ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్

ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఆంగ్లం: Asian Development Bank) - ఏడీబీ అనేది 19 డిసెంబర్ 1966న స్థాపించబడిన ప్రాంతీయ అభివృద్ధి బ్యాంకు.[2] దీని ప్రధాన కార్యాలయం ఫిలిప్పీన్స్‌ రాజధాని మనీలాలో ఉంది. ఆసియాలోనే తొలి పారిశ్రామిక దేశంగా గుర్తింపు పొందిన జపాన్ సారథ్యంలో ఏడీబీని ఏర్పాటు చేశారు. ఆసియాలో సామాజిక, ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహించడానికి ఇది ప్రపంచవ్యాప్తంగా 31 ఫీల్డ్ ఆఫీసులను నిర్వహిస్తోంది.  కాగా ఏడీబీ స్థాపనలో 31 ఉండగా 2019 నాటికి 68 దేశాలకు సభ్యత్వం ఉంది.[3] వీటిలో 49 ప్రాంతీయ దేశాలు ఉండగా, 19 ప్రాంతీయేతర దేశాలు ఉన్నాయి.[4][5]

ఆసియా అభివృద్ధి బ్యాంకు
సంకేతాక్షరంADB
ఆశయంఏడీబీ అత్యంత పేదరిక నిర్మూలనకు తన ప్రయత్నాలను కొనసాగిస్తూనే, సంపన్నమైన, సమ్మిళిత, స్థితిస్థాపకమైన, స్థిరమైన ఆసియా, పసిఫిక్‌ని సాధించడానికి కట్టుబడి ఉంది.
స్థాపన19 డిసెంబరు 1966; 57 సంవత్సరాల క్రితం (1966-12-19)
రకంబహుపాక్షిక అభివృద్ధి బ్యాంకు
చట్టబద్ధతట్రీటీ
కేంద్రీకరణసామాజిక, ఆర్థిక అభివృద్ధి
ప్రధాన
కార్యాలయాలు
ఆర్టిగాస్ సెంటర్, మండలుయోంగ్, మెట్రో మనీలా, ఫిలిప్పీన్స్
సేవా ప్రాంతాలుఆసియా - పసిఫిక్
సభ్యులు68 దేశాలు
అధ్యక్షుడుమసత్సుగు అసకవా
ప్రధానభాగంబోర్డ్ ఆఫ్ గవర్నర్స్
సిబ్బంది3,092[1]

ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ప్రధానంగా ప్రపంచ బ్యాంకు నిర్దేశించుకున్న నిలకడైన అభివృద్ధి లక్ష్యాల సాధన దిశగా తోడ్పాటు అందిస్తుంటుంది. ముఖ్యంగా విద్య, ఆరోగ్యం, రవాణా, ఇంధనం, ఆర్థిక రంగం, వాతావరణ మార్పులు వంటి అంశాలపై దృష్టి సారిస్తుంది. వీటితో పాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ప్రాంతీయ సహకారం, ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాలు వంటి ప్రత్యేక అంశాలపైనా పనిచేస్తుంది.[6][7][8]

31 డిసెంబర్ 2020 నాటికి.. జపాన్, యునైటెడ్ స్టేట్స్ విడివిడిగా 15.571% అత్యధిక వాటాలను కలిగి ఉన్నాయి. చైనా 6.429%, భారతదేశం 6.317%, ఆస్ట్రేలియా 5.773% కలిగి ఉన్నాయి.[9]

మూలాలు

మార్చు
  1. ADB Annual Report 2016. Asian Development Bank. 2017. doi:10.22617/FLS178712. ISBN 9789292577742. {{cite book}}: |website= ignored (help)
  2. "ADB History". adb.org. Retrieved 2015-11-26.
  3. "Departments and Offices". adb.org. Retrieved 2015-11-26.
  4. "Asian Development Bank". Samayam Telugu. Retrieved 2021-12-13.
  5. Ming, Wan (Winter 1995–1996). "Japan and the Asian Development Bank". Pacific Affairs. 68 (4). University of British Columbia: 509–528. doi:10.2307/2761274. JSTOR 2761274. Archived from the original on 2011-08-07.
  6. Anonymous. "ADB Annual Reports". Asian Development Bank. adb.org. Retrieved 2015-11-26.
  7. "Scholarship Program: List of Academic Institutions". Asian Development Bank. 12 October 2017.
  8. "Intergovernmental Organizations". www.un.org.
  9. "Shareholders" (PDF). Asian Development Bank. adb.org. Archived from the original (PDF) on 2017-08-03. Retrieved 2015-11-26.