రామస్వామి వెంకట్రామన్

భారత మాజీ రాష్ట్రపతి, రాజనీతివేత్త, స్వాతంత్ర్య సమరయోధుడు.
(ఆర్.వెంకట్రామన్ నుండి దారిమార్పు చెందింది)

ఆర్.వెంకట్రామన్ గా ప్రసిద్ధులైన రామస్వామి వెంకట్రామన్ (డిసెంబరు 4, 1910 - జనవరి 28, 2009) భారత మాజీ రాష్ట్రపతి, ప్రసిద్ధుడైన రాజనీతివేత్త, రచయిత, స్వాతంత్ర్య సమరయోధుడు.

రామస్వామి వెంకట్రామన్
రామస్వామి వెంకట్రామన్


పదవీ కాలం
జూలై 25, 1987 – జూలై 25 1992
ఉపరాష్ట్రపతి శంకర దయాళ్ శర్మ
ముందు జైల్ సింగ్
తరువాత శంకర దయాళ్ శర్మ

వ్యక్తిగత వివరాలు

జననం (1910-12-04) 1910 డిసెంబరు 4 (వయసు 114)
తంజావూరు, తమిళనాడు,
(భారతదేశం)
మరణం జనవరి 28, 2009
కొత్త ఢిల్లీ

వెంకట్రామన్ తంజావూరు జిల్లా లోని రాజామాదం అన్న గ్రామంలో డిసెంబరు 4, 1910 వ తేదీన జన్మించాడు. వెం కటరామన్ చెన్నైలోని లయోలా కళాశాల నుండి ఆర్థిక శాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీని, చెన్నైలోని లా కళాశాల నుండి న్యాయశాస్త్రంలో పట్టా పొందాడు. ఆ తర్వాత 1935లో మద్రాసు హైకోర్టులో, ఆ తర్వాత సుప్రీంకోర్టులో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు.[1]

1984 నుండి కేంద్ర ఆర్థిక, రక్షణ మంత్రిగా పనిచేసిన వెంకట్రామన్ 1984 నుండి 1987 వరకూ భారత ఉపరాష్ట్రపతిగా పనిచేసాడు. రాష్ట్రపతిగా వెంకట్రామన్ పదవీకాలం జూలై 25, 1987 నుండి జూలై 25, 1992 వరకూ. వెంకట్రామన్ రచనల్లో ప్రసిద్ధి చెందింది "మై ప్రెసిడెన్సియల్ ఇయర్స్".

రాజకీయ ప్రస్థానం

మార్చు

మద్రాసు విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రాన్ని అభ్యసించిన వెంకట్రామన్ 1935లో న్యాయవాద వృత్తిని ప్రారంభించాడు. వెంకట్రామన్ భారత స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు, 1942-44 కాలంలో జైలు శిక్ష అను అనుభవించారు. జైలు నుంచి విడుదల అనంతరం న్యాయవాద వృత్తిని కొనసాగించారు. 1950 లో భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో సహాయపడ్డారు. వెంకటరామన్ 1950 లో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా, స్వతంత్ర భారతదేశం తాత్కాలిక పార్లమెంటుకు ఎన్నికయ్యారు. తరువాత 1952 నుండి 1957 వరకు, 1977 నుండి లోక్‌సభ (భారత పార్లమెంటు దిగువ సభ) సభ్యుడిగా కొనసాగారు. 1957 నుండి 1967 వరకు మద్రాసు (ప్రస్తుతం తమిళనాడు) రాష్ట్రానికి పరిశ్రమలు, కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. వెంకటరామన్ కేంద్ర ప్రభుత్వంలో ఆర్థిక, పరిశ్రమల మంత్రిగా (1980-82), రక్షణ మంత్రిగా (1982-84) పనిచేశారు. 1984-87లో భారత ఉపరాష్ట్రపతిగా పనిచేసిన తర్వాత 1987 జూలైలో రాష్ట్రపతి పదవికి ఎన్నికయ్యారు.[2]

వెంకట్రామన్ భారత ఉపరాష్ట్రపతిగా, తరువాత భారత రాష్ట్రపతిగా, కేంద్ర మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా సేవలను అందించి, తన 98 ఏళ్ళ వయస్సులో అనారోగ్య కారణాలతో, జనవరి 27, 2009న మరణించారు[3].

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "Shri R Venkataraman FORMER PRESIDENT OF INDIA Term of Office: 25 July, 1987 to 25 July, 1992". https://www.presidentofindia.gov.in/. Archived from the original on 16 ఏప్రిల్ 2024. Retrieved 04 August 2024. {{cite web}}: Check date values in: |access-date= (help); External link in |website= (help); line feed character in |title= at position 20 (help)
  2. "Ramaswamy Venkataraman | Indian Politician, 8th President | Britannica". www.britannica.com (in ఇంగ్లీష్). Retrieved 2024-08-04.
  3. "Ramaswamy Venkataraman". https://www.oneindia.com/. Retrieved 04 August 2024. {{cite web}}: Check date values in: |access-date= (help); External link in |website= (help)

వెలుపలి లంకెలు

మార్చు