ఆరె మరాఠి : బిసి-బి గ్రూప్‌ కులం. ఆరె మరాఠి, మరాఠ (బ్రాహ్మణులు కానివారు), సురభి నాటకాల వాళ్లు.

చరిత్ర మార్చు

 
ఆరె మరాఠి లకు చెందిన సురభి కమలాబాయి చిత్రం

సురభి కమలాబాయి, సురభి బాలసరస్వతి ఈ కులం వారే. శతాబ్దాల క్రిందట మహారాష్ట్ర నుంచి వీరి పూర్వీకులు ఆంధ్ర ప్రాంతానికి వలస వచ్చారు. వీరు సంచార జీవులు.

సామాజిక జీవనం సంస్కృతి మార్చు

ఎక్కడైనా నాటక ప్రదర్శన ఉంటే పటాలం మొత్తం తరలిపోతారు. రాత్రి పూట ముఖానికి రంగుపూసుకుని వేషం కడతారు. సురభి టైమ్‌ను కచ్చితంగా పాటిస్తుంది అనే గుర్తింపు ఉంది. ప్రేక్షకుల అభిరుచి మేరకు కాలానుగుణంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు ఆకళింపు చేసుకుంటూ ఎప్పటికప్పుడు నవ్యతను రంగరించి, సునిశిత హాస్యాన్ని మేళవించి ప్రదర్శించటంలో వీరు దిట్టలు. కనుకనే నేటికీ సురభి కళాకారుల ప్రదర్శన అంటే ప్రాధాన్యతను సంతరించుకొంటోంది. ముదివగ్గుల నుంచి అడ్డాలలో బిడ్డల వరకు ఏదో ఒక పాత్ర పోషిం చాల్సిందే. దశాబ్దాల కిందట బండెనక బండికట్టి పటాలం మొత్తం ఒక గ్రామానికి వెళితే కొన్ని నెలలపాటు అక్కడే ఉండేవారట. ఆ తర్వాత మరో గ్రామం, ఇలా గ్రామాలు పట్టి తిరగటంతో తరతరాలుగా విద్యకు స్థిరనివాసానికి దూరమయ్యారు.

వృత్తి మార్చు

సినిమాలు, టీవీలు, కేబుల్‌ కనెక్షన్‌లు, సిడీలు రావటంతో నాటకాలకు ఆదరణ మరింత తగ్గింది. 35 ఏళ్ల క్రిందట పెద్ద సంఖ్యలో సమాజాలుగా ఉన్న సురభి నేడు ఐదు నాట్యమండలులుగా కుచించుకుపోయింది. స్టూ్స్, డ్రెస్‌ మెటీరియల్‌, మేకప్‌ మెటీరియల్‌ ధర విపరీతంగా పెరిగింది. భారీ సెట్టింగులు, ఇతర సామాగ్రిని తరలించాలంటే లారీ కిరాయి విపరీతంగా పెరిగింది. కనుకనే కళా కారులు బతుకు దెరువు కోసం దారులు వెతుక్కో వాల్సివచ్చింది. అయితే వారు ఎక్కడికి వెళ్లినా కళను మాత్రం విడి చిపెట్టలేదు. మేకప్‌మెన్‌గానో, ఆర్కె స్ట్రాలోనో, కాస్ట్యూమ్స్ సరఫరాలోనో ఉండి సేవలంది స్తున్నారు. ఇప్పటికీ టివీ, సినీ రంగంలో వీరి పాత్ర స్పష్టంగా నిపిస్తోంది. తోలుబొమ్మలాట తోలు బొమ్మలాట కళాకా రులు కూడా ఈ కులంలోని వారే. తోలుబొమ్మలాటకు కావలసిన చర్మం, రంగులు అన్నీ వీరే సమకూర్చుకుంటారు. తోలుబొమ్మలాట ద్వారా రామాయణం, మహాభారతంలోని ఏ అంశాన్ని ప్రదర్శించినా రోమా లు నిక్కబొడవాల్సిందే. అంత హృద్యంగా బొమ్మలు వేయటంతోపాటు, వాటినే ఆడించి రక్తి కట్టిస్తారు. ప్రదర్శనలో అవి దెబ్బతింటే క్షణాలలో వాటిని రిపేర్‌ చేయగల సత్తా కూడా వీరిలో ఉంది.

సమస్యలు మార్చు

గత ఏడాది వరకు వీరు అగ్రకులాలుగా పరిగణించ బడటంతో ఎటువంటి రిజర్వేషన్లు లేకపోయాయి. ఆరె మరాఠిలను ఎస్.టి.లలో చేర్చాలని, తమ కులానికి ప్రత్యేకంగా ఆడిటోరియం వసతి కల్పించి ఇచ్చి ప్రోత్సాహించాలని వీరు కోరుతున్నారు.

ఇవీ చూడండి మార్చు

మూలాలు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=ఆరె_మరాఠి&oldid=3266514" నుండి వెలికితీశారు