ఆర్కిటెక్చర్ మండలి

ఆర్కిటెక్చర్ మండలి, భారతీయ పార్లమెంటుచే ఆమోదంపబడిన ఆర్కిటెక్ట్స్ చట్టం, 1972 ద్వారా ఏర్పడినది. 1972 సెప్టెంబరు 1న అమలులోకి వచ్చింది. ఆ చట్టంలో ఆర్కిటెక్ట్స్ యొక్క నమోదు, విద్యా ప్రమాణాలు, గుర్తింపు అర్హతలు, నైపుణ్యానుభవాలు ఉంటాయి. భారత ప్రభుత్వము కొన్ని నియమాలను, ఆర్కిటెక్చర్ మండలి కొన్ని నిబంధనలను ఈ చట్టంలో పొందుపరిచారు.

డ్రాయింగ్ బోర్డు వద్ద ఆర్కిటెక్ట్. 1893లో నార్వేలోని ప్రముఖ ఇంజనీరింగ్ జర్నల్ ప్రచురించింది.

అవలోకనం మార్చు

ఎవరైనా తన వృత్తి 'ఆర్కిటెక్ట్' అని నమోదు చేసుకోవాలనుకుంటే, తాను ఆర్కిటెక్చర్ కౌన్సిల్ లో నమోదు చేసుకోవాలి. ఆర్కిటెక్టగా నమోదు కావాలంటే, అందుకు అవసరమైన అర్హతలు కలిగివున్న కళాశాలలో విద్యని అభ్యసించాలి. అందుకు అనుగుణంగా ఆర్కిటెక్చర్ మండలి (కనీస ప్రమాణాలు ఆర్కిటెక్చర్ విద్యా నిబంధనలు, 1983) లో పొందుపరిచారు. ఒక వ్యక్తి ఆర్కిటెక్చర్ వృత్తిలో కొనసాగాలనుకుంటే అతను కలిగివున్న నమోదు సర్టిఫికెట్ ను  పునరుద్ధరించుకుంటూ ఉండాలి. ఏ వ్యక్తి  అయినా తప్పుగా నమోదు చేయడం లేదా అక్రమ మార్గంలో నమోదు సర్టిఫికెట్ ను వాడేందుకు పాల్పడితే క్రిమినల్ నేరం, ఇందుకు దండన విభాగం 36 లేదా 37 (2), ఆర్కిటెక్ట్స్ చట్టం, 1972 క్రింద శిక్షార్హులు.

విధులు మార్చు

భారతదేశంలో 458 ఆమోదం సంస్థలు ఉన్నాయి, [1] అవి (రాజ్యాంగ కళాశాలలు/విశ్వవిద్యాలయాలు, డీమ్డ్ విశ్వవిద్యాలయాలు, అనుబంధ కళాశాలలు/పాఠశాలలు, IITs, NITs, స్వతంత్ర సంస్థలు).

సూచనలు మార్చు

  1. COA Approved Institutions, 22 April 2017, https://www.coa.gov.in/show_img.php?fid=216

బాహ్య లింకులు మార్చు