సలాబత్ జంగ్
అసఫ్ ఉద్దౌలా మీర్ అలీ సలాబత్ జంగ్ (జ: 1718 - మ: సెప్టెంబరు 16, 1763) హైదరాబాదు నిజాం పాలకుడు. 1751 సంవత్సరంలో ముజఫర్ జంగ్ హత్య తరువాత ఫ్రెంచి సేనాని బుస్సీ, నాసర్ జంగ్ తమ్ముడైన సలాబత్ జంగ్ ను దక్కను సుబేదారుగా ప్రకటించాడు. సలాబత్ జంగ్ దివానైన సయ్యద్ లస్కర్ ఖాన్ దక్కను నుండి ఫ్రెంచి సేనలను తరిమివేయడానికి కుట్రపన్నాడని పసిగట్టిన బుస్సీ 1754లో ఉత్తర సర్కారులు లోని శ్రీకాకుళం, ఏలూరు, రాజమహేంద్రవరం, కొండపల్లి లను సొంత జాగీరుగా సలాబత్ జంగ్ చేత వ్రాయించుకున్నాడు.
సలాబత్ జంగ్ | |
---|---|
నిజాముల్ ముల్క్ అసఫుద్దౌలా | |
4వ నిజాం | |
పరిపాలన | 13 ఫిబ్రవరి 1751 – 8 జూలై 1762 |
పూర్వాధికారి | ముజఫ్ఫర్ జంగ్ |
ఉత్తరాధికారి | మీర్ నిజాం అలీఖాన్, రెండవ అసఫ్‌ఝా |
జననం | 24 నవంబరు 1718 హైదరాబాదు, మొఘల్ సామ్రాజ్యం (ప్రస్తుత తెలంగాణ, భారతదేశం) |
మరణం | 1763 సెప్టెంబరు 16 బీదర్ కోట | (వయసు 44)
Burial | |
వంశము | 2 కుమారులు |
House | అసఫ్‌జాహీ వంశము |
తండ్రి | మొదటి అసఫ్‌ఝా |
సారవంతమైన ఉత్తర సర్కారులు ఫ్రెంచి వారి ఆధీనంలోకి పోవటం వలన హైదరాబాదు రాజ్య ఆర్థిక పరిస్థితి విచ్ఛిన్నమైనది. మూడవ కర్ణాటక యుద్ధంలో ఆంగ్లేయులు ఫ్రెంచి వారిని ఓడించి మచిలీపట్నం స్వాధీనం చేసుకున్నారు. 1759 మే 14 తేదీన సలాబత్ జంగ్ ఆంగ్లేయులతో సంధి చేసుకొని గుంటూరు తప్ప ఉత్తర సర్కారులు అన్నింటిని ఆంగ్లేయుల పరం చేశాడు.
1761లో మొదటి అసఫ్ జా నాలుగవ కుమారుడైన నిజాం ఆలీ ఖాన్ రెండవ అసఫ్‌ఝా బిరుదుతో నిజాం అయ్యాడు. ఇతని కాలం నుండే అసఫ్ జాహీ వంశీయులు నిజాం ప్రభువులుగా ప్రసిద్ధిచెందారు.