ఇంపీరియల్ హోటల్, న్యూఢిల్లీ

ది ఇంపీరియల్ న్యూఢిల్లీ హోటల్ ను 1931లో న్యూఢిల్లీలో నిర్మించారు. భారతదేశంలోని విలాసవంతమైన హోటళ్లలో ఇదీ ఒకటి. ప్రస్తుతం సెంట్రల్ న్యూఢిల్లీలో జనపథ్ అని పిలువబడ్ క్వీన్స్ వే ప్రాంతంలోని కన్నాట్ ప్లేస్ కు అతి సమీపంలో ఉంది. న్యూఢిల్లీలోని మొదటి విలాసవంతమైన గ్రాండ్ హోటల్ ఇదే.[1] నాటికీ, నేటికీ ఢిల్లీలో అత్యధిక ఆదాయం ఆర్జిస్తున్న హోటల్ ఇదే. గొప్ప కళాఖండంగా ఉన్న ఈ హోటల్లో ఓ మ్యూజియం, ఆర్ట్ గ్యాలరీ కూడా ఉన్నాయి.[2] న్యూఢిల్లీలో బిజినెస్ ఫ్రెండ్లీ హోటల్ గా దీనికి పేరుంది. ఎర్రకోట, హుమాయన్స్ సమాధి వంటి చారిత్రక ప్రదేశాలు దీనికి దగ్గరలోనే ఉన్నాయి.

ఇంపీరియల్ హోటల్, న్యూఢిల్లీ
సాధారణ సమాచారం
ప్రదేశంJanpath, New Delhi
ప్రారంభం1936
యజమానిAkoi Family
సాంకేతిక విషయములు
అంతస్థుల సంఖ్య3
రూపకల్పన, నిర్మాణం
వాస్తు శిల్పిBlomfield
ఇతర విషయములు
గదుల సంఖ్య233
సూట్ల సంఖ్య44
రెస్టారెంట్ల సంఖ్య6
జాలగూడు
The Imperial, Official website

చరిత్ర

మార్చు
 
Palm trees lining the entrance of Imperial Hotel

విక్టోరియన్, రాజరిక కాలమునాటి నిర్మాణ కౌశలం (ఆర్కిటెక్చర్) కలగలిపి నిర్మించిన ఈ హోటల్ ను 1931లో ప్రారంభమైంది. డి.జె.బ్లోమ్ ఫీల్డ్ అనే ఆర్కిటెక్చర్, ఎడ్విన్ లుటేయిన్స్ తో కలిసి ఆర్ట్ డెకో విధానంలో దీనిని డిజైన్ చేశారు. న్యూఢిల్లీలోని బ్రిటీస్ రాజుకు రాజధానిని డిజైన్ చేయడంలో కూడా ఎడ్విన్ లుటేయిన్స్పాలుపంచుకున్నారు. కలకత్తాకు బదులు న్యూఢిల్లీని రాజధానిగా ప్రకటించిన సందర్భంగా అప్పటి బ్రిటన్ రాజు గౌరవార్థం ఆర్.బి.ఎస్. నారాయణ సింగ్ కుమారుడైన ఎస్.బి.ఎస్. రంజిత్ సింగ్ ఇంపీరియల్ హోటల్ ను నిర్మించారు.[3][4]

1996-2001 మధ్య కాలంలో శ్రీ హర్వీందర్ షేకూన్ ఈ హోటల్‌కు జనరల్ మేనేజర్, ఉపాధ్యక్షుడుగా ఉండేవారు. ఆ కాలంలో ఈ హోటల్ కు కొత్త రూపు తెచ్చారు. ఈయన పనిచేసిన కాలంలో నెదర్లాండ్ మహారాణితో పాటు హాలివుడ్ నటీనటులు, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు ఇంపీరియల్ హోటల్లో ఆతిథ్యం పొందారు. అంతేకాదు హర్వీందర్ షేకూన్ మరో ఆరు రెస్టారెంట్లను కూడా ప్రారంభించారు. "స్పైస్ రూట్", "పాటియాలా పెగ్ బార్", "1911 రెస్టారెంట్ అండ్ బార్", "డానియల్స్ టావెర్న్", "సాన్ జిమిగ్నానో" పేర్లతో ఇవి ఉన్నాయి.వీటిలో ప్రతీ ఒక్కటి వేటికవే ప్రత్యేకత కలిగి ఉంటాయి.

వారసత్వ సంపద

మార్చు

న్యూ ఢిల్లీలోని హోటల్ ఇంపీరియల్ దేశ వారసత్వ సంపదగా గుర్తింపు పొందింది. పాటియాలా పెగ్గా సుపరిచితమైన విస్కీ పెగ్గు పేరుతో ఇక్కడ బార్‌ను ఏర్పరచారు. ఈ హోటల్ స్వతంత్ర సంగ్రామ సమయంతో పాటు అనంతరం కూడా అనేక చారిత్రక సంఘటనలకు సాక్షీభూతంగా నిలిచింది. ముఖ్యంగా భారత దేశ విభజన సమయంలో.. అప్పట్లో పండిట్ జవహార్ లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ, మహ్మద్ అలీ జిన్నా ఇక్కడే సమావేశమై అనేక విషయాలు చర్చించేవారు, భారత్ నుంచి పాకిస్థాన్ ఏర్పాటు చేయాలనే ఆలోచన పురుడు పోసుకుంది ఈ చారిత్రక హోటల్లోనే కావడం విశేషం. అంతేకాదు ఈ పేరుతో అలీఘర్ లో ఓ పాఠశాల కూడా ఉంది.[2]

అతిథి గదులు

మార్చు

ఇంపీరియల్ హోటల్లో మొత్తం 235 ఏసీ అతిథి గృహాలున్నాయి. అందమైన గదులు, మినీబార్, మెత్తటి మూడు పొరల పరువులతో, అన్ని రకాల సౌకర్యాలు ఈ హోటల్ కు అదనపు ప్రత్యేకతలుగా చెప్పుకోవచ్చు. స్నానాల గదుల్లో షవర్లు, టబ్ లవంటి అన్ని సదుపాయాలుంటాయి. వార్తా పత్రికలు, వాయిస్ మేయిల్ తో కూడిన మల్టీ లైన్ ఫోన్లు, 23 అంగులాల ప్లాస్మా టీవీలు, డీవీడీ ప్లేయర్లు, వైర్, వైర్ లెస్ హైస్పీడ్ ఇంటర్నెట్ ఉన్నాయి. ఇంటర్నెట్ ఉపయోగించేవారు సర్ ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. వంటి ఎన్నో సదుపాయాలు ఇక్కడ ఉన్నాయి.అంతేకాదు వినోదాన్ని అందించే సదుపాయాలు కూడా ఉన్నాయి. హెల్త్ క్లబ్, ఆవిరి స్నానపు గది, మసాజ్ ట్రీట్ మెంట్, ఫేసియల్, బ్యూటీ సేవలు ఉంటాయి. 5 నక్షత్రాల ఈ హోటళ్లో వ్యాపారులు ప్రత్యేక సమావేశాలు నిర్వహించుకునేందుకు ఆడియో, వీడియో పరికరాలున్నాయి. వ్యాపార సేవలు, వివాహాలకు సంబంధించిన సేవలు, పర్యాటకులకు టికెట్ల సహకారం వంటి సదుపాయాలు కల్పిస్తారు. అదనంగా కాఫీ, టీ, మంచినీళ్ల బాటిళ్లు కూడా ఉచితంగా అందజేస్తారు. అతిథుల కోరిక మేరకు హైపో అలర్జినిక్ బెడ్డింగ్, అదనపు టవల్స్, నిద్రలేపే ఫోన్ కాల్స్ సౌకర్యాలు కూడా కల్పిస్తారు. [5][6]

మిగతావి చదవండి

మార్చు
  • విలియం వారెన్, జిల్ గోచర్ (2007). ఆసియాలోనే విఖ్యాత హోటల్స్: ది రోమాన్సా ఆఫ్ ట్రావెల్. సింగపూర్:పెరిప్లస్ ఎడిసన్స్. ISBN 978-0-7946-0174-4
  • కిమ్ ఇంగ్లిష్, జాకబ్ టెరమ్ సేన్, పయా మేరీ మొల్ బెక్ (2004). కూల్ హోటల్స్:భారత్, మాల్దీవులు, శ్రీలంక. సింగపూర్:పెరిప్లస్ ఎడిసన్స్. ISBN 0-7946-0173-1

మూలాలు

మార్చు
  1. "Famous Hotels : Imperial New Delhi - the making of By Andreas Augustin". 4hoteliers.com. 11 December 2006.
  2. "The Imperial". Delhi, by Patrick Horton, Richard Plunkett, Hugh Finlay. Lonely Planet, 2002. ISBN 1-86450-297-5. p. 107-108.
  3. "The ImperialAsia's Legendary Hotels: The Romance of Travel". By William Warren, Jill Gocher. Tuttle Publishing, 2007. ISBN 0-7946-0174-X. p. 28.
  4. "Lodged' in the heart of New Delhi". Hindustan Times. 30 August 2011. Archived from the original on 31 ఆగస్టు 2011. Retrieved 24 జనవరి 2015.
  5. "The Imperial New Delhi". Cleartrip.com.
  6. "Restaurant". Archived from the original on 2015-02-06. Retrieved 2015-01-24.

బాహ్య లింకులు

మార్చు