నిజాం అలీ ఖాన్ అసఫ్ ఝా II

అసఫ్ ఝా II

నవాబ్ మీర్ నిజాం అలీ ఖాన్ సిద్దికి, అసఫ్ జా II ( 1734 మార్చి 7 - 1803 ఆగస్టు 6) 1762, 1803 మధ్య హైదరాబాద్ రాజ్యానికి 2 వ నిజాం. అతను 1734 మార్చి 7 న అసఫ్ జా I, ఉమ్దా బేగం దంపతులకు నాల్గవ కుమారుడిగా జన్మించాడు.[1] అతని అధికారిక పేరు అసఫ్ జా II, నిజాం ఉల్-ముల్క్, నిజాం ఉద్-దౌలా, నవాబ్ మీర్ నిజాం 'అలీ ఖాన్ సిద్దికి బయాఫండి బహదూర్, ఫాత్ జంగ్, సిపా సాలార్, దక్కన్ నవాబ్ సుబేదార్ .

మీర్ నిజామ్ అలీ ఖాన్

హైదరాబాదు నిజాం సవరించు

దక్కను ఫౌజ్‌దార్ సవరించు

1759 వ సంవత్సరంలో నిజాం అలీ, దక్కను ప్రాంత కమాండరుగా నియమితుడయ్యాడు. మరాఠాలకు వ్యతిరేకంగా అతడు చేపట్టిన విజయవంతమైన పోరాట పద్ధతులు అతనికి సమర్థుడైన కమాండర్‌గా ఎంతో పేరు తెచ్చిపెట్టాయి.

దక్కన్ సుబేదార్ సవరించు

1761 సంవత్సరంలో మూడవ పానిపట్ యుద్ధంలో మరాఠాలు పరాజయం పాలైన తరువాత, నిజాం అలీ అతని 60,000 మంది సైన్యం ముందుకు సాగి పూనా వరకు వారిని తరిమి, శాశ్వత శాంతి కోసం ఒత్త్తిడి చేసింది. నిజాం అలీ అప్పుడు బీదర్ కోటను స్వాధీనం చేసుకున్నాడు. తరువాత సలాబత్ జంగ్‌ను బంధించాడు. నిజాం అలీ ఖాన్ యొక్క ఈ చర్యను మొఘల్ చక్రవర్తి షా ఆలం II ఆమోదించాడు. అతను ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ మద్దతున్న సలాబాత్ జంగ్ను తొలగించి దక్కన్ సుబేదారుగా, నిజాం అలీ ఖాన్ అసఫ్ జాహ్ II కు వారసుడిగా నియమిస్తూ ఫర్మాన్ జారీ చేశాడు. [2]

పేష్వాకు వ్యతిరేకంగా నిజాం జోక్యం సవరించు

1762 లో, రఘునాథరావు, తనకు మాధవరావు పేష్వాతో ఉన్న పరస్పర అపనమ్మకం, విభేదాల కారణంగా నిజాంతో పొత్తు పెట్టుకున్నాడు. నిజాం సైన్యం పూనా వైపు నడిచింది. కాని రుగునాథరావు తనకు ద్రోహం చేయబోతున్నాడని అతనికి తెలియదు. 1763 లో మొదటి మాధవరావు రఘునాథరావుతో కలిసి రాక్షస్‌భువన్ యుద్ధంలో నిజాంను ఓడించాడు.   

1795 లో ఖర్దా యుద్ధంలో నిజాం ఆలీ ఖాన్, మాధవరావు II చేతిలో ఓడిపోయాడు. దైలతాబాద్, ఔరంగాబాద్, సోలాపూర్ లను వారికి అప్పగించి, 3 కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించాడు.[3]

మాన్సియర్ రేమండ్ అనే ఒక ఫ్రెంచ్ జనరల్ అతనికి వ్యూహకర్త, సైనిక సలహాదారుగా పనిచేశాడు. [4]

మైసూరు పతనం సవరించు

మరుసటి సంవత్సరం, టిప్పు సుల్తాన్ పతనం ఆసన్నమైందని అతను గ్రహించాడు. దాంతో అతను బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీతో సైన్య సహకార ఒప్పందం లోకి ప్రవేశించాడు. ఆ విధంగా హైదరాబాద్ బ్రిటిష్ రాజ్ పరిధిలో ఒక రాచరిక సంస్థానంగా మారిపోయింది.

అసఫ్ జా II 1803 ఆగస్టు 6 న 69 సంవత్సరాల వయసులో హైదరాబాద్ లోని చౌమహల్లాలో మరణించాడు.

మూలాలు సవరించు

  1. http://4dw.net/royalark/India.php
  2. History of modern Deccan, 1720/1724-1948: Volume 1
  3. The Marathas 1600–1818, Band 2 by Stewart Gordon p.169
  4. "Raymond's tomb languishes in neglect". The Hindu. 30 May 2012. Retrieved 30 May 2012.