పరమ వీర చక్ర
పరమ వీర చక్ర భారతదేశంలో త్రివిధ దళాలలో పనిచేసే సైనికులకు ఇచ్చే అత్యున్నత పురస్కారం. ఈ పురస్కారం యుధ్ద సమయంలో అత్యున్నత ధైర్యసాహసాలు ప్రదర్శించినందుకు అందచేస్తారు. ఈ పేరుకు అర్థం "అత్యున్నత ధైర్య చక్రం",[1] ఈ పురస్కారం అమెరికాకు చెందిన "మెడల్ అఫ్ ఆనర్", బ్రిటన్ కు చెందిన "విక్టోరియా క్రాస్"కు సమానం.[2][3]
పరమ వీర చక్ర | ||
పురస్కారం గురించి | ||
---|---|---|
ఎలాంటి పురస్కారం | యుద్ధ సమయంలో సాహసాలకు | |
వ్యవస్థాపిత | 1950 | |
మొదటి బహూకరణ | 1947 | |
క్రితం బహూకరణ | 1999 | |
మొత్తం బహూకరణలు | 21 | |
బహూకరించేవారు | భారతీయ ప్రభుత్వం | |
రిబ్బను | ||
మొదటి గ్రహీత(లు) | మేజర్ సోమనాథ్ శర్మ (మరణానంతరం) | |
క్రితం గ్రహీత(లు) | కెప్టెన్ విక్రమ్ బాత్రా (మరణానంతరం) | |
Award Rank | ||
భారత్ రత్న ← పరమ వీర చక్ర → మహా వీర చక్ర |
శాంతి సమయాలలో ఇచ్చే అశోక చక్ర అనే మరో పురస్కారం పరమ వీర చక్రకు సమానం. పరమ వీర చక్ర కేవలం త్రివిధ దళాలలో పనిచేసే వారికి మాత్రమే ఇవ్వబడుతుంది. కానీ అశోక చక్ర మాత్రం ఏ భారతీయనికైనా ప్రదానం చెయ్యవచ్చు. పరమ వీర చక్రకు మాదిరి గానే అశోక్ చక్ర కూడా చనిపోయిన తరువాత కూడా పురస్కరించ వచ్చు.[4] పురస్కార గ్రహీతలకు కేంద్ర, రాష్త్ర ప్రభుత్వాల నుండి అనేక భత్యాలు అందచేయబడతాయి. కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు కూడా ఇలాంటి భత్యాలు అందిస్తున్నాయి.
చరిత్ర
మార్చుపరమ వీర చక్ర 1950 జనవరి 26 (గణతంత్ర దినోత్సవం) న స్థాపించారు. కానీ ఈ పురస్కారం 1947 ఆగస్టు 15 (స్వాతంత్ర్య దినోత్సవం) నుండి అమలులో ఉన్నట్లు పరిగణిస్తూ చట్టం చేసారు.[1][5] ఈ పురస్కారం త్రివిధ దళాలకు సంబంధించిన ఏ సైనికుడికైనా, సైన్యాధికారికైనా అందించవచ్చు.[6] ఈ పురస్కారాన్ని ఒకే వ్యక్తికి ఒక్కసారి కంటే ఎక్కువ సార్లు అందించే వెసులుబాటు ఉంది. ఒక సైనికుడికి రెండోసారి ఈ పురస్కారం అందచేయబడితే పరమ వీర చక్ర రిబ్బన్ కు ఒక గీత జత చేయబడుతుంది. ఒక వజ్రపు ఖడ్గం నమూనా కూడా అందచేయబడుతుంది.[1] ఇప్పటి దాకా ఏ సైనికుడికి రెండు సార్లు ఈ పురస్కారం అందించలేదు. గ్రహీతలు తమ పేరు తరువాత "PVC" అని ఆంగ్లంలో జత చేసుకోవచ్చు.[5]
రూపకల్పన
మార్చుసిక్కు రెజిమెంట్ కు చెందిన సైన్యాదికారి విక్రమ్ ఖణోల్కర్ భార్య, సావిత్రి ఖణోల్కర్ ఈ పురస్కారాన్ని రూపొందించారు.[7] సావిత్రి గారు ఈ పురస్కారాన్ని అప్పటి భారతీయ సైన్య అడఁజూటంట్ జనరల్, మేజర్ జనరల్ హిర లాల్ అటల్ కోరిక మీద రూపొందించారు. స్వాతంత్ర్యం తరువాత, మేజర్ జనరల్ అటల్, బ్రిటన్ కు చెందిన "విక్టోరియా క్రాస్"కు సమానమైన పురస్కారాన్ని రూపొందించే బాధ్యతను వహించారు. యాదృచ్ఛికంగా సావిత్రి గారి అల్లుడైన లెఫ్టినెంట్ జనరల్ సురీందర్ నాథ్ శర్మ అన్నయ్య, మేజర్ సోమనాథ్ శర్మకు ఈ పురస్కారం మొదటి సారి ప్రదానం చేసారు. మేజర్ సోమనాథ్ శర్మ 1947 పాకిస్తాన్ తో యుద్ధంలో ప్రదర్శించిన ధైర్యసాహసాలకు ఈ పురస్కారం అందచేయబడింది.
ఈ పురస్కార పతకం వృత్తాకార కాంస్య రూపంలో ఉంటుంది. వృత్తాకార వ్యాసం 1.375 అంగుళాలు. ముందువైపున భారతదేశ చిహ్నం, దాని చుట్టూ నాలుగు వజ్ర నమూనాలు ఏర్పాటు చేయబడ్డాయి. వజ్ర నమూనాలకు మూలాంశం దధీచి ఋషి త్యాగానికి చిహ్నం, దధీచి తన శరీర ఎముకలను వజ్రాయుధం రూపొందించడానికి త్యాగం చేసారు. ఈ పతకాన్ని ఒక తిన్నని లోహపు ముక్క మీద వేలాడతీయబడుతుంది. వెనుకవైపున, పరమ వీర చక్ర అని హిందీలో (परमवीर चक्र), ఆంగ్లంలో (Param Vir Chakra) అని రెండు కమలాల మధ్య లిఖితమై ఉంటుంది.[3][8] ఊదా రంగు రిబ్బను ఈ పురస్కారానికి చిహ్నం.[3]
పురస్కార గ్రహీతలు
మార్చుఈ పతకం ఇప్పటి దాక 21 సార్లు ప్రదానం చేసారు. వీటిల్లో 14 పతకాలు మరణానంతరం ఇచ్చారు. 16 పతకాలు భారత్-పాకిస్తాన్ యుద్ధాలలో పాల్గొన్న సైనికుల ధైర్యసాహసాలకు గుర్తింపుగా ఇచ్చారు. 21 గ్రహీతలలో, 20 మంది సైన్యానికి చెందిన వారు కాగా ఒకరు వాయు సేన చెందిన వారు. సైన్యానికి చెందిన గ్రెనేడియర్ యూనిట్లకు ఈ పతకాన్ని ఎక్కువ సార్లు ఇచ్చారు. గోర్ఖా రైఫిల్ రెజిమెంట్లకు మూడు సార్లు ఈ పతకం ఇచ్చారు.[9]
ఫ్లైయింగ్ ఆఫీసర్ నిర్మల్ జిత్ సింగ్ మాత్రమే ఇప్పటి దాక వాయు సేనలో ఈ పతకం పొందారు. 1971 భారత్-పాకిస్తాన్ యుద్ధంలో ఆయన ప్ర్దర్శించిన ధైర్యసాహసాలకు దీన్ని ప్రదానం చేసారు.[1][9][10] నాయిబ్ సుబేదార్ సంజయ్ కుమార్, సుబేదార్ యోగేంద్ర సింగ్ యాదవ్ అనే ఇద్దరు పరమ వీర చక్ర గ్రహీతలు మాత్రమే ఇంకా సైన్యంలో సేవలందిస్తున్నారు.[11]
This along with the *, indicates that the Param Vir Chakra was awarded posthumously.
పేరు | యూనిట్ | తేదీ | యుద్ధం | మూలాలు |
---|---|---|---|---|
సోమనాథ్ శర్మ | కుమయాన్ | 3 నవంబరు 1947* | బాడ్గాం యుద్ధం | [12][13][14] |
జాడు నాథ్ సింగ్ | 1 రాజపుత్ | 6 ఫిబ్రవరి 1948* | భారత్ పాకిస్తాన్ యుద్ధం 1947 | [13][14][15] |
రామా రఘోబా రాణే | బాంబే సప్పర్స్ | 8 ఏప్రిల్ 1948 | భారత్ పాకిస్తాన్ యుద్ధం 1947 | [13][14][16] |
పీరూ సింగ్ షకావత్ | రాజపుటానా రైఫిల్స్ | 17 జూలై 1948* | భారత్ పాకిస్తాన్ యుద్ధం 1947 | [13][14][17] |
కరం సింగ్ | సిఖ్ | 13 అక్టోబరు 1948 | భారత్ పాకిస్తాన్ యుద్ధం 1947 | [13][14][18] |
గుర్బచన్ సింగ్ సలారియా | 3/1 గోర్కా రైఫిల్స్[a] | 5 డిసెంబరు 1961* | కాంగో సంక్షోభం | [13][14][19] |
ధన్ సింగ్ థాపా | 1/8 రోర్కా రైఫిల్స్ | 20 అక్టోబరు 1962 | భారత్ చైనా యుద్ధం 1962 | [13][14][20] |
జోగీందర్ సింగ్ సహ్నాన్ | 1 సిఖ్ | 23 అక్టోబరు 1962* | భారత్ చైనా యుద్ధం 1962 | [13][14][21] |
శైతాన్ సింగ్ | 3 కుమాయన్ | 18 నవంబరు 1962* | భారత్ చైనా యుద్ధం 1962 | [13][14][22] |
అబ్దుల్ హమీద్ | గ్రెనేడర్స్ | 10 సెప్టెంబరు 1965* | అసల్ ఉత్తర్ యుద్ధం | [13][14][23] |
ఆర్దెశిర్ బుజోర్జీ టరపోరే | 7 పూనా హార్స్ | 11 సెప్టెంబరు1965* | చావిందా యుద్ధం | [13][14][24] |
ఆల్బర్ట్ ఎక్కా | 4 గార్డ్స్ | 3 డిసెంబరు 1971* | హిల్లీ యుద్ధం | [13][14][25] |
నిర్మల్ జీత్ సింగ్ సెఖాన్ | నెం.18 స్క్వాడ్రాన్ | 14 డిసెంబరు 1971* | భారత పాక్ యుద్ధం 1971 | [13][14][26] |
అరుణ్ ఖేతర్‌పాల్ | 7 పూనా హార్స్ | 16 డిసెంబరు 1971* | బసంతర్ యుద్ధం | [13][14][27] |
హోశియార్ సింగ్ | 3 గ్రెనేడర్స్ | 17 డిసెంబరు 1971 | బసంతర్ యుద్ధం | [13][14][28] |
బాణా సింగ్ | జక్ లీ | 23 మే 1987 | ఆపరేషన్ రాజీవ్ | [13][14][29] |
రామస్వామి పరమేశ్వరన్ | 8 మహర్r[b] | 25 నవంబరు 1987* | ఆపరేషన్ పవన్ | [13][14][30] |
మనోజ్ కుమార్ పాండే | 1/11 గోర్కా రైఫిల్స్ | 3 జూలై 1999* | ఆపరేషన్ రాజీవ్ | [13][14] |
యోగీందర్ సింగ్ యాదవ్ | 8 గ్రెనేడర్స్ | 4 జూలై 1999 | టైగర్ హిల్ యుద్ధం | [13][14] |
సంజయ్ కుమార్ (సైనికుడు) | 13 JAK రైఫిల్స్ | 5 జూలై 1999 | కార్గిల్ యుద్ధము | [13][14] |
విక్రం బాత్రా | 13 JAK రైఫిల్స్ | 5 జూలై 1999* | ఆపరేషన్ విజయ్ | [13][14] |
పురస్కార గ్రహీతలకు భత్యాలు
మార్చుపురస్కార గ్రహీతలకు, లెఫ్టినెంట్ క్రింది స్థాయి సైనికులైతే, పురస్కారంతో పాటు నగదు భత్యం కూడా లభిస్తుంది. ఒకవేళ గ్రహీత చనిపోయి ఉంటే, ఆ భత్యం అతని భార్యకు, ఆమె చనిపోయేంత వరకూ లేదా మళ్ళీ పెళ్ళి అయ్యేంత వరకూ లభిస్తుంది. గ్రహీతకు భార్య లేకపోతే అతని తల్లితండ్రులకు ఆ భత్యం చెందుతుంది. గ్రహీతకు పెళ్ళి అయి ఉండి భార్య చనిపోయి ఉంటే ఆ భత్యం అతని కొడుకు లేదా పెళ్ళి కాని కూతురుకు లభిస్తుంది.[31] గ్రహీత బతికే ఉంటే నెలకు 10,000 రూపాయలు భత్యం లభిస్తుంది. ఈ పురస్కారం ద్వారా లభించే మొత్తాన్ని ఆదాయపు పన్ను నుండి మినహాయించారు. ఇదే కాకుండా, కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ మంత్రిత్వ శాఖలు కూడా భత్యాలు ఇస్తాయి. రైల్వే మంత్రిత్వ శాఖ గ్రహీత, గ్రహీతతో పాటు ఉండే ఒక్కరికి జీవిత కాలం ఉచితంగా మొదటి తరగతి రైలు ప్రయాణం చేసే వెసులుబాటు కలిగించింది. రవాణా మంత్రిత్వ శాఖ, గ్రహీతలకు టోల్ పన్నును తొలగించింది. ఇండియన్ ఎయిర్‌లైన్స్, గ్రహీతలకు టిక్కెట్లపై 75% రాయితీని అందిస్తుంది.[32]
రాష్త్ర ప్రభుత్వాలు అందించే భత్యాలు
మార్చుకేంద్ర ప్రభుత్వంతో పాటు అనేక రాష్త్ర ప్రభుత్వాలు కూడా భత్యాలు అందచేస్తున్నాయి.[33]
నగదు మొత్తం | అందజేసే రాష్ట్రాలు |
---|---|
3.1 మిలియన్లు | హర్యానా |
3 మిలియన్లు | పంజాబ్ |
2.5 మిలియన్లు | |
2 మిలియన్లు | |
1.5 మిలియన్లు | |
1 మిలియన్లు | |
22,500 |
రద్దు
మార్చుఅవసరమైతే రాష్ట్రపతి పురస్కరించబడిన పతకాన్ని రద్దు చేయవచ్చు. అలా జరిగినచో, అతని లేదా ఆమె పేరు నమోదు పత్రం నుండి తొలగింపబడును గ్రహీత ఆ పతకాన్ని తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. రాష్త్రపతి రద్దుని కూడా ఉపసంహరించుకోవచ్చు. ఈ మార్పు "ది గజెట్ అఫ్ ఇండియా"లో ప్రచురించబడుతుంది.[31]
జనరంజక సంస్కృతిలో
మార్చు1990 లో, పరమ వీర చక్ర గ్రహీతల జీవిత చరిత్రలు ఆధారంగా ఆంగ్లంలో టెలివిజన్ సిరీస్ రూపొందించబడ్డాయి.[34][35][36] వీటికి చేతన్ ఆనంద్ దర్శకత్వం వహించారు. 2003 లో, "LOC Kargil" అనే హిందీ సినిమా కార్గిల్ యుద్ధంలో పరమ వీర చక్ర గ్రహీతల ఆధారంగా రూపొందించబడింది.[37] తెలుగులో పరమవీర చక్ర పేరుతో సినిమా వచ్చింది.
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 1.3 "పరమ వీర చక్ర జాతీయ సమితి". India: National Portal of India. Archived from the original on 14 ఆగస్టు 2014. Retrieved 13 August 2014.
- ↑ NCERT 2016, p. 11.
- ↑ 3.0 3.1 3.2 ప్రియా అరోరా (27 December 2013). "పరమ వీర చక్ర గురించి ఏడు విషయాలు". Topyaps. Archived from the original on 20 సెప్టెంబరు 2016. Retrieved 4 September 2016.
- ↑ "అవార్డ్స్ హోమ్ శాఖ" (PDF). warb-mha. p. 1. Archived from the original (PDF) on 4 మార్చి 2016. Retrieved 5 September 2016.
- ↑ 5.0 5.1 "పరమ వీర చక్ర గురించి 11 విషయాల". Indiatimes. Retrieved 4 September 2016.
- ↑ "పరమ వీర చక్ర భారతీయ సేన". Indian Army. Retrieved 4 September 2016.
- ↑ Satyindra Singh (20 June 1999). "అత్యంత సాహసికులు గౌరవం". The Tribune, Chandigarh. Retrieved 13 August 2014.
- ↑ Sumit Walia (23 January 2009). "మొదటి పరమ వీర చక్ర". Sify.com. Archived from the original on 16 మే 2012. Retrieved 13 August 2014.
- ↑ 9.0 9.1 INDIATIMES NEWS NETWORK (25 January 2008). "Param Vir Chakra winners since 1950". Times of India. Retrieved 5 September 2016.
- ↑ "Indian Air Force :: Param Vir Chakra". Bharat Rakshak. Archived from the original on 16 ఫిబ్రవరి 2016. Retrieved 13 August 2014.
- ↑ "Other States / West Bengal News : Living with war memories that never fade". The Hindu. 8 August 2010. Archived from the original on 29 జూన్ 2013. Retrieved 10 జూలై 2013.
- ↑ Chakravorty 1995, pp. 75–76.
- ↑ 13.00 13.01 13.02 13.03 13.04 13.05 13.06 13.07 13.08 13.09 13.10 13.11 13.12 13.13 13.14 13.15 13.16 13.17 13.18 13.19 13.20 ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;Param Vir Chakra winners since 19502
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ 14.00 14.01 14.02 14.03 14.04 14.05 14.06 14.07 14.08 14.09 14.10 14.11 14.12 14.13 14.14 14.15 14.16 14.17 14.18 14.19 14.20 Rishabh Banerji (15 ఆగస్టు 2015). "21 Param Vir Chakra Winners Every Indian Should Know and Be Proud of". Indiatimes. Archived from the original on 17 సెప్టెంబరు 2016. Retrieved 4 సెప్టెంబరు 2016.
- ↑ Chakravorty 1995, pp. 56–57.
- ↑ Chakravorty 1995, pp. 67–68.
- ↑ Chakravorty 1995, pp. 65–66.
- ↑ Chakravorty 1995, pp. 60–61.
- ↑ Chakravorty 1995, pp. 69–70.
- ↑ Chakravorty 1995, pp. 79–80.
- ↑ Chakravorty 1995, pp. 58–59.
- ↑ Chakravorty 1995, pp. 73–74.
- ↑ Chakravorty 1995, pp. 49–50.
- ↑ Chakravorty 1995, pp. 77–78.
- ↑ Chakravorty 1995, pp. 52–53.
- ↑ Chakravorty 1995, pp. 71–72.
- ↑ Chakravorty 1995, pp. 62–63.
- ↑ Chakravorty 1995, pp. 54–55.
- ↑ Chakravorty 1995, p. 51.
- ↑ Chakravorty 1995, p. 64.
- ↑ 31.0 31.1 Chakravorty 1995, p. 48.
- ↑ "మెన్ ఇన్ యూనిఫామ్". Factly. 18 August 2015. Retrieved 4 September 2016.
- ↑ Madhu Jain (15 August 1990). "కాశ్మీర్ సీరియల్". India Today. Retrieved 13 August 2014.
- ↑ "గోల్డీ కమాండ్స్ గౌరవం". www.sunday-guardian.com. Archived from the original on 21 సెప్టెంబరు 2016. Retrieved 5 September 2016.
- ↑ "మేకర్ అఫ్ మీనింగ్ ఫుల్ మూవీస్". The Hindu (in Indian English). 15 June 2007. Retrieved 5 September 2016.
- ↑ "LOC కార్గిల్". www.thehindu.com. Archived from the original on 21 జనవరి 2015. Retrieved 5 September 2016.
పుస్తకాలు
మార్చు- Chakravorty, B.C. (1995), Stories of Heroism: PVC & MVC Winners (in English), New Delhi: Allied Publishers, ISBN 978-81-7023-516-3
{{citation}}
: CS1 maint: unrecognized language (link) - NCERT, Govt. of India (2016), Veer Gaatha (PDF), New Delhi: National Council of Educational Research and Training, ISBN 978-93-5007-765-8, archived from the original (PDF) on 2017-04-06, retrieved 2017-02-21
బయటి లింకులు
మార్చు- పరమవీరచక్ర.కామ్
- "పరమ వీర చక్ర గ్రహీతలు". టైమ్స్ అఫ్ ఇండియా.
- పరమ వీర చక్ర గ్రహీతలు Archived 2017-02-13 at the Wayback Machine
- "భారతదేశ పరమ వీర చక్ర గ్రహీతలు మీద పుస్తకం". India: ANI News. 22 July 2010. Archived from the original on 23 సెప్టెంబరు 2015. Retrieved 20 ఫిబ్రవరి 2017.
ఉల్లేఖన లోపం: "lower-alpha" అనే గ్రూపులో <ref>
ట్యాగులు ఉన్నాయి గానీ, దానికి సంబంధించిన <references group="lower-alpha"/>
ట్యాగు కనబడలేదు