భువనగిరి రెవెన్యూ డివిజను

తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఒక పరిపాలనా విభాగం.

భువనగిరి రెవెన్యూ డివిజను, తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఒక పరిపాలనా విభాగం. యాదాద్రి భువనగిరి జిల్లాలోవున్న రెండు రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి. ఈ డివిజన్ పరిపాలనలో 11 మండలాలు ఉన్నాయి. ఈ డివిజన్ ప్రధాన కార్యాలయం భువనగిరి పట్టణంలో ఉంది. 2016, అక్టోబరు 11న రాష్ట్రంలోని జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఆధారంగా రెవెన్యూ డివిజన్ సవరించబడింది.[1] ఈ రెవెన్యూ డివిజను భువనగిరి లోక్‌సభ నియోజకవర్గం, భువనగిరి శాసనసభ నియోజకవర్గాల పరిధిలో ఉంది.

భువనగిరి రెవెన్యూ డివిజను
దేశంభారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాయాదాద్రి భువనగిరి

జిల్లా వివరాలు మార్చు

జిల్లాలో మొత్తం 17 మండలాలు ఉండగా, అందులో 12 మండలాలు భువనగిరి రెవెన్యూ డివిజన్‌ పరిధిలో, 5 మండలాలు చౌటుప్పల్‌ రెవెన్యూ డివిజన్‌ పరిధిలో ఉన్నాయి. జిల్లా జనాభా 7,70,833 కాగా భౌగోళికంగా 3,795 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 17 మండలాలు, 321 రెవెన్యూ గ్రామాలు, 421 గ్రామపంచాయతీలు, ఆరు మున్సిపాలిటీలు ఉన్నాయి.[2]

పరిపాలన మార్చు

భువనగిరి డివిజను లోని మండలాలు:

క్ర.సం భువనగిరి రెవెన్యూ డివిజను మండలంలోని రెవెన్యూ గ్రామాల సంఖ్య
1 భువనగిరి మండలం 30 రెవెన్యూ గ్రామాలు
2 ఆలేరు మండలం 10 రెవెన్యూ గ్రామాలు
3 ఆత్మకూర్ (ఎం) మండలం 17 రెవెన్యూ గ్రామాలు (ఒకటి నిర్జన గ్రామం)
4 అడ్డగూడూరు మండలం 11 రెవెన్యూ గ్రామాలు
5 బీబీనగర్ మండలం 25 రెవెన్యూ గ్రామాలు
6 బొమ్మలరామారం మండలం 23 రెవెన్యూ గ్రామాలు
7 గుండాల మండలం 17 రెవెన్యూ గ్రామాలు
8 మోటకొండూరు మండలం 11 రెవెన్యూ గ్రామాలు
9 మోత్కూర్ మండలం 12 రెవెన్యూ గ్రామాలు
10 రాజాపేట మండలం 19 రెవెన్యూ గ్రామాలు
11 తుర్కపల్లి మండలం 22 రెవెన్యూ గ్రామాలు
12 యాదగిరిగుట్ట మండలం 15 రెవెన్యూ గ్రామాలు

ఇవికూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. "District Census Handbook - Krishna" (PDF). Census of India. pp. 14–17. Retrieved 27 January 2022.
  2. "కొత్త రెవెన్యూ డివిజన్‌గా ఆలేరు!". andhrajyothy. Archived from the original on 2022-01-28. Retrieved 2022-01-28.