జీవా
జీవా ప్రముఖ తెలుగు నటుడు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కలిపి సుమారు 1000కి పైగా సినిమాల్లో నటించాడు.[1] ఎక్కువగా ప్రతినాయక, హాస్య పాత్రలను పోషించాడు. రాం గోపాల్ వర్మ, వంశీ, కృష్ణవంశీ, పూరి జగన్నాధ్ లాంటి దర్శకుల సినిమాల్లో ఎక్కువగా నటించాడు. తెలుగులో గులాబీ, నిన్నే పెళ్ళాడతా, హిందీలో సర్కార్ లాంటి సినిమాల్లో మంచి గుర్తింపు సాధించాడు.[2]
జీవా | |
---|---|
జననం | జీవా 1952 నవంబరు 30 |
వృత్తి | Actor |
క్రియాశీల సంవత్సరాలు | 1984 నుండి ఇప్పటి వరకు |
వ్యక్తిగత జీవితము
మార్చుజీవా అసలు పేరు కొచ్చర్ల దయారత్నం.[3] ఇతనికి వివాహమైంది. ఇద్దరు కుమారులు. స్వస్థలము గుంటూరు. పెద్ద కుమారుడు బొంబాయిలో స్థిరపడ్డాడు. చిన్న కుమారుడు గుంటూరులో వ్యాపారం చేస్తున్నాడు.
నట జీవితము
మార్చు1975 లో నటనారంగంలోకి ప్రవేశించాడు.నటుడిగా ఆయన తొలిచిత్రం బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన తొలికోడి కూసింది అనే సినిమా. ఈ సినిమా కోసం ఎంతోమంది ప్రయత్నించగా ఇందులో జీవాకు అవకాశం దక్కింది. తమిళంలో ఆయన మొదటి సినిమా ఎంగ వూర్ కండగి. తెలుగులో గులాబీ, నిన్నే పెళ్ళాడతా, హిందీలో సర్కార్ లాంటి సినిమాల్లో మంచి గుర్తింపు సాధించాడు.
నటించిన చిత్రాలు
మార్చుతెలుగు
మార్చు- ఎర్రచీర - ది బిగినింగ్ (2024)
- కల్లు కాంపౌండ్ 1995 (2024)
- నేను కీర్తన (2024)
- బ్రహ్మవరం పి.ఎస్. పరిధిలో (2024)
- యాద్గిరి అండ్ సన్స్ (2023)
- పరారీ (2023)
- దేశం కోసం భగత్ సింగ్ (2023)
- మా నాన్న నక్సలైట్ (2022)
- జెట్టి (2022)
- నా వెంట పడుతున్న చిన్నాడెవడమ్మా
- ఫోకస్ (2022)
- వర్జిన్ స్టోరి (2022)
- డిస్కో రాజా (2020)[4][5]
- సకల కళా వల్లభుడు (2019)
- పండుగాడి ఫొటో స్టూడియో (2019)
- మత్తు వదలరా (2019)
- విశ్వామిత్ర (2019)[6][7]
- జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్ (2018)
- సత్య గ్యాంగ్ (2018)
- కారులో షికారుకెళ్తే (2017)
- ఉందా..లేదా..?_(2017 తెలుగు సినిమా)(2017)
- గల్ఫ్ (2017)
- శమంతకమణి (2017)
- లక్ష్మీ బాంబ్ (2017)
- ఓ మై గాడ్ (2016)
- సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ (2015)
- పవర్ (సినిమా) (2014)
- మహంకాళి (2013)
- బన్నీ అండ్ చెర్రీ (2013)
- స్వామిరారా (2013)
- కెవ్వు కేక (2013)[8]
- దేవరాయ (2012)
- నిప్పు (2012)
- వనకన్య వండర్ వీరుడు (2011)
- తెలుగమ్మాయి (2011)
- గాయం-2 (2010)
- బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం (2010)
- రామ రామ కృష్ణ కృష్ణ (2010)
- తిమ్మరాజు (2010)
- బెండు అప్పారావు RMP (2009)
- మిస్టర్ గిరీశం (2009)
- ఆంజనేయులు (2009)
- గోపి గోపిక గోదావరి (2009)
- సలీం (2009)
- ఆదివిష్ణు (2008)
- ఆడవారి మాటలకు అర్థాలే వేరులే (2007)
- అతడెవరు (2007)
- గులాబి
- బుజ్జిగాడు
- నాయకుడు (2005)
- ప్రేమించుకున్నాం పెళ్ళికి రండి (2004)
- ఒక పెళ్ళాం ముద్దు రెండో పెళ్ళాం వద్దు (2004)
- నేనుసైతం (2004)
- ఆంధ్రావాలా (2004)[9]
- నేను పెళ్ళికి రెడీ (2003)
- విలన్ (2003)
- దేవి నాగమ్మ (2002)
- రాఘవ (2002)
- దేశముదురు
- మా ఆయన సుందరయ్య (2001)
- ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం (2001)
- అడవిచుక్క (2000)
- సాంబయ్య (1999)
- ఊరేగింపు (1988)
హిందీ
మార్చు- ట్రిక్ ... చిత్రీకరణ జరుగుతున్నది
- లాహోర్ (2009) ... కుంజల్ భాస్కర్ రెడ్డి
- రామ్ గోపాల్ వర్మకీ ఆగ్ (2007) ... ధనియ
- యాత్ర (2007)
- దర్వాజా బంద్ రఖో (2006) .. శరత్ శెట్టి
- గల్తియాం - ది మిస్టేక్ (2006)
- సర్కార్—స్వామీ వీరేంద్ర (2005)
- ది అండర్ వరల్డ్ బాద్షా (2005)
- అబ్ తక్ ఛప్పన్ (2004)- కమీషనర్ ఎం.ఐ. సుచెక్
- సత్య (1998)- జగ్గా
మూలాలు
మార్చు- ↑ "వెయ్యి సినిమాల్లో నటించా." sakshi.com. సాక్షి. Retrieved 30 November 2016.
- ↑ "సినీ పరిశ్రమకు విశాఖ అనువు". sakshi.com. Retrieved 30 November 2016.
- ↑ "బాలచందర్ పెట్టిన పేరే జీవా". sakshi.com. సాక్షి. Retrieved 30 November 2016.
- ↑ సాక్షి, సినిమా (24 January 2020). "'డిస్కో రాజా' మూవీ రివ్యూ". సంతోష్ యాంసాని. Archived from the original on 2020-01-24. Retrieved 24 January 2020.
- ↑ ఈనాడు, సినిమా (24 January 2020). "రివ్యూ: డిస్కోరాజా". Archived from the original on 24 జనవరి 2020. Retrieved 24 January 2020.
- ↑ సాక్షి, సినిమా (14 April 2019). "ఊహకు అందని విషయాలతో..." Archived from the original on 14 April 2019. Retrieved 10 February 2020.
- ↑ సాక్షి, సినిమా (16 February 2019). "సృష్టిలో ఏదైనా సాధ్యమే". Archived from the original on 16 February 2019. Retrieved 10 February 2020.
- ↑ "Kevvu Keka Movie Review, Rating". gulte.com. Retrieved 16 July 2019.
- ↑ FilmiBeat, Movies. "Andhrawala Cast & Crew". www.filmiBeat.com (in ఇంగ్లీష్). Archived from the original on 6 June 2020. Retrieved 6 June 2020.