భానుశ్రీ భారతదేశానికి చెందిన సినిమా తెలుగు సినిమా నటి, కొరియోగ్రాఫర్‌, మోడల్, యాంకర్. ఆమె మొదట టీవీ సీరియల్స్ ద్వారా చిత్ర రంగంలోకి వచ్చి, 2015లో విడుదలైన బాహుబలి సినిమా ద్వారా సినిమాల్లోకి అడుగు పెట్టింది.[1] భాను బిగ్‌బాస్‌ 2లో కంటెస్టెంట్‌గా పాల్గొంది.

భానుశ్రీ
జననం
స్వప్న

1988
వృత్తిసినిమా నటి, మోడల్, యాంకర్, కొరియోగ్రాఫర్‌
క్రియాశీల సంవత్సరాలు2015–ప్రస్తుతం

జననం, విద్యాభాస్యం

మార్చు

భానుశ్రీ 1988లో వరంగల్లో జన్మించింది. ఆమె హన్మకొండలో డిగ్రీ పూర్తి చేసింది.[2]

సినీ జీవితం

మార్చు

భానుశ్రీకి చిన్నప్పటి నుండి డాన్స్ అంటే ఇష్టం, ఆ ఇష్టంతోనే కొరియోగ్రాఫర్ అవ్వాలని హైదరాబాద్ వచ్చింది. ఆమె శక్తి, డార్లింగ్ సినిమాలకు కొరియోగ్రాఫర్ గా పనిచేసింది. భానుకు జెమినీ టీవీలో ప్రసారమైన 'జాబిలమ్మ' సీరియల్‌లో హీరోయిన్ నటించింది. ఆమె 2015లో బాహుబలి సినిమాలో తమన్నా స్నేహితురాలి పాత్రలో నటించి, నటన రంగంవైపు అడుగు పెట్టింది. ఆమె కాటమరాయుడు, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, మహానుభావుడు చిత్రాల్లో నటించింది. ఆమె తొలిసారి 2017లో విడుదలైన 'ఇద్దరి మధ్య 18' సినిమాలో హీరోయిన్ గా నటించింది.

నటించిన సినిమాలు

మార్చు

మూలాలు

మార్చు
  1. Sakshi (17 April 2017). "తెలుగమ్మాయిగా వెలగాలనుంది". Sakshi. Archived from the original on 23 జూన్ 2021. Retrieved 23 June 2021.
  2. 10TV (11 April 2020). "బాగానే కష్ట పడుతుంది.. ప్రతిఫలం ఎప్పుడో మరి!". 10TV (in telugu). Archived from the original on 23 జూన్ 2021. Retrieved 23 June 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  3. Andhra Jyothy (6 June 2021). "బిగ్‌బాస్‌ భామ భానుశ్రీ కొత్త చిత్రం". Archived from the original on 26 February 2022. Retrieved 26 February 2022.
  4. Sakshi (13 April 2019). "బ్రేకింగ్‌ న్యూస్‌తో హీరోయిన్‌గా." Sakshi. Archived from the original on 23 జూన్ 2021. Retrieved 23 June 2021.
  5. HMTV (27 December 2020). "సంక్రాంతికే ' ఈ అమ్మాయి( EMI )' వచ్చేది !". HMTV. Archived from the original on 23 జూన్ 2021. Retrieved 23 June 2021.
  6. Sakshi (17 January 2020). "విదేశాలకు సముద్రుడు". Sakshi. Archived from the original on 23 జూన్ 2021. Retrieved 23 June 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=భానుశ్రీ&oldid=4346028" నుండి వెలికితీశారు