ఆర్థర్ బిస్సెట్

దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్

ఆర్థర్ వింట్సెంట్ క్రాస్లీ బిస్సెట్ (1879, జనవరి 15 - 1995, మార్చి 8) దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్. పశ్చిమ ప్రావిన్స్ తరపున 1903 నుండి 1922 వరకు ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడాడు.[1]

ఆర్థర్ బిస్సెట్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
ఆర్థర్ వింట్సెంట్ క్రాస్లీ బిస్సెట్
పుట్టిన తేదీ(1879-01-15)1879 జనవరి 15
కెనిల్వర్త్, కేప్ టౌన్, కేప్ కాలనీ
మరణించిన తేదీ1955 మార్చి 8(1955-03-08) (వయసు 76)
వైన్‌బర్గ్, కేప్ టౌన్, దక్షిణాఫ్రికా
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి లెగ్-స్పిన్
బంధువులుముర్రే బిస్సెట్ (సోదరుడు)
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1902-03 to 1921-22Western Province
కెరీర్ గణాంకాలు
పోటీ First-class
మ్యాచ్‌లు 25
చేసిన పరుగులు 697
బ్యాటింగు సగటు 15.48
100లు/50లు 0/1
అత్యుత్తమ స్కోరు 94
వేసిన బంతులు 549
వికెట్లు 7
బౌలింగు సగటు 37.85
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు 2/33
క్యాచ్‌లు/స్టంపింగులు 13/–
మూలం: Cricinfo, 4 June 2020

జీవితం, కుటుంబం మార్చు

బిస్సెట్ 1879, జనవరి 15న కేప్ టౌన్‌లోని కెనిల్‌వర్త్‌లో జన్మించాడు. రోండెబోష్‌లోని డియోసెసన్ కళాశాలలో చదివాడు.[2] ఇతని సోదరులలో ఒకరైన బిల్ దక్షిణాఫ్రికా తరపున రగ్బీ యూనియన్ ఆడాడు. మరో సోదరుడు, ముర్రే, దక్షిణాఫ్రికా టెస్ట్ క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. 1928లో సదరన్ రోడేషియా గవర్నర్‌గా ఉన్నాడు.

ఆర్థర్ బిస్సెట్ 1935 మార్చిలో విన్‌బెర్గ్‌లో డోరతీ ఎడిత్ మాలెట్‌ను వివాహం చేసుకున్నాడు.[3] వీరికి ముగ్గురు కుమార్తెలు.[4]

క్రికెట్ రంగం మార్చు

ఆర్థర్ బిస్సెట్ 1901లో ఇంగ్లాండ్‌లో ప్రైవేట్‌గా నిర్వహించబడిన దక్షిణాఫ్రికా పర్యటనకు ఎంపికైన ఆటగాళ్ళలో ఒకరిగా ఉన్నాడు. ఇతని సోదరుడు ముర్రే కెప్టెన్‌గా ఉన్నాడు. [2] హాంప్‌షైర్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో ఆర్థర్ తన ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేసాడు, మొదటి ఇన్నింగ్స్‌లో 94 పరుగులు చేశాడు.[5] ఇది తన కెరీర్‌లో ఏకైక అర్థ సెంచరీ.[1] 19.28 సగటుతో 405 ఫస్ట్-క్లాస్ పరుగులు చేశాడు, అయితే డర్హామ్‌తో జరిగిన ఒక చిన్న మ్యాచ్‌లో 151 పరుగులు చేశాడు.[6]

1921-22 సీజన్ వరకు వెస్ట్రన్ ప్రావిన్స్ కోసం అప్పుడప్పుడు ఆడటం కొనసాగించాడు. తరువాత కెరీర్‌లో ఉపయోగకరమైన లెగ్-స్పిన్ బౌలర్ గా రాణించాడు.[7]

మూలాలు మార్చు

  1. 1.0 1.1 "Arthur Bisset". CricketArchive. Retrieved 4 June 2020.
  2. 2.0 2.1 W. A. Bettesworth, "Chats on the Cricket Field", Cricket, 1 August 1901, pp. 305–6.
  3. "Transcribed Marriage Entries for BISSET". 1820 Settlers. Retrieved 4 June 2020.
  4. "Bonita Bisset". My Heritage. Retrieved 4 June 2020.
  5. "Hampshire v South Africans 1901". Cricinfo. Retrieved 5 June 2020.
  6. "The South African Team", Cricket, 22 August 1901, p. 368.
  7. "First-class Bowling in Each Season by Arthur Bisset". CricketArchive. Retrieved 5 June 2020.

బాహ్య లింకులు మార్చు