ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్లి

ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్లి 2016లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీమ‌తి శైల‌జ స‌మ‌ర్ప‌ణ‌లో రెడ్ కార్పెట్ రీల్ బ్యానర్‌ పై రవి పచ్చపాల నిర్మించిన ఈ సినిమాకు ఎస్.జె. చైతన్యకృష్ణ దర్శకత్వం వహించాడు. ఏ.రవితేజ‌, ప్రభాక‌ర్‌, అశ్విని చంద్ర‌శేఖ‌ర్, భానుశ్రీ, వేణు, అప్పారావు న‌టించిన ఈ సినిమా నవంబర్ 4, 2016న విడుదలైంది.[1]

ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్లి
దర్శకత్వంఎస్.జె. చైతన్యకృష్ణ
నిర్మాతరవి పచ్చపాల
తారాగణంఏ.రవితేజ‌, ప్రభాక‌ర్‌, అశ్విని చంద్ర‌శేఖ‌ర్, భానుశ్రీ, వేణు, అప్పారావు
ఛాయాగ్రహణంఆర్లి
సంగీతంఎమ్‌.టి.క‌విశంక‌ర్‌
నిర్మాణ
సంస్థ
రెడ్ కార్పెట్ రీల్
విడుదల తేదీ
నవంబర్ 4, 2016
దేశం భారతదేశం
భాషతెలుగు

కథ మార్చు

నెల్లూరులో కబ్జాలు చేస్తూ ఉండే రౌడీ అయిన నగరం నాని (ప్రభాకర్) కి ఆడవాళ్ళన్నా, ప్రేమలన్నా పడదు. తనను ఒక అమ్మాయి మోసం చేసిందన్న కారణంతో అప్పట్నుంచి తన చెల్లెలుతో సహా మొత్తం ఆడవాళ్ళనే ధ్వేషిస్తుంటాడు. అతడి చెల్లెలు అమృత (అశ్విని), ప్రభాస్ (రవితేజ) అనే వ్యక్తిని ప్రేమిస్తుంది, తన ప్రేమ విషయం అన్నయ్య (నాని) కు బయటపడి ప్రేమ విషయాన్ని చెప్పలేకపోతోంది. ఈ క్రమంలోనే ప్రభాస్ (రవితేజ) అనే మరో వ్యక్తి అమృతకు సాయం చేసేందుకు ముందుకొస్తాడు. ఈ ప్రభాస్ ఎవరు ? అమృతకు సహాయం చేయడానికి అతడెందుకు ముందుకొస్తాడు? వీరిద్దరూ కలిసి ఏ నాటకమాడి నానిని ఒప్పిస్తారు? అనేదే మిగతా సినిమా కథ.[2]

నటీనటులు మార్చు

  • ఏ.రవితేజ‌
  • ప్రభాక‌ర్‌
  • అశ్విని చంద్ర‌శేఖ‌ర్
  • భానుశ్రీ
  • వేణు
  • అప్పారావు

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్: రెడ్ కార్పెట్ రీల్
  • నిర్మాత: రవి పచ్చపాల
  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఎస్.జె. చైతన్యకృష్ణ [3]
  • సంగీతం: ఎమ్‌.టి.క‌విశంక‌ర్‌
  • సినిమాటోగ్రఫీ:ఆర్లి
  • స‌హ‌నిర్మాత‌లు:న‌గ‌రం సునీల్‌, మ‌ధుమ‌ణి

మూలాలు మార్చు

  1. Sakshi (22 June 2016). "'ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్లి' పూర్తయింది!". Archived from the original on 28 ఆగస్టు 2021. Retrieved 28 August 2021.
  2. The Hindu (5 November 2016). "Aavu Puli Madhyalo Prabhas Pelli: Waste of time" (in Indian English). Archived from the original on 28 ఆగస్టు 2021. Retrieved 28 August 2021.
  3. The Hans India (20 July 2016). "Aavu Puli Madhyalo Prabhas Pelli will be a fun ride: Director" (in ఇంగ్లీష్). Archived from the original on 22 జూలై 2016. Retrieved 28 August 2021.