ఆర్య క్షత్రియ
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
ఆర్యక్షత్రియులు మహారాష్ట్రకు చెందిన వారు. వీరు ద్విజులు. బ్రాహ్మణులకు మాదిరిగానే వీరికి ఉపనయనం (ఒడుగు) తప్పనిసరి. వీరి గురించి మహాభారతంలో, బ్రహ్మాండ పురాణంలోని వర్ణవైభవ కాండ అను భాగమున క్లుప్తంగా ఉంది. బ్రాహ్మణులలో లాగే వీరికి ఋషుల పేర్లు గోత్రాలుగా వస్తాయి. ఇందులో ముఖ్యమైన గోత్రం ఆత్రేయస గోత్రం. వీరిలో 4 రకాల తెగలు కలవు 1.జీనిగర్,2.చిత్తారి,3.నకాష్,4.చిత్రకార. కాని కుల ప్రసక్తి వచ్చినప్పుడు ఈ నాలుగు తెగ వారు ఆర్యక్షత్రియ అని మాత్రమే వస్తుంది. వీరికి ప్రధాన కుల దైవం " మాత నిమిషాంబ దేవి. ఉత్తర భారత దేశం నుండి వలస దారులుగా వివిధ రాష్ట్రాలకి వలస వెళ్లారు.అలాగే కొంతమంది కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్, కేరళ రాష్ట్రాలకి వలస వెళ్లారు. నకాశ్ కులస్థులు తెలంగాణ పరీవాహక ప్రాంతాల్లో జీవనం సాగించారు, చిత్తారి వారు రాయలసీమలో జీవిస్తున్నారు.జీనిగర్ వారు కోస్తా ప్రాంతం లోని జిల్లాలలో ఉన్నారు. ఆర్య క్షత్రియులు ఉండే జిల్లాలు :-
- కర్నూలు (నంద్యాల)
- నెల్లూరు
- కడప
- రాజమహేంద్రవరం
- ఒంగోలు
- ఖమ్మం
- హైదరాబాద్
- నల్గొండ
- విజయనగరం
- విజయవాడ
- గుంటూరు
- చిత్తూరు
- అనంతపురం
వీరిలో ఉండే జీనిగర్లు కొన్ని సంవత్సరాల కిందట మహారాష్ట్ర లోని " జయ నగర్ " అనే ప్రాంతం వారు క్రమేపి అది జీనిగర్లుగా పిల్వబడింది అలాగే జయ నగర వాసులైన వీళ్ళను జీనిగర్లుగా పిలవబడుతున్నారు.హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రములో ఉండే కొన్ని ఊర్లలో వీరు కట్టించిన " మాత నిమిషాంబ దేవి " ఆలయాలే వీరికి ఉదాహరణ.ప్రస్తుతం చేతి వృత్తులలో వీరు జీవనం సాగిస్తున్నారు.కొంతమంది వ్యవసాయం,వాణిజ్య వ్యాపార, దేవస్థాన కట్టడాలు, కొయ్యి వాహనాల తయారీలో వీరు ఉన్నారు. వీరి పేరు మీద ఆంధ్ర ప్రదేశ్ లలో కొన్ని వీధికి వీరి పేర్లు ఉన్నాయ్. ఉదాహరణకి :- నెల్లూరు లోని జీనిగల వీధి, కడప లోని నకాష్ వీధి గుంటూరులోని ఆర్య క్షత్రియ వీధి, జగ్గయ్య పేటలోని నకాషి బజార్ లు వీరి పేరు మీద వచ్చినవే.
ఆర్య క్షత్రియ గోత్రాలు
పురాణాల ప్రకారం క్షత్రియులకు 32 గోత్రాలను కేటాయించడం జరిగింది. 1.ఆత్రేయ (అత్రి) 2. కశ్యప 3. వశిష్ఠ 4. కౌండిన్య 5. విశ్వామిత్ర (కౌశిక) 6.ధనుంజయ 7. జమదగ్ని 8. శ్రీవత్స 9. సనందన (సనక సనందనాధులు) 10.భరద్వాజ 11. గౌతమ 12. భృగు 13. నారద ముని 14. అగస్త్య 15. హరిత (హరీష) 16.పరాశర 17. గార్గేయ 18.సాంఖ్యాయన 19. శాండిల్య 20. దుర్వాస 21. మైత్రేయ 22.మౌద్గల్య 23.చ్యవన (శ్రావణ) 24.అంగీరస 25.దత్తాత్రేయ 26.వైశంపాయన 27.కణ్వ ముని 28. వ్యాస ముని 29. రోమశ్య 30. కపిల 31. జైమిని (యమున) 32. పౌలస్త్య
వంటి గోత్రాలు ఆర్య క్షత్రియులకు ఉన్నాయి.