ద్విముఖ విద్యుత్ ప్రవాహం

(ఆల్టర్నేటింగ్ కరెంట్ నుండి దారిమార్పు చెందింది)

ద్విముఖ విద్యుత్ ప్రవాహం లేదా ఏకాంతర విద్యుత్ ప్రవాహం అనగా ఊయల ఊగినట్లుగా చాలా వేగంగా ముందుకి వెనుకకి ఊగిసలాడుతూ ప్రవహించే విద్యుత్ ప్రవాహం. ద్విముఖ విద్యుత్ప్రవాహమును ఆంగ్లంలో ఆల్టర్నేటింగ్ కరెంట్ లేదా సింపుల్‌గా ఏసీ అని అంటారు. విద్యుత్‌ను అనేక పద్ధతులలో ఉత్పత్తి చేసినా రెండు రకాలుగానే వాడుకునే అవకాశముంటుంది. వాటిలో ఒక రకం ద్విముఖ విద్యుత్ ప్రవాహం కాగా మరొకటి ఏకముఖ విద్యుత్ ప్రవాహం. ఏకముఖ విద్యుత్ ప్రవాహమును ఆంగ్లంలో డైరెక్ట్ కరెంట్ లేదా సింపుల్‌గా డీసీ అని అంటారు. ఏకముఖ విద్యుత్ ప్రవాహం ద్విముఖ విద్యుత్ ప్రవాహమునకు భిన్నమైనది, ఏలననగా ఏకముఖ విద్యుత్ ప్రవాహములో విద్యుత్ ఒకే దిశ వైపు ప్రవహిస్తుంటుంది. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువగా ఉపయోగించే కరెంటు ద్విముఖ విద్యుత్ అనగా ఏసీ కరెంటు. ప్రపంచ వ్యాప్తంగా తయారు చేయబడిన అధిక ఎలక్ట్రిక్ పరికరాలు ఏసీ కరెంటును దృష్టిలో ఉంచుకొని తయారు చేయబడినవే. బల్బులు, ఫ్యాన్లు, ఎయిర్ కండీషనర్లు, వాషింగ్ మెషీన్లు, టీవీలు, ప్రింటర్లు, ప్రిజ్‌లు, మోటార్లు ఇలా దాదాపు అన్ని ఎలక్ట్రిక్ పరికరాలు ఏసీ కరెంటును దృష్టిలో ఉంచుకొని తయారు చేయబడినవే. సాధారణంగా ఇళ్ళలో ఉండే కరెంటు ఏసీ కరెంటు, ఈ ఏసీ కరెంటు నందు 230 వోల్టుల విద్యుత్ ప్రవహిస్తూ ఉంటుంది. 230 వోల్టుల ఏసీ కరెంటును మానవ శరీరం తట్టుకోలేదు, అందువలన మానవ శరీరానికి ఏసీ కరెంటు తగిలి శరీరం గుండా విద్యుత్ ప్రవహించినట్లయితే షాక్ కొడుతుంది.

ద్విముఖ విద్యుత్ ప్రవాహం (ఆకుపచ్చ వంపు). సమాంతర అక్షం సమయాన్ని లెక్కిస్తుంది; నిలువుగీత విద్యుత్ ప్రవాహము లేక వోల్టేజ్‌ను సూచిస్తుంది.

ఇవి కూడా చూడండి

మార్చు