ఆస్తులు అంతస్తులు (1969 సినిమా)
అయోమయ నివృత్తి పేజీ ఆస్తులు అంతస్తులు చూడండి.
ఆస్తులు అంతస్తులు ,1969 న విడుదల . వి.రామచంద్రరావు దర్శకత్వంలో , ఘట్టమనేని కృష్ణ, వాణీశ్రీ, ఎస్ వరలక్ష్మి, రేలంగి, పద్మనాభం, మొదలగు వారు నటించారు . ఈ చిత్రానికి సంగీతం ఎస్ పి కోదండపాణి సమకూర్చారు.
ఆస్తులు అంతస్తులు (1969 తెలుగు సినిమా) | |
ఆస్తులు అంతస్థులు సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | వి. రామచంద్రరావు |
తారాగణం | కృష్ణ, వాణిశ్రీ |
సంగీతం | ఎస్.పి. కోదండపాణి |
నిర్మాణ సంస్థ | శ్రీ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
సాంకేతిక వర్గం
మార్చు- మాటలు: ముళ్లపూడి వెంకటరమణ
- సంగీతం: ఎస్‌పి కోదండపాణి
- కూర్పు: ఎస్‌ఎస్ ప్రకాశం
- కళ: ఎస్ కృష్ణారావు
- కెమెరా: దేవరాజ్
- నృత్యం: చిన్ని, సంపత్
- కెమెరా: విఎస్‌ఆర్ స్వామి
- దర్శకత్వం: వి రామచంద్రరావు
- నిర్మాతలు: సుందల్‌లాల్ నహతా, డూండీ
నటీనటులు
మార్చు- ఎస్.వరలక్ష్మి - రమాదేవి
- రేలంగి - పద్మనాభరావు
- పద్మనాభం - బాబ్జీ
- వాణిశ్రీ - శాంతి
- విజయలలిత - సుబ్బులు
- కృష్ణ - శంకరం
- జూ|| భానుమతి
- నవీనలక్ష్మి
- ఉదయలక్ష్మి
- ఏడిద నాగేశ్వరరావు
- జి.ఎస్.ఆర్.మూర్తి
- బృందావనం చౌదరి
- సుంకర లక్ష్మి
- తంగం
కథ
మార్చుతరతరాలుగా ఆస్తి అంతస్తుగల శ్రీమంతురాలు రమాదేవి (ఎస్ వరలక్ష్మి). ఆమె భర్త పద్మనాభరావు(రేలంగి). సొసైటీలో పేరు ప్రతిష్టల కోసం ప్రాకులాడే రమాదేవికి పేదవారంటే చులకన భావం. వారికి ఒక కుమారుడు బాబ్జీ (పద్మనాభం), ఒక కుమార్తె శాంతి (వాణిశ్రీ). తల్లి ఆడంబరం, అహంభావం నచ్చని బాబ్జీ విమర్శిస్తుంటాడు. ఒక సామాన్య యువతి సుబ్బులు (విజయలలిత)తో ప్రేమలో పడతాడు. ఇక కాలేజీలో చదివే శాంతి, తన కారు ట్రబులివ్వటంతో లోకల్ ట్రెయిన్‌లో ప్రయాణిస్తూ అక్కడ చిత్రకారుడు శంకరం (కృష్ణ)ను కలుసుకొని అతనితో ప్రేమలో పడుతుంది. రమాదేవి ఫ్యాక్టరీలో వాచ్‌మెన్‌గా పనిచేసే రాజయ్య (వెంకటేశ్వరరావు) కుమారుడే శంకరం. పేదవాడన్న సంగతి తెలియకుండా శంకరాన్ని శాంతి ప్రేమించటం, తమ పెళ్లికి తల్లి అంగీకరించక పోవటంతో ఆస్తి అంతస్తు వదిలి వెళ్లిపోవాలని అనుకుంటుంది. కూతురు మీది ప్రేమతో రాజీపడిన రమాదేవి, శంకరాన్ని ఇల్లరికానికి ఒప్పించి వారి వివాహం జరిపిస్తుంది. తాను ప్రేమించిన సుబ్బులు ధనవంతుల బిడ్డగా అమ్మను నమ్మించి, రెండు వివాహాలు ఒకేసారి జరిగేలా చూస్తాడు బాబ్జీ. పెళ్లయ్యాక శంకరాన్ని అవహేళన చేస్తూ ధనవంతుల బిడ్డగా నమ్మిన కోడల్ని గారంగా చూస్తుంటుంది రమాదేవి. శాంతిమీద ఆశలు పెట్టుకున్న మేనమామ, శంకరంపై హత్యాయత్నం చేస్తాడు. దీంతో శాంతి, శంకరం ఇల్లొదిలి వెళ్లిపోయి స్వతంత్రంగా జీవిస్తుంటారు. కోడలు సుబ్బులు అత్తగారిపట్ల అమర్యాదగా ప్రవర్తించటం, కూతురుపట్ల ప్రేమ, భర్త హితోక్తుల నేపథ్యంలో శాంతిని ఇంటికి రమ్మని కోరుతుంది రమాదేవి. శంకరం గీసిన చిత్రానికి అమెరికా నుంచి అవార్డు లభించటం, శాంతి తాము ఎందుకు విడిగా వచ్చామో తండ్రికి వివరించటం, రమాదేవి తన తమ్ముడిని ఇంటినుంచి వెళ్లగొట్టి కూతురు, అల్లుడు, కొడుకు, కోడళ్లు, బంధువులతో దీపావళి పండుగ జరుపుకోవటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది.[1]
పాటలు
మార్చు- అహ ఎర ఎర్రని పళ్లు.. తియ్య తియ్యని పళ్లు - రచన: కొసరాజు - గానం: పి సుశీల
- కలకండ పలుకుకన్నా నీ సొగసు - గానం: ఎల్‌ఆర్ ఈశ్వరి - రచన: అప్పలరాజు
- నిన్నేమో అనుకున్నాను/ నేడేమో అయిపోతున్నాను - గానం: పి సుశీల
- ఒకటైపోదామా ఊహల వాహినిలో మమతల - గానం: ఎస్‌పి బాలు, పి సుశీల, రచన: ఆరుద్ర
మూలాలు
మార్చు- ↑ సి.వి.ఆర్.మాణిక్యేశ్వరి (15 June 2019). "ఫ్లాష్ బ్యాక్ @ 50 ఆస్తులు- అంతస్తులు". ఆంధ్రభూమి దినపత్రిక. Archived from the original on 13 ఆగస్టు 2019. Retrieved 13 August 2019.