ఇంగ్లీషు పెళ్లాం ఈష్టు గోదావరి మొగుడు
ఇంగ్లీషు పెళ్లాం ఈస్ట్ గోదావరి మొగుడు 1999.మార్చి 11 న విడుదలైన తెలుగు చిత్రం.[1]వి. ఎం. సి.ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రానికి ఆర్.సురేష్ వర్మ దర్శకుడు. ఈ చిత్రంలో మేకా శ్రీకాంత్, రమ్యకృష్ణ ముఖ్య పాత్రలు పోషించారు. సంగీతం మణిశర్మ అందించారు .
ఇంగ్లీషు పెళ్లాం ఈష్టు గోదావరి మొగుడు (1999 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఆర్. సురేష్ వర్మ |
---|---|
తారాగణం | మేకా శ్రీకాంత్, రమ్య కృష్ణ |
సంగీతం | మణి శర్మ |
నిర్మాణ సంస్థ | వి.ఎం.సి.ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
కథ
మార్చుశిరీష (రమ్యకృష్ణ) అమెరికాలో పుట్టి పెరిగిన తెలుగమ్మాయి. చిన్నప్పటినుండి తలబిరుసు ఎక్కువ. తన స్వంత ప్రాంతమైన తూర్పు గోదావరి జిల్లా కు వచ్చి అందరి పట్ల దురుసుగా ప్రవర్తిస్తుంటుంది. సాంబశివరావు (శ్రీకాంత్) పక్కా పల్లెటూరి అబ్బాయి. ఆమె పొగరు ఎలాగైన అణచాలనుకుని ఆమెకు దగ్గరౌతాడు. అతడిని పూర్తిగా నమ్మిన రమ్యకృష్ణ అతడిని పెళ్ళి చేసుకుంటుంది. తర్వాత శ్రీకాంత్ తన అసలు స్వరూపాన్ని బయట పెడతాడు. చివరికి రమ్యకృష్ణ మారిందా లేదా అనేది ముగింపు.
నటవర్గం
మార్చు- మేకా శ్రీకాంత్
- రమ్యకృష్ణ
- జీవా
- మాన్య
- మురళీ మోహన్
- జయసుధ
- అన్నపూర్ణ
సాంకేతికవర్గం
మార్చు- దర్శకత్వం - ఆర్. సురేష్ వర్మ
- సంగీతం- మణిశర్మ
- నిర్మాణ సంస్థ: వి.ఎం.సి.ప్రొడక్షన్స్
- సాహిత్యం:వెన్నెలకంటి , వేటూరి
- నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, ఎస్ పి శైలజ, సుజాత,స్వర్ణలత , శ్రీవర్ధిని, శ్రీకీర్తన.
- విడుదల:1999 మార్చి 11.
పాటల జాబితా
మార్చు1.ఈస్ట్ నుంచి కొట్టు కొచ్చిన బెస్ట్ బుల్లోడా , రచన: వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్, గానం.సుజాత
2.ఎట్టుంది అబ్బాయి నాకిక దక్కిందిలే హాయి, రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర
3.ఏమిటే పిల్లా నీ గొప్ప అంత గొప్పగా, రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ పి శైలజ
4.కొక్కోరొక్కో పుంజులా కోకసిరి, రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం,స్వర్ణలత బృందం
5.జరిగినకథ చెరగదు, రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం కోరస్
6.ముద్దపసుపే చాలు ముఖ పరిచయం, రచన: వేటూరి, గానం.శ్రీవర్థిని,శ్రీ కీర్తన .
బయటి లంకెలు
మార్చుమూలాలు
మార్చు- ↑ "English Pellam East Godavari Mogudu (1999)". Indiancine.ma. Retrieved 2021-05-07.
2.ghantasala galaamrutamu , kolluri bhaskararao blog .