ఇందిరా పాయింట్
అండమాన్ నికోబార్ దీవుల్లోని గ్రామం
(ఇందిరా అగ్రము నుండి దారిమార్పు చెందింది)
ఇందిరా పాయింట్ (ఆంగ్లంలో: Indira Point) (దీనికి క్రితం పేరు, పిగ్మాలియన్ పాయింట్, కొంత స్వల్పకాలం ఇండియా పాయింట్ అని పిలువబడేది.) గ్రేట్ నికోబార్ ద్వీపాలలోని నికోబార్ దీవుల దక్షిణ భాగాన, భారతదేశానికి దక్షిణానగల హిందూ మహాసముద్రపు తూర్పుభాగంలో గలదు. ఇది దక్షిణ భారతదేశానికి చువరన ఉంది. ఈ ప్రదేశానికి ఇందిరా గాంధీ గౌరవార్థం ఇందిరా అగ్రం లేదా ఇందిరా పాయింట్ అని పేరు పెట్టారు.భారత ఉపఖండానికి దక్షిణాగ్రం కన్యాకుమారి అగ్రం, కానీ ఈ ఇందిరా పాయింట్, ఇంకనూ దక్షిణాన గలదు. ఈ మధ్య వచ్చిన సునామీ కారణంగా, ఈ ప్రాంతంలోని చాలా భాగం, ముంపునకు గురైనది. దీని దీప స్తంభం (లైట్ హౌస్) కూడా పాక్షికంగా ముంపునకు గురైనది. కాని భూగర్భ శాస్త్రజ్ఞుల ప్రకారం, ఈ ప్రాంతం కోలుకుంటోంది,, తన యదాస్థితికి చేరుకుంటోంది.