ఆల్బర్ట్ ఎక్కా

పరమ వీర చక్ర గ్రహీత

లాన్స్ నాయక్ ఆల్బర్ట్ ఎక్కా, PVC ( 1942 డిసెంబరు 27 – 1971 డిసెంబరు 3) భారత సైనిక దళంలో సైనికుడు. ఆయన "హిల్లీ యుద్ధం"లో వీరమరణం పొందాడు. ఈ యుద్ధం 1971 లో భారత, పాకిస్థాన్ మధ్య జరిగింది. ఆయన దేశానికి చేసిన సేవలకు గానూ భారత అత్యున్నత పురస్కారమైన పరమ వీర చక్ర పురస్కారాన్ని మరణానంతరం భారత ప్రభుత్వం అందజేసింది.[1]

లాన్స్ నాయక్
ఆల్బర్ట్ ఎక్కా
PVC
ఆల్బర్ట్ ఎక్కా స్టాంపు
జననం(1942-12-27)1942 డిసెంబరు 27
జరీ, గుమ్లా జిల్లా, బీహార్ (ప్రస్తుతం జార్ఖండ్ ), భారతదేశం.
మరణం1971 డిసెంబరు 3(1971-12-03) (వయసు 28)
గంగాసాగర్, బంగ్లాదేశ్
రాజభక్తి రిపబ్లిక్ ఆఫ్ ఇండియా
సేవలు/శాఖ Indian Army
సేవా కాలం1962-1971
ర్యాంకు లాన్స్ నాయక్
పోరాటాలు / యుద్ధాలుహిల్లి యుద్ధం
1971 ఇండో-పాకిస్తాన్ యుద్ధం
పురస్కారాలు పరమ వీర చక్ర
జీవిత భాగస్వామి (లు)బలాందినే ఎక్కా

పురస్కారాలు , గౌరవాలు

మార్చు

లాన్స్ నాయక్ ఆల్బర్ట్ ఎక్కా 2000 సంవత్సరంలో భారతదేశ అత్యున్నత పురస్కారమైన పరమ వీర చక్రను మరణానంతరం పొందారు. ఈ పూరస్కారాన్ని భారతదేశ 50వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అందజేసారు. ఆయన జ్ఞాపకార్థం భారత ప్రభుత్వం ఒక పోస్టల్ స్టాంపును విడుదల చేసింది.

జార్ఖండ్ ముద్దుబిడ్డ అయిన ఎక్కా జ్ఞాపకార్థం ముఖ్య ప్రదేశం అయిన ఫిరాయాలాల్ స్టోర్ కు ఆయన పేరుతో " ఆల్బర్ట్ ఎక్కా చౌక్"గా నామకరణం చేసారు. అక్కడ ఆయన విగ్రహాన్నుంచారు. 'గుల్మా" లోని ఒక బ్లాక్ (జిల్లా సబ్ డివిజన్) కు కూడా ఆయన పేరు పెట్టారు.

ఇతర లింకులు

మార్చు

మూలాలు

మార్చు
  1. "Param Vir Chakra(PVC) Lance Naik (LCpl) Albert Ekka". Jai Hind Jai Bharat. Archived from the original on 2012-03-20. Retrieved 2013-05-05.

ఇతర లింకులు

మార్చు