ఇండ్ల చంద్రశేఖర్
ఈ వ్యాసాన్ని లేదా విభాగాన్ని సృష్టిస్తున్నారు, లేదా పెద్దయెత్తున విస్తరిస్తున్నారు. ఈ పేజీలో తగు మార్పుచేర్పులు చేసి దీని నిర్మాణానికి సంహకరించేందుకు మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాం. ఈ వ్యాసంలో లేదా విభాగంలో 24 గంటల పాటు దిద్దుబాట్లేమీ జరక్కపోతే, ఈ మూసను తీసివేయండి. ఈ మూసను పెట్టినది మీరే అయితే, మీరు చురుగ్గా దిద్దుబాట్లు చేస్తూ ఉంటే, ఈ మూసను తీసేసి, దీని స్థానంలో మీరు దిద్దుబాట్లు చేసే సెషన్లో మాత్రమే {{in use}} అనే మూసను పెట్టండి. మూస పరామితులను వాడేందుకు లింకుపై నొక్కండి.
ఈ article లో చివరిసారిగా దిద్దుబాట్లు చేసినది: రహ్మానుద్దీన్ (talk | contribs) 15 నెలల క్రితం. (Update timer) |
ఇండ్ల చంద్రశేఖర్ రచయిత, నాటక దర్శకుడు. ఇతడు రాసిన రంగుల చీకటి కథా సంకలనానికి 2021లో డా, వి. చంద్రశేఖర్ రావు కథా పురస్కారం, 2022లో రావి శాస్త్రి కథా పురస్కారం దక్కాయి.[2]
ఇండ్ల చంద్రశేఖర్ | |
---|---|
పుట్టిన తేదీ, స్థలం | కందుకూరు | 1984 అక్టోబరు 21
వృత్తి | నాటకరంగ ఉపాధ్యాయుడు |
భాష | తెలుగు |
జాతీయత | భారతదేశం |
పౌరసత్వం | భారతదేశం |
విద్య | పిహెచ్డి(నాటకరంగం) |
పూర్వవిద్యార్థి | నిర్మల్ విద్యా నికేతన్, కందులూరు(2000) ఆంధ్ర ప్రదేశ్ సాంఘీక సంక్షేమ జూనియర్ కళాశాల, వెలిగొండ(2000-2002) బి ఎస్సీ కంప్యూటర్స్, జవాహర్ భారతి డిగ్రీ కళాశాల కావలి(2006) మాస్టర్ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్, హైదరాబాద్ విశ్వవిద్యాలయం(2006-2008) M.Phil Pondicherry Central University (2008-09) PhD UoH(2010-2020) |
కాలం | 2003-ప్రస్తుతం |
రచనా రంగం | కథ, నాటకం, నవల |
విషయం | దళిత క్రైస్తవం, కాల్పనిక సాహిత్యం |
గుర్తింపునిచ్చిన రచనలు | రంగుల చీకటి, ఎర్ర గబ్బిలాల వేట[1] |
పురస్కారాలు | రావి శాస్త్రి కథా పురస్కారం(2022), డా. వి. చంద్రశేఖర రావు కథా పురస్కారం(2021), నంది నాటక పురస్కారం(2010) |
జీవిత భాగస్వామి | ఎజిల్ మతి |
సంతానం | రాజీవ్లోచన్, ఆద్విశ్రిత |
బాల్యం, చదువు
మార్చు21 అక్టోబర్ 1984న టంగుటూరు మండలం కందుకూరులో ఇండ్ల సత్యవతి, అంకయ్య దంపతులకు పుట్టాడు. పదవ తరగతి వరకు కందులూరులోని నిర్మల్ విద్యా నికేతన్ లో చదువుకున్నాడు. ఇంటర్ ప్రభుత్వ సాంఘీక సంక్షేమ గురుకులంలో చదువుకున్నాడు. బిఎస్సీ కంప్యూటర్స్ జవాహర్ భారతి డిగ్రీ కళాశాలలో పూర్తి చేసాడు. హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయంలో పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ లో స్నాతకోత్తర డిగ్రీలో గోల్డ్ మెడల్ పొందాడు. పాండిచ్చేరి కేంద్ర విశ్వవిద్యాలయంలో నాటకరంగంలో ఎం ఫిల్ పూర్తి చేసాడు. పిహెచ్డి హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయంలో "ఆడియెన్స్ రిసెప్షన్" అంశంపై 2020లో పూర్తి చేసాడు.
ఉద్యోగం
మార్చుది ఆఘాఖాన్ అకాడెమీ హైదరాబాదులో నాటకరంగోపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు.
రచనా వ్యాసంగం
మార్చుకథా సంకలనం
మార్చు- రంగుల చీకటి
నవల
మార్చు- యెర్రగబ్బిలాల వేట
గుర్తింపు
మార్చు- రెండు సార్లు కేంద్ర సాహిత్య అకాడెమీ యువ కథా సమావేశంలో తెలుగు రాష్ట్రాల ప్రతినిధిగా పాల్గొనడం.
- నాటకరంగంలో జేఅరెఫ్ నెట్
- నంది పురస్కారం
- సాక్షి ఉగాది కథల పోటీలో కన్సలేషన్ బహుమతి
మూలాలు
మార్చు- ↑ "Hyderabad Book Fair : నా జ్ఞాపకాలకు, నా జ్ఞానాన్ని కలిపి యెర్రగబ్బిలాలుగా చేసి.. !". Andhrajyothy Telugu News. 28 December 2022. Retrieved 23 September 2023.
- ↑ "Chandrasekhar Indla - Holding the baton of Telugu theatre | Aga Khan Academies". www.agakhanacademies.org. Retrieved 23 September 2023.