ఆవత్ పౌని (పంజాబీ: ਆਵਤ ਪਾਓੁਣੀ) is a అనేది పంజాబ్ సంక్రాంతి వంటిది.ఆవత్ పౌనిలో అనేక మంది రైతులు అంతా సమూహంగా కూడి వైశాఖ మాసంలో పొలాలను పండిస్తారు.[1]

గోదుమ

ఆవత్ (పంజాబీ: ਆਵਤ) అంటే వచ్చేది అని అర్ధం. పూర్వం యంత్రాల సాంకేతికత లేనప్పుడు రైతులు తమ బంధువులను, స్నేహితులనూ పిలిచి అందరు ఒక్కటై పొలాల నూర్పిళ్ళు చేసేవారు.[2][3] అతిధులు పొరుగూర్ల నుంచి లేదా దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు. ఈ సంప్రదాయం కనుమరుగు అవ్వలేదు. అది ఇప్పటికి కొనసాగుతూనే ఉంది.

ఆవత్ పౌనిలో పాల్గోనే ప్రజలకు రోజుకు మూడు సార్లు సాంప్రదాయిక ఆహారం ఇస్తారు.[1] ఆ సమూహంలో మెుత్తం సుమారు 20 మంది సభ్యుల వరకు ఉండి పంజాబీ డోలు వాయిద్యాలకు పాటలు పాడుతారు. సాంప్రదాయికమైన పంజాబీ దోహే అనే జానపద కవితలు పాడుతారు. ఈ మధ్య కాలంలో లౌడ్ స్పీకర్లలో కూడా పాడుతున్నారు.

అక్కడికి విచ్చేసిన అతిధులకు సాంప్రదాయిక ఆహారాలైన షాకర్ (వడ కట్టిన బెల్లం పాకం), నెయ్యి, కార ప్రసాదము, కీర్ అనే పాయసము, పాలు ఇస్తారు.[1]

ఈ ఆవత్ పౌని కార్యక్రమాన్ని ఎక్కువ పొలం ఉన్న రైతులు, ఇంట్లో ఎవరైనా మరణించినప్పుడు గానీ, పశువులు మరణించినప్పుడు గానీ నిర్వహిస్తారు. ఓరకంగా ఇది తోటివారి సహాయం పొందే పద్ధతి.

ఆవత్ పౌనిలో రకాలు మార్చు

ఆవత్ పౌనిలో చాలా రకాలున్నాయి. వీటిని కొన్ని ప్రత్యేక సందర్భాల్లో కూడా చేస్తుంటారు.అవి:

  • నూర్పుళ్ళ సమయంలో
  • ఇంటి కప్పు వేసుకునేటప్పుడు
  • అంతకుముందే నూర్చిన తమ పంటను చుట్టాలకు, స్నేహితులకు చూపించుకునేప్పుడు

దోహే మార్చు

 
ఢోలక్

దోహే అనేది కవిత. దీనిని ఒక మనిషి పాడుతూ ఉంటాడు. అందులో కొంత భాగం:

ఇంటి ఆవరణలో, నా ప్రేయసి తన జుట్టు ఆరబెట్టుకుంటోంది
ఎప్పటికో తను నన్ను చూడనిచ్చింది, ఓ తమ్ముడా, కానీ ఆ చూపు నన్ను మోసగించింది

ఆ చివరి లైను అందుకుని, ఇంకొకతను డప్పులు కొట్టుకుంటూ మిగిలిన పాట పాడతాడు. అలాగే పెద్ద పెట్టున నృత్యం చేసుకుంటూ తిరుగుతారు. ఈ పండుగ చేసుకునేటప్పుడు ఇలా పాటలు పాడుతూ, నాట్యం చేయడం వారి ఆనవాయితీ.[4]

మూలాలు మార్చు

  1. 1.0 1.1 1.2 Alop ho riha Punjabi virsa, Harkesh Singh Kehal, Unistar Book PVT Ltd., ISBN 81-7142-869-X
  2. "Glossary" (PDF). Shodhganga,inflibnet.ac.in. Retrieved 18 February 2015.
  3. "Chapter V : Gender and wor : Analysis" (PDF). Shodhganga.inflibnet.ac.in. Retrieved 18 February 2015.
  4. Dr Singh, Sadhu (2010) Punjabi Boli Di Virasat.Chetna Prakashan.ISBN 817883618-1
"https://te.wikipedia.org/w/index.php?title=ఆవత్_పౌని&oldid=2886548" నుండి వెలికితీశారు