority Affairs. Archived from the original (PDF) on 25 May 2017. Retrieved 9 August 2020.
  3. "Bhojpur district full information". www.bihar.com.
  4. "Maps, Weather, and Airports for Ara, India". www.fallingrain.com.
  5. "About District | Welcome To Bhojpur District | India". Bhojpur.nic.in. 18 October 2019. Retrieved 28 October 2019.
  6. "Geographical Structure". Retrieved 20 August 2020.
  7. "Arrah, India Köppen Climate Classification (Weatherbase)". Weatherbase.
  8. "Weatherbase.com". Weatherbase. 2013. Retrieved on 31 July 2013.
  9. "Cities having population 1 lakh and above" (PDF). Provisional Population Totals, Census of India 2011. Retrieved 16 April 2012.
  10. "Archived copy". Archived from the original on 15 August 2018. Retrieved 26 April 2019.{{cite web}}: CS1 maint: archived copy as title (link)


"https://te.wikipedia.org/w/index.php?title=ఆరా&oldid=3121894" నుండి వెలికితీశారు