ఆల్ఫా- ఎలియొ స్టియరిక్ ఆమ్లం

(ఆల్ఫా- ఈలయ స్టియరిక్ ఆమ్లం నుండి దారిమార్పు చెందింది)

ఎలియొ స్టియరిక్ ఆమ్లం (Eleostearic acid)ఒక బహుద్విబంధాలున్న ఒక అసంతృప్త కొవ్వు ఆమ్లం[2].ఎలియొ స్టియరిక్ ఆమ్లం మూడు ద్విబందాలను కలిగివున్నది.దీనిని అక్టాడెకా 9,11,13 ట్రైయోనిక్ ఆమ్లం అనికూడా అంటారు.

అల్ఫా-ఎలియొ స్టియరిక్ ఆమ్లం
అల్ఫా-ఎలియొ స్టియరిక్ ఆమ్లం
పేర్లు
IUPAC నామము
(9Z,11E,13E)-Octadeca-9,11,13-trienoic acid
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [506-23-0]
సి.హెచ్.ఇ.బి.ఐ CHEBI:10275
SMILES O=C(O)CCCCCCC/C=C\C=C\C=C\CCCC
  • InChI=1/C18H30O2/c1-2-3-4-5-6-7-8-9-10-11-12-13-14-15-16-17-18(19)20/h5-10H,2-4,11-17H2,1H3,(H,19,20)/b6-5+,8-7+,10-9-

ధర్మములు
C18H30O2
మోలార్ ద్రవ్యరాశి 278.43 g/mol
ద్రవీభవన స్థానం 48 °C[1]
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
☒N verify (what is checkY☒N ?)
Infobox references
bitter gourd

అమ్ల సౌష్టవం-భౌతిక గుణగణాలు

మార్చు

ఎలియొ స్టియరిక్ ఆమ్లం ఒక మోనో కార్బోక్సిలిక్ కొవ్వు ఆమ్లం. అనగా ఆమ్లం యొక్క హైడ్రోకార్బన్ శృంఖలంలో ఒకే కార్బోక్సిల్ (COOH)సమూహాన్ని మాత్రమే కలిగివుండును.ఇది 18 కార్బనులను కలిగి మూడు ద్విబందాలను కలిగి ఉంది. ఇది 18 కార్బనులుండి,3 ద్విబంధాలున్నలినోలినిక్ ఆమ్లంకు సమంగతం (ఐసోమరు). లినోలినిక్ ఆమ్లంలో మూడు ద్విబంధాలు సిస్ అమరికలో వరుసగా 9,12,15 కార్బనులవద్ద (కార్బోక్సిల్ సమూహం వైపు నుండి లెక్కించగా) ద్విబంధాలను కలిగి వుండగా ఎలియొ స్టియరిక్ ఆమ్లం ఒక సిస్,రెండు ట్రాన్సు అమరికతో వరుసగా 9,11,13 కార్బనులవద్ద ద్విబంధాలను కలిగివున్నది. అందుచే దీనిని α-ఎలియో స్టియరిక్ ఆమ్లమని అంటారు. ఎలియొ స్టియరిక్ ఆమ్లం అన్నది సాధారణ వ్యవహారిక పేరు.వరుసగా సిస్, ట్రాన్స్,ట్రాన్స్-9,11,13 ద్విబంధాలున్న ఈలయ స్టియరిక్ ఆమ్లాన్ని α-ఎలియో స్టియరిక్ ఆమ్లమని అంటారు. ఎలియొ స్టియరిక్ ఆమ్లం యొక్క శాస్త్రీయ పేరు సిసి, ట్రాన్స్,ట్రాన్స్-9,11,13 ఆక్టాడెక ట్రైనోయిక్ ఆమ్లము (9, 11, 13-octadeca trienoic acid). ఇది స్పటిక రూపంలో వుంటుంది. ఈ ఆమ్లం యొక్క అణుసంకేతం C18H30O2.

ఎలియొ స్టియరిక్ ఆమ్లం యొక్క ద్విబంధ స్థానం చూపించు అణు సంకేత సూచిక : CH3- (CH2)3HC=CH-HC=CH-HC=CH (CH2)7COOH

ఎలియొ స్టియరిక్ ఆమ్లంలోని ద్విబంధాలను సంధిగ్ధ ద్విబందాలంటారు (conjugated bond).

అసంధిగ్ధబంధం (nonconjugated)అనగా రెండుద్విబంధాల మధ్య కనీసం 3 కార్బనుల ఎడంవుండును.

అలాకాకుండా రెండు కార్బనులు మాత్రమే ఎడం వున్నప్పుడు ఆబంధాలను సంధిగ్ధబంధాలు (conjugated) అంటారు.

అసంధిగ్ధ బంధంనమూనా:C-C=C-C-C=C-C

సంధిగ్ధ బంధం నమూనా:C-C=C-C=C-C

ఆమ్లం భౌతిక,రసాయనిక ధర్మాల పట్టిక [3]

లక్షణం విలువల మితి
అణుసంకేతం C18H30O2
శాస్త్రీయ పేరు cis-9, trans-11, trans-13-octadecatrienoic acid
అణు భారం 278.42
వక్రీభవన సూచిక 1.491
బాష్పీభవన ఉష్ణోగ్రత 390.6±11.0 °C at 760mm ( వాతావరణ పీడనం వద్ద)
అణుఘనపరిమాణం 301.1±3.0 cm3
ఫ్లాష్‌పాయింట్ 287.4±14.4 °C
తలతన్యత 34.9±3.0 dyne/cm
ధ్రువ ఉపరితల వైశాల్యం 37.3 Å2
సాంద్రత 0.9±0.1 g/cm3
బాష్పీభవన గుప్తోష్ణం 70.3±6.0 kJ/mol
అవిరి (vapor)వత్తిడి 0.0±1.9 mmHg at 25 °C

లభ్యత :ఆల్ఫాఎలియొ స్టియరిక్ ఆమ్లం టుంగ్/టంగ్ (Tung)నూనెలో 70 % శాతం వరకు,చేదు పుచ్చ/చేదు దోస (bitter gourd)గింజల నూనెలో 60% వరకు గ్లిజరాయిడు రూపంలో లభిస్తుంది.

ఉపయోగాలు

మార్చు
  • ఆల్ఫాఎలియొ స్టీయరిక్ ఆమ్లం ఆక్సీకరణ నిరోధకత (antioxidant)గుణాన్ని కలిగి,, కణగడ్డల (tumor)పెరుగుదలను చర్యాహీనత కావిస్తుంది[4]

ఇవికూడా చూడండి

మార్చు

బయటి లింకులు

మార్చు

మూలాలు/ఆధారాలు

మార్చు
  1. Burr, G.O.; Burr, M.M.; Miller, E. (1932). "On the nature and role of the fatty acids essential in nutrition" (PDF). J. Biol. Chem. 97 (1): 1–9. Archived from the original (PDF) on 2007-02-21. Retrieved 2007-01-17.
  2. "eleostearic acid". thefreedictionary.com. Retrieved 2013-11-30.
  3. "α-Eleostearic acid". chemspider.com. Archived from the original on 2012-10-22. Retrieved 2013-11-30.
  4. "Tumor growth suppression by α-eleostearic acid, a linolenic acid isomer with a conjugated triene system, via lipid peroxidation". carcin.oxfordjournals.org/. Archived from the original on 2016-12-09. Retrieved 2013-11-30.