జీనిగర్లు అనబడే " ఆర్యక్షత్రియులు " నదీ పరీవాహక ప్రాంతానికి ఎలా వచ్చారు? అసలు ఈ జీనిగర్లు ఎవరు అనేది 1864వ సంవత్సరంలో అప్పటి బ్రిటిష్ వాళ్లలో ఒకడైన హెచ్.యస్.స్టువర్ట్ అనే జనరల్ ఈ ఆర్యక్షత్రియుల (జీనిగర్ల) గురించి వివరంగా రాసారు. రాజైన అల్లాఉద్దీన్ ఖిల్జీ దండయాత్రకు తాళలేక ఓటమిపాలై బానిస బ్రతుకు బ్రతకలేక దక్షిణభారతదేశానికి వలస వచ్చారు. అలా మొదటగా కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు, శ్రీరంగపట్నం, బెంగుళూరు నుంచి బళ్లారికి వచ్చారు. అందులో కొంతమంది ఉత్తర ఆంధ్రాలో వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తున్నారు. ఇంకొందరు దక్షిణ ఆంధ్రలోని చిత్తూరుకు వచ్చారు. అప్పుడు చంద్రగిరి సంస్థాన రాజైన " దామెర్ల చెన్నప్ప రాజు " వీరిని చేరదీసి సైన్యాధిపతిగా బాధ్యతలను అప్పగించారు. ఆ సమయంలో ఆచార్యులు (కంసాలి) వారి దగ్గర వడ్రంగి పని నేర్చుకుని అందులో ప్రావీణ్యం పొందారు.


తర్వాత రాజ్యాలు అంతమై బ్రిటిష్ పరిపాలన వచ్చింది. దామెర్ల చెన్నప్పరాజు 1780 ఆగస్టు 22లో బ్రిటీషు ఈస్ట్ ఇండియా కంపెనీకి చందిన ఫ్రాన్సిస్ డేకు చెన్నపట్నంలో కోటను కట్టుకోవడానికి అనుమతినిచ్చాడు. దానితో మళ్ళీ వలస పట్టి నెల్లూరుకు చేరుకున్నారు. అలా జైనగర్ వాసులైన వీళ్ళను కాల క్రమేపి జీనిగర్లు పిలుస్తున్నారు.

చిత్తారి, జీనిగర్, చిత్రకార, నక్కాష్ వంటి ఉపకులాలు ఈ ఆర్యక్షత్రియ కులం లోనివే.

ప్రస్తుతం వీరు దేవాలయ నిర్మాణం, చిత్రకళలో (ఆర్టిస్ట్స్) జీవనం సాగిస్తున్నారు. వీరు తయారు చేసిన కొన్ని ఆర్టిఫెక్చర్స్ కొయ్య బొమ్మలు కొన్ని మద్రాస్ న్యూజియంలో కనపడుతాయి.