నగరం (సిటీ)

జనసాంద్రత చాలా అధికంగా కలిగిన ప్రదేశం.
(నగరం నుండి దారిమార్పు చెందింది)

నగరం లేదా నగరాలు (ఆంగ్లం: City), అంటే విస్తారమైన ప్రజలు నివసించే ప్రదేశం లేదా జనసాంద్రత చాలా అధికంగా కలిగిన ప్రదేశం. 2011 జనాభా లెక్కల ప్రకారం లక్షకు మించి జనాభా కలిగియున్న జనావాస ప్రాంతం/ప్రాంతాలను నగరం లేదా నగరాలు అని అంటారు.[1] ఇవి చారిత్రక ప్రాధాన్యత, ప్రత్యేక అధికారం కలిగి స్వయంపరిపాలన, అనేక చట్టపరమైన అధికారాలు కలిగి ఉంటాయి.వీటిని నిర్వచించటంలో భారత జనాభా గణాంకాల శాఖ ప్రముఖ పాత్ర వహించింది.

చికాగో నగర ఉపగ్రహ దృశ్యం
గోల్కొండ కోట నుండి హైదరాబాదు నగర దృశ్యం

ఇవి పారిశ్రామిక నగరాలు వసతులు కల్పించడంలోనూ, మురుగునీటి కాలవల నిర్వహణ, విస్తృతంగా రవాణా సౌకర్యాలు, నివాసగృహ సముదాయాలను కలిగి ఉండటం వలన ప్రజలను ఆకర్షించి అధిక జనాభా నివాస పట్టణాలు క్రమక్రమాభి నగరాలుగా వృద్ధి చెందుతూ ఉంటాయి.ఈ విధంగా ఉపాధి లభించడం వలన ప్రజలు కార్మికులూ, ఉద్యోగులూ లభించడం వలన పరిశ్రమలూ పరస్పర లబ్ధి పొందుతూ ఉండటాన నగరాల అభివృద్ధికి కారణం అవుతాయి. ప్రజాబాహుళ్యం అధికంగా ఉండటం వ్యాపారాభివృద్ధికి, కళా వినోద పరిశ్రమల అభివృద్ధికి దోహదమౌతాయి. ప్రజాబాహుళ్యానికి తగినంత ఆరోగ్య సమస్యలను తీర్చడానికి వైద్యశాలలూ, విద్యనభ్యసించటానికి మెరుగైన విద్యాసంస్థలూ ఇలా ఒకదానికి ఒకటి అనుబంధంగా వృద్ధి చెందుతూ ప్రజలకు అదనపు అవసరాన్ని కల్పించడం వలన నగరాలు ప్రజలను విపరీతంగా ఆకర్షించడం పరిపాటి అయింది.సాధారణంగా నగరాలు క్రమాభివృద్ధిలో నగరవెలుపలి ప్రాంతాలూ విస్తరించి ఒక్కోసారి ప్రక్కనగరం వరకూ కూడా విస్తరిస్తాయి ఈ కారణంగా కొన్ని జంట నగరాలు ఏర్పడతాయి. ప్రపంచంలో అనేక జంట నగరాలు ఉన్నాయి. ఆంగ్లంలో వీటిని ట్విన్ సిటీస్ గా వ్యవహరిస్తుంటారు. తెలంగాణ రాష్ట్రం లోని హైదరాబాదు, సికింద్రాబాద్ రెండూ ఈకోవకు చెందినవే.

నగరాల పుట్టుక సవరించు

నగరాలు ఎప్పుడు పుట్టాయి ఏది ముందుగా నిర్మించబడింది లాంటి విషయాలు ఇథమిద్ధంగా నిర్ణయించడానికి తగినంత ఆధారాలు లేకపోయినా రాజులూ రాజ్యాలూ ఏర్పడటం నగరాల పుట్టుకకు ఒక ప్రధాన కారణం.పరిపాలనా వ్యవహారాలను చక్కదిద్దటానికి సిబ్బంది,రాజ్య రక్షణార్ధం రక్షణ వ్యవస్థ,వీరందరికి కావలసిన నివాస గృహాలూ ఒక ప్రదేశంలో అవసరమైన కారణంగా రాజ్యాలకు నగరాల అవసరం ఏర్పడింది.నగర నిర్మాణాలకు రాజులూ రాజ్యాలూ కారణమైనాయి.రాజు నివసించే నగరం రాజధానిగా వ్యవహరిస్తూ రాజధాని నుండి రాజ్య నిర్వహణ చేస్తున్న కారణంగా రాజధాని నగరాలు ప్రజలకు మరింత ప్రధాన కేంద్రాలుగా ఉన్నాయి.ప్రజా అవసరాల నిమిత్తం సరుకులు ఒక ప్రడేశం నుండి మరియొక ప్రదేశానికి రవాణా కావలసిన అవసరంచేత కేంద్రంగా ఉన్న కొన్ని ప్రదేశాలు వ్యాపారనగరాలుగా విస్తరించాయి. పురాణకాలంలో మథురా నగరం ఈ కోవలోనికి వస్తుంది. సముద్రతీరాలలో సహజ రేవులూ, మానవ నిర్మిత రేవులూ దేశ విదేశాలలో లభ్యమౌతున్న సామాగ్రిని ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి చేరుస్తున్న కారణంగా వ్యాపార పరమైన విశేష అభివృద్ధికి చేరుకున్నాయి. ప్రస్తుతం చెన్నైగా పిలవబడుతున్న తమిళనాడులోని చెన్నపట్టణం, ప్రస్తుతం కొలకత్తాగా పిలవబడుతున్న పశ్చిమ బెంగాలు రాష్ట్రంలోని కలకత్తా, ప్రస్తుతం ముంబైగా పిలవబడుతున్న మహారాష్ట్రం లోని బాంబే లేక బొంబాయి భారతదేశంలోని రేవుల కారణంగా విశేష ప్రాధాన్యత సంతరించుకొని మహా నగరాలుగా పేరు పొందాయి. వస్త్రతయారీ కేంద్రంగా సూరత్,అగ్గిపెట్టెలు టపాసులు, బ్యానర్లు తయారీలో తమిళనాడులోని శివకాశి, బనియన్ తయారీకి ప్రసిద్ధి పొందిన తిరుపూరు లాంటి నగరాలు ఈ కోవకు చెందుతాయి.

పురాణాలలో వర్ణించబడిన నగరాలు సవరించు

రామాయణంలో దశరథుని రాజధాని అయోధ్య, మైదిలీ పుట్టిన జనకుని రాజధాని మిథిల, దానవరాజైన రావణాసురుని రాజధాని లంకాపురి ముఖ్యమైనవి. వీటిలో లంకాపురి ఆ కాలంలోని నిర్మాణకౌశలాన్ని విశేషంగా కలిగిన సంపన్న నగరం.రామాయణంలోని సుందరకాండలో ఈ నగర వర్ణన హనుమంతుని ద్వారా వాల్మికి చేయించడం విశేషం. అలాగే అయోధ్య సమృద్ధికి చిహ్నంగా రామాయణంలో వర్ణించ బడింది.అలాగే భారతంలో అనేక నగరాల వర్ణన జరిగింది. కృష్ణుడు జన్మించిన కంసరాజధాని మధుర, కౌరవ రాజధాని హస్తినాపురం, పాండవ నిర్మితమైన ఇంద్రప్రస్తం. వీటిలో ఇంద్ర ప్రస్తం పాండవులు అడవులను తొలగించి రాజ్యపాలనా సౌలభ్యం నిమిత్తం పాండవులు మయుని సాయంతో నిర్మించుకుకున్న నగరం. ఈ నగరం ఆకాలంలో నిర్మాణ కౌశలానికి విశేషంగా వర్ణించబడటం విశేషం.పాండవుల రాజభవన వర్ణన భారతంలో విశేషంగా వర్ణించబడింది.ఈ నిర్మాణంలో భారత ఇతిహాసంలో ప్రధాన మలుపుకు కారణం అయిన విషయం లdha hamsi dherabi dhabhmsi dherabi .

ఇవీ చూడండి సవరించు

మూలాలు సవరించు

  1. "Census of India - Metadata". web.archive.org. 2007-06-17. Archived from the original on 2007-06-17. Retrieved 2022-07-24.

వెలుపలి లంకెలు సవరించు