ఆరిజోనా అమెరికా లోని రాష్ట్రాల్లో ఒకటి. ఈ రాష్ట్రం అమెరికా నైఋతి ప్రాంతంలో ఉంది. ఈ రాష్ట్రం ఎడారి ప్రదేశాలకు, అతి తీవ్రమయిన వేసవికి, మధ్యస్థమైన చల్లదనం కలిగిన శీతాకాలానికి ప్రసిద్ధి కెక్కింది. ఈ రాష్ట్రానికి న్యూమెక్సికో, యూటా, నెవాడా, కాలిఫోర్నియా, కొలరాడో రాష్ట్రాలు సరిహద్దులు. మెక్సికోలోని సొనోరా, బాజా కాలిఫోర్నియా అంతర్జాతీయ సరిహద్దులు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గ్రాండ్ కాన్యన్ లోయ, అనేకమయిన అడవులు, స్మారక స్థూపాలు, రెడ్ ఇండియన్ ల ఆవాసాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. దీని రాజధాని, అతిపెద్ద నగరమూ ఫీనిక్స్.

అమెరిక మ్యాపులో అరిజోనా రాష్ట్రం

అమెరికాలో చేరిన రాష్ట్రాల్లో అరిజీఓనా 48 వది. 1912 ఫిబ్రవరి 14 న రాష్ట్ర హోదా పొందింది. చారిత్రికంగా న్యూ స్పెయిన్ లోని అల్టా కాలిఫోర్నియాలో ఉండే ఈ ప్రాంతం, 1821 లో మెక్సికోలో భాగమైంది. మెక్సికో - అమెరికా యుద్ధాంలో ఓడిపోయాక 1848 లో మెక్సికో ఈ ప్రాంతాన్ని అమెరికాకు అప్పగించింది. రాష్ట్రం లోని దక్షిణ కొసన ఉన్న ప్రాంతాన్ని 1853 లో అమెరికా కొనేసింది.

దక్షిణ అరిజోనాలో ఎడారి శీతోష్ణస్థితి ఉంటుంది. ఉత్తరాన పైన్ అడవులు, కొలరడో పీఠభూమి, పర్వతాలు, లోతైన గండ్లతో ఉంటుంది. ఈ ప్రాంతంలో వేసవి ఉష్ణోగ్రతలు మధ్యస్థంగాను, శీతాకాలాల్లో మంచు కురుస్తూనూ ఉంటుంది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గ్రాండ్ కాన్యన్ జాతీయ పార్కు అరిజోనా లోనే ఉంది. ప్రపంచ ఏడు వింతల్లో ఇదొకటి. రాష్ట్రంలో ఇంకా అనేక జాతీయ పార్కులు, జాతీయ పర్వతాలూ ఉన్నాయి.

రాష్ట్రం లోని న్లుగీ వంతు భూభాగంలో[1] స్థానిక రెడ్ ఇండియనుల కోసం కేటాయించారు. 1924 లో దేశవ్యాప్తంగా వీరికి వోటు హక్కు ఇచ్చినప్పటికీ, అరిజోనాలో మాత్రం 1948 లో ఆ రాష్ట్ర సుప్రీంకోర్టు జోక్యంతో వచ్చింది.[2][3]

జనాభా వివరాలు

మార్చు

2019 జూలై 1 నాటికి అరిజోనా జనాభా 72,78,717. 2010 నాటి జనాభా 63,92,017 నుండి 13.87% పెరిగింది. రాజధాని ఫీనిక్స్ జనాభా 2018 నాటికి 49 లక్షలు. రాష్ట్ర మొత్తం జనాభాలో మూడింట రెండు వంతులు రాజధాని లోనే ఉన్నారు.


మూలాలు

మార్చు
  1. All about Arizona Archived నవంబరు 20, 2017 at the Wayback Machine. sheppardsoftware.com. Retrieved September 21, 2010.
  2. Dr. Dean Chavers, "History of Indian voting rights and why it's important" Archived జూలై 7, 2016 at the Wayback Machine, Indian Country Today, October 29, 2012; accessed July 17, 2016. See Trujillo v. Garley (1948)
  3. Harrison v. Laveen, July 1948 Archived ఆగస్టు 17, 2016 at the Wayback Machine, Arizona Supreme Court
"https://te.wikipedia.org/w/index.php?title=ఆరిజోనా&oldid=3848409" నుండి వెలికితీశారు