స్వీడన్‌కు చెందిన ప్రముఖ దౌత్యవేత్త, రాజకీయవేత్త, రచయిత్రి అయిన ఆల్వా మిర్థాల్ జనవరి 31, 1902 రోజున స్వీడన్‌లోని ఉప్సలాలో జన్మించింది. స్టాక్‌హోమ్, ఉప్సలా విశ్వవిద్యాలయాలలో ఉన్నత విద్యను అభ్యసించి 1924లో గున్నార్ మిర్థాల్‌ను వివాహం చేసుకొంది. 1949-50 లో ఐక్యరాజ్య సమితి సాంఘిక కార్యకలాపాల కార్యాలయంలోను, 1951-52 లో యునెస్కో యొక్క సాంఘికశాస్త్రాల విభాగానికి డైరెక్టర్‌గా పనిచేసింది. ఆ తర్వాత స్వీడన్ ప్రభుత్వపు అనేక రాయబార, కేబినెట్ పదవులను నిర్వహించింది. 1962లో ఈమె స్వీడిష్ పార్లమెంటులో ప్రవేశించింది. అదే సంవత్సరంలో జెనీవాలో జరిగిన ఐక్యరాజ్యసమితి నిరాయుధీకరణ సదస్సుకు స్వీడన్ తరఫున సదస్యురాలిగా వెళ్ళింది. 1966-73 మధ్య నిరాయుధీకరణ మంత్రిగానూ పనిచేసిన ఈమె యొక్క ప్రముఖ రచనలు The Game of Disarmament, Crisis in the Population Question. నిరాయుధీకరణకు సంబంధించిన రచనలు చేసినందుకు ఆమెకు 1982 సంవత్సరపు నోబెల్ శాంతి బహుమతి ఆల్ఫాన్సో గార్సియా రోబుల్స్‌తో కలిసి సంయుక్తంగా లభించింది. ఈమె ఫిబ్రవరి 1, 1986 రోజున మరణించింది.

ఆల్వా మిర్థాల్

బయటి లింకులు

మార్చు