1902
1902 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1899 1900 1901 - 1902 - 1903 1904 1905 |
దశాబ్దాలు: | 1880లు 1890లు - 1900లు - 1910లు 1920లు |
శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
సంఘటనలు
మార్చు- కార్ల్ లాండస్టీనర్ మానవులలో మొదటిసారిగా ABO రక్తవర్గాలను గమనించాడు.
జననాలు
మార్చు- జనవరి 1: బస్టర్ నుపెన్, దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్. (మ.1977)
- జనవరి 5: ఆర్. కృష్ణసామి నాయుడు, రాజకీయ నాయకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.1937)
- ఫిబ్రవరి 8: ఆండ్ర శేషగిరిరావు, కవి, నాటకకర్త, పత్రికా సంపాదకులు. (మ.1965)
- ఏప్రిల్ 30: థియోడర్ షుల్జ్, ఆర్థికవేత్త, నోబెల్ బహులతి గ్రహీత.
- జూన్ 6: కె.ఎల్.రావు, ఇంజనీరు, రాజకీయ నాయకుడు. (మ. 1986)
- జూన్ 12: పాలకోడేటి శ్యామలాంబ, స్వాతంత్ర్యసమరయోధురాలు, సత్యాగ్రహంలోనూ పాల్గొని జైలులో కఠిన కారాగార శిక్ష అనుభవించింది. (మ.1953)
- జూన్ 16: బార్బరా మెక్క్లింటన్, శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత.
- జూన్ 24: గూడవల్లి రామబ్రహ్మం, సినిమా దర్శకులు, సంపాదకులు. (మ.1946)
- జూన్ 24: జమిలి నమ్మాళ్వారు, ప్రచురణకర్త, పత్రికా సంపాదకుడు
- జూలై 15: కోకా సుబ్బారావు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి, తొమ్మిదవ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి. (మ.1976)
- జూలై 19: సముద్రాల రాఘవాచార్య, సముద్రాల సీనియర్ గా ప్రసిద్ధి చెందిన రచయిత, నిర్మాత, దర్శకుడు, నేపథ్యగాయకుడు. (మ.1968)
- ఆగష్టు 15: మోటూరి సత్యనారాయణ, దక్షిణ భారతదేశంలో హిందీ వ్యాప్తిచేసిన మహా పండితుడు, స్వాతంత్ర్య సమరయోధులు. (మ.1995)
- సెప్టెంబర్ 23: స్థానం నరసింహారావు, రంగస్థల నటుడు. (మ.1971)
- అక్టోబర్ 8: వాసిరెడ్డి శ్రీకృష్ణ, ఆర్థిక శాస్త్రవేత్త, విశ్వవిద్యాలయ సంచాలకులు. (మ.1961)
- అక్టోబర్ 10:పులుగుర్త వేంకటరామారావు, శతావధాని, రచయిత, ఆదర్శ ఉపాధ్యాయుడు. (మ.1964)
- అక్టోబర్ 11: జయప్రకాశ్ నారాయణ, భారత్లో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమాన్ని నిర్వహించాడు.
- అక్టోబర్ 21: అన్నాప్రగడ కామేశ్వరరావు, స్వాతంత్ర్య సమరయోధుడు.
- నవంబరు 15: గోరా, హేతువాది భారతీయ నాస్తికవాద నేత. (మ.1975)
- డిసెంబర్ 10: ఎస్.నిజలింగప్ప, కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు.
- డిసెంబర్ 10: ఉప్పల వేంకటశాస్త్రి, ఉత్తమశ్రేణికి చెందిన కవి. (మ.1976)
- డిసెంబర్ 23: చరణ్ సింగ్, భారత దేశ 5వ ప్రధానమంత్రి. (మ.1987)
- : బెల్లంకొండ సుబ్బారావు, రంగస్థల నటుడు, న్యాయవాది. (మ.1952)
మరణాలు
మార్చు- జూలై 4: స్వామి వివేకానంద, భారతీయ తత్వవేత్త, రామకృష్ణ మిషన్ స్థాపకుడు. (జ.1863)