నెయ్యి (ఆంగ్లం: Liquid clarified Butter) పెరుగు నుండి లభించే ఒక నూనె లాంటి కొవ్వు పదార్థం. దీనిని వంట లలో, పూజ కార్యక్రమాలలో, కొన్ని ఆహార పదార్థాలుగా ఎక్కువగా వాడుతారు. వెన్న (Butter) ను మరిగించడం ద్వారా నెయ్యిని తయారు చేస్తారు.

నెయ్యి ఇంట్లో తయారు చేసింది.

చరిత్ర మార్చు

మానవుడు సంచారజీవనం వదలి, స్దిరనివాసం ఏర్పరచుకొని వ్యవసాయం చేయ్యడం మొదలుపెట్టుటకు మునుపే పశువులను మచ్చిక చేసుకొని పాల వుత్పత్తి,, ఇతర వ్యవసాయ పనులకు వినియోగించుకోవటం ప్రారంభించాడు. పాల నుండి వెన్న, మీగడ, నెయ్యి తయారుచేయటం నేర్చుకున్నాడు. విదేశాలలో వెన్ననే ఎక్కువగా ఆహారంగా వాడెదరు. విదేశాలలో నెయ్యిని క్లారిఫైడ్‌ బట్టరు అంటారు. తూర్పు దక్షిణ ఆసియా దేశాలు (ఇండియా, పాకిస్దాన్, బంగ్లా, ఛైనా తదితర దేశాలు) వెన్ననుండి నెయ్యిని తయారుచేసి ఉపయోగించడం ఎక్కువ. భారతదేశంలో వేదకాలం నాటికే నెయ్యిని వాడటం మొదలైనది. యజ్ఞాలలో హోమగుండంలో అగ్నిని ప్రజ్వలింప చేయుటకు నెయ్యిని వాడెదరు. ఆయుర్వేదంలో నెయ్యిని ప్రశస్తమైన స్వాత్తిక ఆహారంగా పెర్కొన్నారు. నెయ్యిని ఆవు, గేదె, మేక పాల వెన్ననుండి తయారుచేయుదురు. విదేశాలలో ఆవు పాల వెన్ననుండి ఎక్కువగా నెయ్యిని చేయుదురు. భారతదేశంలో ఆవు, గేదె పాల వెన్ననుండి నెయ్యిని చేయుదురు. గేదె నెయ్యి కన్న ఆవు నెయ్యిని శ్రేష్టమైనదిగా ఆయుర్వేదంలో పెర్కొన్నారు. నెయ్యి జ్ఞాపకశక్తిని, జీర్ణశక్తిని పెంచుతుందని,, రోగ నిరోధక శక్తిని పెంచుతుందని భావిస్తారు. నెయ్యి మెదడు, నాడీ వ్యవస్థను చురుకుగా వుండునట్లు చేయునని ఆయుర్వీదంలో చెప్పారు.

చాలామందికి నేతిచుక్క కలవనిదే ముద్ద గొంతు దిగాడు . నెయ్యి శరీరానికి ఎన్నో పోషకాల్ని అందిస్తుంది . నెయ్యిని వంటకాలు తయారీలో గాని, నేరుగా గాని వాడవచ్చును . వెన్నను మందపాటి అడుగున్న పాత్రలో మధ్యస్తంగా వుండే మంటపై 20 నిముషాలు వేడిచేసినచో దానిలోని కొవ్వుపదార్థామంతా అడుగుకు చేరుతుంది ... నెయ్యి నిండు బంగారు రంగులోకి వచ్చాక దింపేయాలి . . . చల్లారేక స్టీల్ / గాజు సీసాల్లో నిలువచేయాలి . శరీరము లోని ప్రతి ష్టాయిలోని టిస్స్యు లకు బలాని చేకూర్చుతుంది . రోగనిరోధక వ్యవస్థను బలోపేతము చేస్తుంది . రోజుకు 2 - 3 స్పూన్లు నెయ్యి తీసుకుంటే శరీర వ్యవస్థ చక్కగా హోర్మోనైజ్ అవుతుంది . నెయ్యి (Ghee) పాల నుండి లభించే ఒక నూనె లాంటి కొవ్వు పదార్థం. దీనిని వంట లలో, పూజ కార్యక్రమాలలో, కొన్ని ఆహార పదార్థాలుగా ఎక్కువగా వాడుతారు. వెన్న (Butter) ను మరిగించడం ద్వారా నెయ్యిని తయారు చేస్తారు.

మానవుడు సంచారజీవనం వదలి, స్దిరనివాసం ఏర్పరచుకొని వ్యవసాయం చేయ్యడం మొదలుపెట్టుటకు మునుపే పశువులను మచ్చిక చేసుకొని పాల వుత్పత్తి,, ఇతర వ్యవసాయ పనులకు వినియోగించుకోవటం ప్రారంభించాడు. పాల నుండి వెన్న, మీగడ, నెయ్యి తయారుచేయటం నేర్చుకున్నాడు. విదేశాలలో వెన్ననే ఎక్కువగా ఆహారంగా వాడెదరు. విదేశాలలో నెయ్యిని క్లారిఫైడ్‌ బట్టరు అంటారు. తూర్పు దక్షిణ ఆసియా దేశాలు (ఇండియా, పాకిస్దాన్, బంగ్లా, ఛైనా తదితర దేశాలు) వెన్ననుండి నెయ్యిని తయారుచేసి ఉపయోగించడం ఎక్కువ. భారతదేశంలో వేదకాలం నాటికే నెయ్యిని వాడటం మొదలైనది. యజ్ఞాలలో హోమగుండంలో అగ్నిని ప్రజ్వలింప చేయుటకు నెయ్యిని వాడెదరు. ఆయుర్వేదంలో నెయ్యిని ప్రశస్తమైన స్వాత్తిక ఆహారంగా పెర్కొన్నారు. నెయ్యిని ఆవు, గేదె, మేక పాల వెన్ననుండి తయారుచేయుదురు. విదేశాలలో ఆవు పాల వెన్ననుండి ఎక్కువగా నెయ్యిని చేయుదురు. భారతదేశంలో ఆవు, గేదె పాల వెన్ననుండి నెయ్యిని చేయుదురు. గేదె నెయ్యి కన్న ఆవు నెయ్యిని శ్రేష్టమైనదిగా ఆయుర్వేదంలో పెర్కొన్నారు. నెయ్యి జ్ఞాపకశక్తిని, జీర్ణశక్తిని పెంచుతుందని,, రోగ నిరోధక శక్తిని పెంచుతుందని భావిస్తారు. నెయ్యి మెదడు, నాడీ వ్యవస్థను చురుకుగా వుండునట్లు చేయునని ఆయుర్వీదంలో చెప్పారు.

నెయ్యిలో సంతృప్త కొవ్వు ఆమ్లాలు ఎక్కువ ప్రమాణంలో వుండటం వలన, గది ఉష్ణోగ్రత వద్ద నెయ్యి చిన్నపూసల వంటి స్పటిక, ఘనరూపంలో వుండును. లేతపసుపు లేదా క్రీమ్‌ రంగులో వుండును. నెయ్యిని కరగించినప్పుడు పారదర్శకంగా ద్రవరూపంలోకి మారును. ప్రత్యేకమైన సువాసన, రుచి కలిగివుండును. నెయ్యిలో వున్న సంతృప్త కొవ్వుఆమ్లాలలో తక్కువ పొడవు వున్న హైడ్రొకార్బను గొలుసున్న కొవ్వు ఆమ్లాలు (C4 నుండి C8 వరకు),, మధ్యస్త పొడవు హైడ్రొకార్బను గొలుసు వున్న (C10 నుండి C14) కొవ్వుఆమ్లాలను కలిగివున్నది. అలాగే సంతృప్త, అసంతృప్త కొవ్వుఆమ్లాలలో బేసిసంఖ్య కార్బనులున్న (C15, C17) కొవ్వుఆమ్లాలను స్వల్పప్రమాణంలో కలిగివున్నది. మరే నూనెలలోను, కొవ్వులలోను లేని విధంగా నెయ్యి విటమినులు A, D, E, K లను సమృద్ద్థిగా కలిగివున్నది. బేటా కెరొటినులు, విటమినుA లు సహజ యోంటి అక్సిడెంట్స్. నూనెలు సాధారణంగా విటమిన్ A ను కలిగివుండవు. నెయ్యిలో విటమిన్‌ 'ఎ" ఉంది.

నెయ్యి ఉపయోగం, వినియోగంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమగుచున్నవి. ఆయుర్వేదం, మరికొన్ని దేశీయ వైద్య రచనల ప్రకారం నెయ్యి స్వాత్విక ఆహారం. జ్ఞాపకశక్తిని, జీర్ణశక్తిని పెంచుతుందని, తెలివిని పెంచుతుందని, రోగనిరోధ శక్తిని మెరగుపరుస్తుందని, మెదడును చురుకుగా పనిచేయుస్తుందని వారి నమ్మకం. అయితే ఆధునిక వైద్యుల అభిప్రాయం ప్రకారం ఎక్కువ మోతాదులో నెయ్యిని ఆహారంతో పాటు తీసుకొవటం వలన హృదయ సంబంధిత వ్యాధులోచ్చే అవకాశం మెండుగా ఉంది. నెయ్యిలోవున్న చిన్న,, మధ్యస్త పొడవువున్న హైడ్రొకార్బను గొలుసు సంతృప్త కొవ్వుఆమ్లాలను తన అవసరం మేరకు తయారుచేసుకునే శక్తి దేహ వ్యవస్థకు ఉంది. నెయ్యికి కొలెస్ట్రాల్‌ను పెంచు లక్షణంలున్నాయని వైద్యుల అభిప్రాయం. మానవునికి సాధారణంగా రోజుకు 1800 కెలరిల శక్తి యిచ్చు ఆహారం అవసరం. మానవుడు తీసుకునే ఆహారంలోని నెయ్యి లేదా యితర కొవ్వుల కెలరిఫిక్‌ విలువ 10% మించరాదు (180 కెలరిలు). రెండు టి స్పూనుల నెయ్యి దాదాపు 300 కెలరిల శక్తిని కలిగి వుండును. అంటే రోజుకు రెండు స్పూనులకు మించి నెయ్యిని తీసుకొవడం హనీకరం.ఈ మధ్య కొందరు వైద్యులు జరిపిన పరిశోధన పరీక్షలలో నెయ్యిని అధికంగా తీసుకునే తూర్పు దక్షిణ ఆసియా ప్రజలలో (ఇండియా, పాకిస్దాన్, బంగ్లా) హృదయ సంబంధ రోగగ్రస్తులు అధికంగా వున్నట్లు తేలినది. ఎమైన నెయ్యిని వీలున్నంత వరకు తక్కువ మోతాదులో తినడం శ్రేయస్కరం.

నెయ్యి వినియోగం మార్చు

నెయ్యి

నెయ్యిని లడ్దులు, మైసూరు పాకు, హల్వా వంటివి, ఎక్కువ కాలం నిల్వ వుంచు తీపి వంటకాలను తయారుచేయుటకు ఉపయోగిస్తారు. దేవాలయాలలో దేవును ప్రసాదాలను ఆవు నెయ్యితో చేస్తారు. నెయ్యిని ఆహారంలో పప్పు,, యితర కూరలతో కలుపుకుని తినెదరు. మిఠాయి దుఖాణాలలో చాలా తీపి వస్తువులను ఆవు నెయ్యినుపయోగించి చేయుదురు.

నెయ్యిని తయారుచేయుట మార్చు

ఇండియాలో నెయ్యిని రెండు రకాలుగా తయారు చేయుదురు. ఒకటి ఆనాదిగా భారతదేశంలో వున్న సంప్రదాయ పద్థతి. రెండు పారిశ్రామిక పద్థతి. పారిశ్రామిక పద్థతిలో తయారు చేసినదానికంటే సంప్రదాయ పద్ధతిలో తయారు చేసిన నెయ్య రుచిగా ఉంటుంది.

సంప్రదాయపద్థతి మార్చు

భారతదేశంలో పశుపోషణ ఎక్కువగా గ్రామాలలోనే ఎక్కువ. రైతు కుటుంబాలు వ్యవసాయంతో పాటు పశుపోషన కూడా చేయుదురు. నగారాలలో ఎక్కువగా పాలడైరిల అధ్వర్యంలో పాల వుత్పత్తి జరుగును. గ్రామాలలో పాలను మరుగపెట్టి పెరుగుగా చేసి, పెరుగును చిలికి పెరుగు నుండి వెన్న, మజ్జిగ తయారుచేయుదురు. పెరుగును నుండి వేరుచేసిన వెన్న తగినంత ప్రమాణంలో సేకరించిన తరువాత వెన్నను కరగించి నెయ్యిని చేయుదురు. సేకరించిన వెన్నను ఒక పెద్ద వెడల్పాటి పాత్రలో తీసుకొని సన్నని మంట క్రింద నెమ్మదిగా వేడిచేయుదురు (110-1200C). మొదటలో వేడిచేయునప్పుడు చిటపట ధ్వనులతో, పొంగుతో వెన్నమరగటం ప్రారంభించును. వెన్నలో అధిక శాతంలో నీరు వుండటం వలన ఈ విధంగా చిటపట ధ్వనులు వచ్చును. వెన్ననెమ్మదిగా కరగటం ప్రారంభించును. మరుగునప్పుడు ఏర్పడు పొంగును తగ్గించుటకై మరుగుతున్న వెన్నలో కొన్ని తమలపాకులను వేయుదురు. తమలపాకులను వేయడం వలన మరుగుతున్న వెన్నలో సువాసన భరితంగా మారును. వెన్నకరిగి, తేమ తొలగిన తరువాత నెయ్యి లేతపసుపు రంగులో పారదర్శకంగా మారును. ఇలా ఏర్పడిన నెయ్యిని కొద్దిగా చల్లార్చి వడపోసి నెయ్యిలోని మలినాలను తొలగించెదరు. నెయ్యులో సంతృప్త కొవ్వుఆమ్లాలు 68% వరకు వుండటం వలన గది ఉష్ణోగ్రత వద్ద నెయ్యి గడ్డకట్టును.

పారిశ్రామిక పద్థతి మార్చు

పాల డైరిలవారు వారు ఉత్పత్తి చేసిన, రైతుల నుండి సేకరించిన పాలను, శీతలీకరించి అమ్ముటకు ముందే పాలనుండి అపకేంద్రియ యంత్రాల (centrifuges) ద్వారా వెన్నను వేరు చేసి, సేకరించెదరు. ఆలా సేకరించిన వెన్న ఎక్కువ ప్రమాణంలో వుండటం వలన రియాక్టరులలో వెన్నను కరగించి నెయ్యిని తయారుచేయుదురు.

నెయ్యి భౌతిక,రసాయనిక గుణములు మార్చు

నెయ్యిలో సంతృప్త కొవ్వు ఆమ్లాలు ఎక్కువ ప్రమాణంలో వుండటం వలన, గది ఉష్ణోగ్రత వద్ద నెయ్యి చిన్నపూసల వంటి స్పటిక, ఘనరూపంలో వుండును. లేతపసుపు లేదా క్రీమ్‌ రంగులో వుండును. నెయ్యిని కరగించినప్పుడు పారదర్శకంగా ద్రవరూపంలోకి మారును. ప్రత్యేకమైన సువాసన, రుచి కలిగివుండును. నెయ్యిలో వున్న సంతృప్త కొవ్వుఆమ్లాలలో తక్కువ పొడవు వున్న హైడ్రొకార్బను గొలుసున్న కొవ్వు ఆమ్లాలు (C4 నుండి C8 వరకు),, మధ్యస్త పొడవు హైడ్రొకార్బను గొలుసు వున్న (C10 నుండి C14) కొవ్వుఆమ్లాలను కలిగివున్నది. అలాగే సంతృప్త, అసంతృప్త కొవ్వుఆమ్లాలలో బేసిసంఖ్య కార్బనులున్న (C15, C17) కొవ్వుఆమ్లాలను స్వల్పప్రమాణంలో కలిగివున్నది. మరే నూనెలలోను, కొవ్వులలోను లేని విధంగా నెయ్యి విటమినులు A, D, E, K లను సమృద్ద్థిగా కలిగివున్నది. బేటా కెరొటినులు, విటమినుA లు సహజ యోంటి అక్సిడెంట్స్. నూనెలు సాధారణంగా విటమిన్ A ను కలిగివుండవు. నెయ్యిలో విటమిన్‌ 'ఎ" ఉంది.

నెయ్యి భౌతిక, రసాయనిక ధర్మాల పట్టిక

లక్షణం మితి/శాతం
ద్రవీభవన ఉష్ణోగ్రత 28-440C
సపోనిఫికెసన్ విలువ 240-230
వక్రీభవన సూచిక (400C 40-45
ఐయోడిన్ విలువ 26-38
స్మోక్‌ పాయింట్ 240-2600C
reichert-meissel value 26-29
polenske value 1.0-1.7
F.F.A 0.15-0.25%

నెయ్యిలోని కొవ్వుఆమ్లాల శాతం

కొవ్వుఆమ్లాలు శాతం
సంతృప్తకొవ్వుఆమ్లాలు 65-68
ఎకద్విబంధ అసంతృపఆమ్లాలు 25-30
ద్విద్విబంధఆమ్లాలు 1.5-2.0
సంతృప్తకొవ్వుఆమ్లాలు శాతం
C4-C10 7-8
C12-C15 12-15
పామిటిక్‌ఆమ్లం 30-32
స్టియరిక్‌ఆమ్లం 12-13
అసంతృపకొవ్వుఆమ్లాలు శాతం
పామిటొలిక్‌ఆమ్లం 1.5-2.0
ఒలిక్‌ఆమ్లం 25-26
లినొలిక్‌ఆమ్లం 1.5-2.0

నెయ్యి వినియోగం - భిన్నాభిప్రాయాలు మార్చు

దోశ నెయ్యితో కలిపి తింటారు.

నెయ్యి ఉపయోగం, వినియోగంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమగుచున్నవి. ఆయుర్వేదం, మరికొన్ని దేశీయ వైద్య రచనల ప్రకారం నెయ్యి స్వాత్విక ఆహారం. జ్ఞాపకశక్తిని, జీర్ణశక్తిని పెంచుతుందని, తెలివిని పెంచుతుందని, రోగనిరోధ శక్తిని మెరగుపరుస్తుందని, మెదడును చురుకుగా పనిచేయుస్తుందని వారి నమ్మకం. అయితే ఆధునిక వైద్యుల అభిప్రాయం ప్రకారం ఎక్కువ మోతాదులో నెయ్యిని ఆహారంతో పాటు తీసుకొవటం వలన హృదయ సంబంధిత వ్యాధులోచ్చే అవకాశం మెండుగా ఉంది. నెయ్యిలోవున్న చిన్న,, మధ్యస్త పొడవువున్న హైడ్రొకార్బను గొలుసు సంతృప్త కొవ్వుఆమ్లాలను తన అవసరం మేరకు తయారుచేసుకునే శక్తి దేహ వ్యవస్థకు ఉంది. నెయ్యికి కొలెస్ట్రాల్‌ను పెంచు లక్షణంలున్నాయని వైద్యుల అభిప్రాయం. మానవునికి సాధారణంగా రోజుకు 1800 కెలరిల శక్తి యిచ్చు ఆహారం అవసరం. మానవుడు తీసుకునే ఆహారంలోని నెయ్యి లేదా యితర కొవ్వుల కెలరిఫిక్‌ విలువ 10% మించరాదు (180 కెలరిలు). రెండు టి స్పూనుల నెయ్యి దాదాపు 300 కెలరిల శక్తిని కలిగి వుండును. అంటే రోజుకు రెండు స్పూనులకు మించి నెయ్యిని తీసుకొవడం హనీకరం.ఈ మధ్య కొందరు వైద్యులు జరిపిన పరిశోధన పరీక్షలలో నెయ్యిని అధికంగా తీసుకునే తూర్పు దక్షిణ ఆసియా ప్రజలలో (ఇండియా, పాకిస్దాన్, బంగ్లా) హృదయ సంబంధ రోగగ్రస్తులు అధికంగా వున్నట్లు తేలినది. ఎమైన నెయ్యిని వీలున్నంత వరకు తక్కువ మోతాదులో తినడం ఉభయత్ర శ్రేయస్కరం.

నెయ్యి వినియోగం

  • నెయ్యిని లడ్దులు, మైసూరు పాకు, హల్వా వంటివి, ఎక్కువ కాలం నిల్వ వుంచు తీపి వంటకాలను తయారుచేయుటకు ఉపయోగిస్తారు. దేవాలయాలలో దేవును ప్రసాదాలను ఆవు నెయ్యితో చేస్తారు.
  • నెయ్యిని ఆహారంలో పప్పు,, యితర కూరలతో కలుపుకుని తినెదరు.
  • మిఠాయి దుఖాణాలలో చాలా తీపి వస్తువులను ఆవు నెయ్యినుపయోగించి చేయుదురు.

బయటి లింకులు మార్చు

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.

మూలాలు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=నెయ్యి&oldid=4023803" నుండి వెలికితీశారు