ఆలేరు మండలం
ఆలేరు మండలం, తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లా లోని మండలం.[1] ఆలేరు, ఈ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన జనగామ నుండి 15 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం నల్గొండ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం భువనగిరి రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది. ఈ మండలంలో 10 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. నిర్జన గ్రామాలు లేవు.
ఆలేరు మండలం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో యాదాద్రి జిల్లా, ఆలేరు మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 17°39′N 79°03′E / 17.65°N 79.05°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | యాదాద్రి జిల్లా |
మండల కేంద్రం | ఆలేరు |
గ్రామాలు | 14 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 47,365 |
- పురుషులు | 23,599 |
- స్త్రీలు | 23,766 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 64.52% |
- పురుషులు | 76.86% |
- స్త్రీలు | 52.22% |
పిన్‌కోడ్ | {{{pincode}}} |
గణాంక వివరాలు
మార్చు2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని జనాభా - మొత్తం 47,365 - పురుషులు 23,599 - స్త్రీలు 23,766. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 165 చ.కి.మీ. కాగా, జనాభా 41,654. జనాభాలో పురుషులు 20,729 కాగా, స్త్రీల సంఖ్య 20,925. మండలంలో 10,846 గృహాలున్నాయి.[3]
నల్గొండ జిల్లా నుండి మార్పు
మార్చులోగడ ఆలేరు మండలం,నల్గొండ జిల్లా,భువనగిరి రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా ఆలేరు మండలాన్ని (1+09) పది గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన యాదాద్రి భువనగిరి జిల్లా, భువనగిరి రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[4]
మండలంలోని గ్రామాలు
మార్చురెవెన్యూ గ్రామాలు
మార్చురెవెన్యూయేతర గ్రామాలు
మార్చుమూలాలు
మార్చు- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 247 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "యాదాద్రి భువనగిరి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2020-01-20.