ఇండియా మార్క్ II

ఇండియా మార్క్ II అనగా మానవ శక్తితో నడిచే పంపు, దీనిని 50 మీటర్లు లేదా అంతకు తక్కువ లోతుల నుండి నీటిని తోడేందుకు రూపొందించారు. మార్క్ II ప్రపంచంలో అత్యంత విస్తృతంగా ఉపయోగించే నీటి చేతి పంపు[1]. అభివృద్ధి చెందుతున్న దేశాలలో, గ్రామీణ ప్రాంతాలలోని గ్రామాలలో నీటి అవసరాలను తీర్చడానికి 1970 లో ఈ పంపును రూపొందించారు.

గ్రామీణ ఉగాండాలో ఇండియా మార్క్ II పంపు.

ఈ పంపును బోరు బావి మీద బిగిస్తారు. ఈ పంపు యొక్క హ్యాండిల్ ను పదేపదే పైకి కిందకి కదిలించడం ద్వారా బావిలో దిగువన ఉన్న నీరు పైకి వస్తుంది. 1990ల మధ్యలో ఐదు మిలియన్ల పంపులు తయారుచేయబడి ఉపయోగింపబడుతున్నవి.[1]

చరిత్రసవరించు

ఈ పంపును 1970 లో భారత ప్రభుత్వం, యునిసెఫ్, ప్రపంచ ఆరోగ్య సంస్థలు సంయుక్తంగా రూపొందించాయి. ప్రపంచంలో నీటి ఎద్దడి గల అనేక గ్రామాలలో నీటి సదుపాయం కల్పించుటకు ఈ పంపును రూపొందించడం జరిగింది. ఈ పంపులను వాడుటకు పూర్వం నాణ్యత తక్కువ గల చేత ఇనుముతో కూడిన పంపులను యూరోప్, ఉత్తర అమెరికాలలో ఉపయోగించేవారు. ఇటువంటి పంపులను యు.ఎస్ లో వ్యవసాయ కుటుంబాలు ఒక రోజుకు మూడు లేదా నాలుగు సార్లు వాడేవారు. ఈ పంపును భారతదేశంలో మొత్తం స్త్రీలు, పిల్లలు విరివిగా ఉపయోగించడం వలన వేగంగా పోవుట జరుగినది. ఆ కాలంలో యునిసెఫ్ ఒక సర్వే నిర్వహించి భారతదేశంలో ఈ పంపుల నాణ్యత గూర్చి తెలుసుకొనేటప్పుడు 75 శాతం పంపులు పనిచేయుటలేదని గమనించింది. ఈ పంపుల నిర్వహణ, వినియోగం గూర్చి వివిధ వర్క్ షాపులు నిర్వహించింది. ఆ కాలంలో మార్క్ 2 పంపు అధిక నాణ్యత కలిగిన పంపుగా గుర్తింపు పొందింది. దీనిని భారతీయ సాంకేతిక నిపుణులు తయారు చేశారు. 20 సంవత్సరాలలో ఒక మిలియన్ పంపులు తయారు కాబడినవి., ప్రపంచ వ్యాప్తంగా వినియోగంలోకి వచ్చినవి. ఒక భారతీయ పత్రిక ఈ మార్క్ 2 పంపు భారతదేశంలో ముఖ్య ఆవిష్కరణలలో ఒకటిగా అభివర్ణించింది.[2]

సాంకేతిక సమాచారంసవరించు

  • గరిష్ఠ వినియోగ లోతులు: 45 మీటర్లు (147 అడుగులు).
  • కనిష్ఠ బోర్ రంధ్ర పరిమాణం: 100mm
  • స్ట్రోక్ పొడావు: 125 mm
  • సిలిండర్ సెట్టింగ్ డెప్త్ అవధి: 9-45mm
  • ఒక స్ట్రోక్ కు విడుదల : 0.40 ltrs
  • ఒక గంటలో నీటి విడుదల: 0.8 m3

ఇండియా మార్క్ II పంపు, ప్రజారంగంలో ఉపయోగించుటకు డిజైన్ చేయబడిన చేతిపంపు. అంతర్జాతీయ డిజైన్ ను రూరల్ వాటర్ సప్లై నెట్వర్క్ (RWSN), చే నియంత్రించ బడుచున్నది, [3] అయిననూ, భారత్, ఘనా, ఉగాండాలో తమ తమ జాతీయ స్టాండర్డ్ ను అనుసరించి తయారు చేయబడిన పంపులు వాడబడుచున్నవి.

ఇవి కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

  1. 1.0 1.1 Wood, M. (1994): Are handpumps really affordable? Proceedings of the 20th WEDC Conference, WEDC pp. 132-134
  2. "Village water supplies" UNICEF http://www.unicef.org/sowc96/hpump.htm Archived 2016-03-03 at the Wayback Machine
  3. http://www.rural-water-supply.net/en/implementation/handpump-overview/india-mark-ii

ఇతర లింకులుసవరించు