ఇంటర్మీడియట్ విద్య

(ఇంటర్ నుండి దారిమార్పు చెందింది)

సెకండరీ (ఉన్నత పాఠశాల) విద్య తరువాత మొదటి మెట్టు ఇంటర్మీడియట్ విద్య. ఇది రెండు సంవత్సరాలు వుంటుంది కావున, 10+2+3 లో రెండవది. విద్యార్థులు తమ చదువుకి ఐఛ్ఛిక విషయాలను ఎంచుకొంటారు. ముందు చదువులకు, లేక ఉద్యోగాలకు ఈ స్థాయిలోని ఐఛ్ఛిక విషయాలు కీలకమైనవి. ఆంధ్రప్రదేశ్లో ఈ విద్యని, ఇంటర్మీడియట్ విద్యామండలి (ఆంధ్ర ప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్) [1] నిర్వహిస్తుంది. ఇంటర్మీడియట్ స్థాయిలో ఆర్ట్స్, కామర్స్, సైన్స్ లో సాంప్రదాయక కోర్సులు, ఇంజనీరింగ్, వ్యవసాయం, హోమ్ సైన్స్, హెల్త్, పారామెడికల్, బిజినెస్, కామర్స్, హ్యుమానిటీస్ లలో 34 వృత్తి విద్యా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వృత్తి విద్యా కోర్సులు 1244 జూనియర్ కళాశాలలో ఉన్నాయి.

ఇంటర్మీటియట్ విద్యా బోర్డు, రాజ్‌షాహి

కళాశాలల గణాంలు

మార్చు
యాజమాన్య రకం కళాశాలల సంఖ్య
ప్రభుత్వ జూనియర్ కళాశాల 804
ప్రైవేట్ ఎయిడెడ్ జూనియర్ కళాశాల 205
ప్రైవేట్ ఎయిడెడ్ కంపోజిట్ డిగ్రీ కళాశాల 70
ప్రైవేట్ అన్ఎయిడెడ్ జూనియర్ కళాశాల 2483
ప్రత్యేక ప్రైవేట్ ఒకేషనల్ జూనియర్ కళాశాల 479
ఇన్సెంటివ్ జూనియర్ కళాశాల 176
ఇతర (గురుకులాలు, వికలాంగ సంక్షేమ, సహకార, రైల్వే) జూనియర్ కళాశాల 382
పూర్తి ఒకేషనల్ జూనియర్ కళాశాల 12
మొత్తం 4611

ఇంటర్మీడియట్ ఫలితాలు

మార్చు
 
ఇంటర్మీడియట్ బోర్డు, ఫైసాబాదు వారు విద్యార్థికి అందజేసిన ఉత్తీర్ణతా సర్టిఫికేటు

సీనియర్ ఇంటర్ మార్చి 2012 ఫలితాలు

మార్చు

పరీక్షలకు జనరల్ (రెగ్యులర్) లో 7, 56, 459 మంది విద్యార్థులు హాజరుకాగా4, 41, 966 (58.43%) మంది ఉత్తీర్ణులయ్యారు.[2] మార్కు ల ఆధారంగా జనరల్ (రెగ్యులర్) లో 2, 04, 263 (46.22%) మంది 'ఎ' గ్రేడ్ (75%, అంతకన్నా ఎక్కువ) సాధించారు. 1, 40, 126 (31.71%) మంది 'బి' గ్రేడ్ (60-75%), 69, 307 మంది (15.68%) 'సి' గ్రేడ్ (50-60%), 28, 270 (6.40%) మంది 'డి' గ్రేడ్ (35-50%) పొందారు. మొత్తంగా 58.43 శాతం ఉత్తీర్ణత బాలికల్లో 61, 25%, బాలురలో 55.94%గా నమోదైంది. జిల్లాల వారీగా ఫలితాలు పరిశీలిస్తే కృష్ణా జిల్లా 74 శాతంతో మొదటిదిగా నిజామాబాద్ 43 శాతంతో అట్టడుగున నిలిచాయి.

వృత్తిపర కోర్సు

వృత్తి విద్య కోర్సు ఫలితాల పరిశీలించినట్లయితే రెగ్యులర్ కేటగిరీలో 53.64% విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 64, 581మంది పరీక్షకు హాజరుకాగా, 34, 644 మంది ఉత్తీర్ణులయ్యారు. ఈ కోర్సులో బాలికల్లో 58.02% ఉత్తీర్ణులు కాగా, బాలుర ఉత్తీర్ణత 49.67%గా నమోదైంది . రెగ్యులర్ విద్యార్థుల్లో 12, 209 మంది 'ఎ' గ్రేడ్, 20, 172 మంది 'బి' గ్రేడ్, 2191 మంది 'సి' గ్రేడ్, 72 మంది 'డి' గ్రేడ్ పొందారు.

2011 ఇంటర్ ద్వితీయ

మార్చు

2011 మార్చిలో జరిగిన ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో బాలికలు, ఉత్తీర్ణతలో బాలుర కంటే మరోసారి పైచేయి సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా 8, 97, 495 మంది పరీక్షలు రాయగా 4, 48, 281 (63.27%) మంది ఉత్తీర్ణులయ్యారు.[3] గతేడాదికంటే ఈ సంవత్సరం 1.42 శాతం తక్కువ.

జనరల్ విద్యార్థులకు సంబంధించిన ఫలితాల్లో 7 6 శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా అగ్ర భాగాన నిలవగా, 49 శాతంతో నల్లగొండ జిల్లా అట్టడుగున ఉండిపోయింది. పరీక్షలు రాసిన బాలికల్లో 66.39 శాతం మంది, బాలురలో 60.61శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. .

ప్రభుత్వ కళాశాలలు

మార్చు

రాష్ట్రస్థాయిలో ఈ ఏడాది మొత్తం 63.27 శాతం మంది ఉత్తీర్ణులు కాగా, ప్రభుత్వ కళాశాలల్లో ఉత్తీర్ణత శాతం 62.53గా నమోదైంది. ఇది గత ఏడాది ఉత్తీర్ణత 61.48 శాతం ఉంది.

2010 ఇంటర్ ద్వితీయ

మార్చు

2010 మార్చిలో జరిగిన ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో బాలికలు, ఉత్తీర్ణతలో బాలుర కంటే మరోసారి పైచేయి సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా 9, 17, 794 మంది పరీక్షలు రాయగా వారిలో రెగ్యులర్ విద్యార్థులు 6, 95, 927 మంది, ప్రైవేట్ విద్యార్థులు 2, 21, 867 మంది ఉన్నారు. రెగ్యులర్ విద్యార్థుల్లో 4, 50, 248 (64.69%) మంది ఉత్తీర్ణులయ్యారు. ప్రైవేట్ విద్యార్థుల్లో 74, 915 (33.77%) మంది మాత్రమే పాసయ్యారు. రెగ్యులర్ విద్యార్థుల ఉత్తీర్ణత శాతం గత ఏడాదితో పోల్చితే 4.54 మేర పెరిగింది.

జనరల్ విద్యార్థులకు సంబంధించిన ఫలితాల్లో 77 శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా అగ్ర భాగాన నిలవగా, 53 శాతంతో అనంతపురం జిల్లా అట్టడుగున ఉండిపోయింది. పరీక్షలు రాసిన బాలికల్లో 67 శాతం మంది, బాలురలో 63 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. 75 శాతానికి పైగా మార్కులతో 1, 82, 408 మంది (40.51%) 'ఏ' గ్రేడ్ సాధించారు. మిగతా వారిలో 1, 65, 002 (36.65%) మంది 'బీ' గ్రేడ్ (60- 75% మార్కులు) పొందారు. మరో 78, 509 (17.44%) మందికి 'సీ'గ్రేడ్ (50-60% మార్కులు), మిగతా 24, 329 (5.40%) మందికి 'డీ' గ్రేడ్ (35-50% మార్కులు) వచ్చాయి. మొత్తం 622 మంది జనరల్ అభ్యర్థులపై మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదవగా, 84 మంది ఫలితాలను విత్‌హెల్డ్‌లో ఉంచారు. 73, 172 మంది కంపార్ట్‌మెంటల్‌లో పాసయ్యారు.

మొత్తం 60, 644 మంది ఒకేషనల్ అభ్యర్థుల్లో 48, 885 మంది రెగ్యులర్, 11, 759 మంది ప్రైవేట్ అభ్యర్థులున్నారు. రెగ్యులర్ విద్యార్థుల్లో 58.03 శాతం మంది పాస్ అయ్యారు. బాలికల్లో 63%, బాలురలో 54% ఉత్తీర్ణులయ్యారు. రెగ్యులర్ అభ్యర్థుల్లో 7, 684 మంది ఏ- గ్రేడ్, 18, 165 మంది బీ- గ్రేడ్, 2, 456 మంది సీ-గ్రేడ్, 63 మంది డీ-గ్రేడ్ సాధించారు. 22 మంది ఫలితాలను విత్‌హెల్డ్‌లో ఉంచారు. 3, 593 మంది కంపార్ట్‌మెంటల్‌లో పాసయ్యారు. ప్రైవేట్ విద్యార్థుల్లో 30.75% ఉత్తీ ర్ణత నమోదైంది.

ఆదిలాబాద్‌లో రికార్డుస్థాయిలో 82.89 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాది ఈ జిల్లాలో 43 శాతం మంది ఉత్తీర్ణులు కాగా ఈ ఏడాది 39.89 శాతం మంది అదనంగా పాసయ్యారు.

ప్రభుత్వ కళాశాలలు

మార్చు

రాష్ట్రస్థాయిలో ఈ ఏడాది మొత్తం 64.69 శాతం మంది ఉత్తీర్ణులు కాగా, ప్రభుత్వ కళాశాలల్లో ఉత్తీర్ణత శాతం 61.48గా నమోదైంది. గత ఏడాది ఉత్తీర్ణత 48.89 శాతం కాగా, ఈ ఏడాది 12.59 శాతం అదనంగా సాధించడం గమనార్హం.

గురుకులాలు

మార్చు

ఎస్సీ గురుకులాలు సగటున 83.95 శాతం ఉత్తీర్ణత సాధించాయి. మొత్తం 12, 656 మంది పరీక్షలు రాయగా 10, 561 మంది పాసయ్యారు. వీరిలో 2, 840 మంది ఏ గ్రేడ్, 6, 152 మంది బీ గ్రేడ్, 1, 426 మంది సీ గ్రేడ్, 103 మంది డీ గ్రేడ్ పొందారు. 193 కాలేజీల్లో 23 కాలేజీలు వంద శాతం ఉత్తీర్ణత సాధిస్తే, మూడు కాలేజీలు మాత్రం గత ఏడాదికంటే వెనుకబడ్డాయి.

ఎస్టీ గురుకులం పరిధిలోని మొత్తం 55 కాలేజీల్లో 77.59 శాతం ఉత్తీర్ణత నమోదైంది. గత ఏడాది ఉత్తీర్ణత 67.16తో పోలిస్తే ఇది 10.43 శాతం ఎక్కువ. మొత్తం 5, 382 మంది పరీక్షలు రాయగా 4, 176 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో 612 మంది ఏ గ్రేడ్, 2, 339 మంది బీ గ్రేడ్, 1, 030 మంది సీ గ్రేడ్, 195 మంది డీ గ్రేడ్ పొందారు. నిజామాబాద్ జిల్లాలోని గాంధారి గురుకులం ఒక్కటే 100 శాతం ఉత్తీర్ణత సాధించింది. తూర్పుగోదావరి జిల్లా అడ్డతీగల 32.58 శాతం, రంపచోడవరం 43.37 శాతం ఉత్తీర్ణతతో సరిపెట్టుకున్నాయి.

ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపికై, ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న మూడు ఎస్టీ ప్రతిభా కళాశాలల్లో (కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్సీ-సీఓఈ) విద్యార్థులు ప్రతిభ కనబర్చలేకపోయారు. వీరి ఉత్తీర్ణత శాతం సాధారణ గురుకులాల కంటే తక్కువగా ఉంది. పార్వతీపురం 85 శాతం, భద్రాచలం 78.46 శాతం, శ్రీశైలం 65.12 శాతం ఫలితాలను సాధించాయి. వీటికంటే 9 ఎస్టీ గురుకుల కాలేజీలు పై స్థానంలో ఉండడం గమనార్హం.

2009 ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలలో మొత్తం 6, 60, 341 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 3, 97, 170 అనగా 60.15 శాతంమంది ఉత్తీర్ణులయ్యారు. ఫలితాల్లో బాలికలదే పైచేయి అయింది. బాలికలు 62 శాతం మంది ఉత్తీర్ణులు కాగా, బాలురు 58 శాతం మంది మాత్రమే పాసయ్యారు. ఉత్తీర్ణతలతో 74 శాతంతో కృష్ణా జిల్లా ప్రథమ స్థానం పొందగా 43 శాతంతో మహబూబ్ నగర్ జిల్లా ఆఖరు స్థానంలో నిలిచింది.
2009 ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు మొత్తం 8, 22, 092 మంది విద్యార్థులు రాశారు. వీరిలో 3, 74, 174 మంది విద్యార్థులు అనగా 46.64 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ ఇంటర్ తొలి సంవత్సరపు ఫలితాల్లో బాలికలే ముందంజలో నిలిచారు. ఇందులో భాగంగా, 49.79 శాతం ఉత్తీర్ణతను బాలికలు నమోదు చేసుకోగా, బాలురు 44.11 శాతం సాధించారు. ఫలితాల్లో కృష్ణాజిల్లా అత్యధికంగా 63 శాతం ఉత్తీర్ణత సాధించగా, మహబూబ్ నగర్ అత్యల్పంగా 29 శాతం ఉత్తీర్ణతను నమోదు చేసుకుంది.

విభాగాలు

మార్చు

సమాజ శాస్త్ర విషయాలు(అర్ట్స్)

మార్చు

దీనిలో ముఖ్యమైనవి.

విజ్ఞాన (సైన్స్) విషయాలు

మార్చు

దీనిలో ముఖ్యమైనవి.

వృత్తి విద్య విషయాలు

మార్చు

వృత్తి విద్యను అందచేస్తున్న కాలేజీలు [4] 1244 ఉన్నాయి.

వనరులు

మార్చు
  1. "బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్". Archived from the original on 2010-01-13. Retrieved 2009-12-25.
  2. [ఆంధ్రజ్యోతి 25 ఏప్రిల్ 2012 లో వార్త]
  3. [సాక్షి 29 ఏప్రిల్ 2011 లో వార్త]
  4. "వృత్తి విద్యను అందచేస్తున్న కాలేజీలు". Archived from the original on 2009-04-21. Retrieved 2009-12-25.

లింకులు

మార్చు